Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

సాధారణంగా వికలాంగులు ఈ సమాజంలో చాలా కష్టాలను ఎదుర్కోవాలి, చాలా ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతకడానికి ఒక యుద్ధమే చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక యువకుడు Mahindra And Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) కంపెనీ చైర్మన్ Anand Mahindra (ఆనంద్ మహింద్ర)నే ఆశ్చర్యానికి గురిచేశాడు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

Anand Mahindra సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికి తెలుసు. అప్పుడప్పుడు చాలా ఇంట్రస్టింగ్ విషయాలకు సంబంధించి కొన్ని వీడియోలను తన అధికారిక సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాడు. అంతకు ముందు కూడా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన చాలా వీడియోలను గురించి తెలుసుకున్నాం.

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

ఇప్పుడు ఒక దివ్యాంగుడు తన ప్రయాణానికి అనుకూలంగా ఒక వాహనాన్ని సృష్టించుకున్నాడు. ఇది Anand Mahindra ను సైతం హవాక్కయ్యేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను Anand Mahindra తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పాంచ్చుకున్నాడు.

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే, చక్రాల కుర్చీ ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీతో నడుస్తుంది. ఈ చక్రాల కుర్చీ దివ్యాంగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఇది సాధారణ చక్రాల కుర్చీ మాదిరిగా కాకుండా దీనికి ముందు భాగంలో చక్రాలు కూడా ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. దీనిని అవసరం లేదనుకుంటే తీసివేయవచ్చు.

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

వీడియోను షేర్ చేస్తూ Anand Mahindra ఇలా వ్రాసాడు, "ఈ వీడియో ఈత పాతది మరియు ఎక్కడనుంచి వచ్చింది అనే సమాచారం ఖచ్చితంగా తెలియదు, కానీ ఇది నిజంగా చాలా మంచి ఆలోచనాత్మక ఆవిష్కరణలా కనిపిస్తుంది. నిజంగా వికలాంగుల జీవితాలను ఇది ఎంతగానో వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి కావలసిన మద్దతు మరియు సహాయం చేయడానికి నేను సంతోషిస్తాను".

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

దివ్యాంగుల రవాణా విషయానికి వస్తే, వారు ఎక్కడికైనా వెళ్లాలన్నా మరియు రావాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, బ్యాటరీతో పనిచేసే ఆటోమేటిక్ వీల్ చైర్ వారికి చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ వీల్ చైర్ బ్యాటరీతో పనిచేస్తుంది కాబట్టి, ఆపరేట్ చేయడం సులభంగా ఉంటుంది ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

ప్రస్తుతం, Anand Mahindra చేసిన ఈ ట్వీట్ 22 వేలకు పైగా లైక్‌లు మరియు 3 వేలకు పైగా రీట్వీట్ చేయబడింది. అంతే కాకుండా కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు వికలాంగుల కోసం స్కూటర్లను తయారు చేయాలని ఆనంద్ మహీంద్రాను కోరారు. ఇలాంటి కొత్త మరియు వినూత్న ఆవిష్కరణలకు ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల సహాయపడాలని చెప్పారు.

కొంతమంది ప్రజలు ఆనంద్ మహీంద్రా స్వయంగా ఇలాంటి ఆవిష్కరణలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసారు. మరి కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు అధిక వ్యయం కారణంగా వైకల్యాలున్న వ్యక్తులకు ఆటోమేటిక్ ట్రైసైకిళ్లు అందుబాటులో లేవని చెప్పారు. అటువంటి పరిస్థితిలో, వారు ఒక సాధారణ ట్రైసైకిల్ తొక్కవలసి ఉంటుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ మరియు ప్రయివేట్ సంస్థలు దివ్యాంగులకు అనుకూలమైన వాహనాల తయారు చేయాలి.

ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు చాలా ఆసక్తికరంగా ఉండే వీడియోలను పంచుకుంటూ ఉంటాడు. ఇందులో నుంచి వచ్చినదే ఈ వీడియో కూడా. ఆనంద్ మహీంద్రా సామజిక సేవ కూడా చేస్తూ ఉంటాడు.

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

ఇలాటి సంఘటన గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లోని ముండ్రా తాలూకాకు చెందిన 47 ఏళ్ల ధంజీభాయ్ కేరై తన పట్టుదలతోస్కూటర్‌కు అనుగుణంగా స్కూటర్ వెనుక చక్రానికి ఇరువైపులా రెండు చక్రాలు ఏర్పాటు చేశారు. అప్పుడు వారు తమ చేతులకు హ్యాండిల్ సులభతరం చేయడానికి సీటు ముందు మరొక సీటును జత చేసి తనకు అనుకూలంగా మార్చుకుని అందరి ప్రశంసలు పొందాడు.

నిజంగానే పట్టుదల ఉంటే వారి ముందు వైకల్యం కూడా బానిసవుతుంది. అందుకే కదా అన్నారు 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అని.

Anand Mahindra మనసు దోచిన వీడియో.. మీరూ చూడండి

ఆనంద్ మహీంద్రా మరియు మహీంద్రా కంపెనీ విషయానికి వస్తే, ఇతడు ఒక భారతీయ బిలియనీర్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్. మహీంద్రా కంపెనీ ఇప్పుడు ప్రముఖ కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిందనే విషయం కూడా తెలిసిందే. మహీంద్రా కంపెనీ ఏరోస్పేస్, అగ్రి బిజినెస్, ఆటోమోటివ్, కాంపోనెంట్స్, రక్షణ, శక్తి, వ్యవసాయ పరికరాలు, ఫైనాన్స్ మరియు బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ మరియు రిటైల్‌ వంటివాటిలో కూడా లీనమై ఉంది.

Most Read Articles

English summary
Anand mahindra offers help to electric wheelchair innovator shares video on twitter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X