రోడ్డు ప్రమాదంలో ఆనంద్ మహీంద్రా మేనల్లుడి మరణం

By Ravi

Anand Mahindra
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా మేనల్లుడు కవీష్ నాథ్ (32 ఏళ్లు) గోవాలోని అంజునాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం ఉదయం తెల్లవారుజామున స్కూటర్‌పై వెళ్తున్న కవీష్‌ను మితిమీరిన వేగంతో వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల సమాచారం. సెలవులను గడిపేందుకు మరియు స్కూబా డైవింగ్ (నీటిలోపల ఈత)ను నేర్చుకునేందుకు కవీశ్ గోవా వచ్చినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

కనీష్ నాథ్ స్వయానా ఆనంద్ మహీంద్రా చెల్లెకు కుమారుడు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాహుల్ కౌషిక్‌ను సరైన సమయంలో ఆల్కహాల్ పరీక్ష చేయటంలో అంజునా పోలీసులు విఫలమయ్యారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అతనికి బెయిల్ కూడా లభించింది. న్యూఢిల్లీలో మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన తర్వాత ఆనంద్ మహీంద్రాకు ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే ప్రత్యేక జెట్ విమానంలో మరణించిన వ్యక్తి తండ్రిని వెంటబెట్టుకొని ఆనంద్ మహీంద్రా గోవా వెళ్లారు.

కవీష్ చాలా తెలివైన కుర్రాడని, ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన కార్ డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకొని, కనీష్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. పోలీసులు తమ పని తాము చేయగలరని, వారిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ విషయంలో న్యాయం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహప్ పారికార్‌ను సంప్రదిస్తానని ఆనంద్ మహీంద్రా చెప్పారు. మరికొద్ది రోజుల్లో కవీష్ మహీంద్రా కంపెనీలో చేరాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2013, 17:51 [IST]
English summary
Mahindra and Mahindra CMD Anand Mahindra's 32-year-old nephew Kaveesh Nath was killed in Anjuna in Goa when his scooter was hit by a speeding car. The mishap took place in the wee hours on Monday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+