ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధుడిని (డ్రైవర్‌ను) కలవాలంటూ ట్వీట్

భారతదేశంలో సృజనాత్మకతకు ఏ మాత్రం కొదువ లేదు. దీనికి నిదర్శనంగా ఇప్పటికే చాలా సంఘటనలు వెలువడ్డాయి. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి మరో సంఘటనకు సంబంధిచిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా'ను సైతం ఆకర్శించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సొసైల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈయన అప్పుడప్పుడు ఆసక్తికరమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల కూడా ఒక వీడియోలు పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను లక్షలమంది లైక్ చేశారు.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

ఇక అసలు విషయానికి వస్తే, ఇక్కడ కనిపించే 'ట్రైక్' అనేది మూడు చక్రాలతో నడిచే ఒక వాహనం. ఇలాంటి వాహనాలను చాలామంది తమకు అనుకూలంగా ఉండే విధంగా మాడిఫైడ్ చేసుకుని ఉపయోగించుకుంటారు. అయితే ఇక్కడ కనిపించే ట్రైక్‌ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చూడటానికి ఎఫ్1 రేస్ లో ఉపయోగించే ఒక వెహికల్ మాదిరిగా కనిపిస్తుంది.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

ఈ వాహనాన్ని ఒక మిల్క్ మ్యాన్ ఉపయోగిస్తున్నాడు. ఇందులో ఆ పాల వ్యాపారి ఆ వాహనం యొక్క వెనుక భాగంలో పాల క్యాన్ వంటి వాటిని కూడా తీసుకెళ్లడానికి అనుకూలంగా మార్చుకున్నాడు. అంతే కాకూండా ఆ పాల వ్యాపారి ఆ వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ మరియు జాకెట్ వంటి వాటిని కూడా ధరించి ఉండటం వీడియోలో చూడవచ్చు.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

ఈ వీడియాలో మీరు గమనించినట్లైతే ఈ వాహనానికి ముందు భాగంలో బ్యాటరీలు కూడా అమర్చబడి ఉన్నాయి. ఈ బ్యాటరీల ద్వారా ఈ వెహికల్ శక్తిని పొందుతుంది. ఈ వీడియోలో ఈ వెహికల్ వేగంగా వెళ్లడం చూడవచ్చు. ఈ మొత్తం వీడియోను కారు వెళ్లే వారు షూట్ చేయడం కూడా మీరు గమనించవచ్చు. ఈ వీడియోను 'రోడ్స్ ఆఫ్ ముంబయి' ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

ఈ వీడియో ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసాడు. ఈ వాహనం రహదారి నియమాలకు అనుకూలంగా ఉందా.. లేదా ఏ విషయం ఖచ్చితంగా తెలియదు. అయితే దీనిని చూస్తే ఆ వ్యక్తికి (పాల వ్యాపారి) వాహనాలపైన ఎంత అభిరుచి ఉందొ మనకు స్పష్టంగా తెలుస్తుందని తెలిపాడు.

అంతే కాకూండా.. ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది, నిజంగా యితడు ఒక యోధుడని, ఇతనిని నేను కలవాలనుకుంటున్నాని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

సాధారణంగా భారతీయ వాహన చట్టం ప్రకారం, వాహనాలు రహదారి చట్టాలకు అనుకూలంగా ఉండాలి. దాదాపుగా మోడిఫైడ్ వాహనాలను ఉపయోగించడం చట్ట విరుద్ధం. కావున భారతీయ చట్టం ప్రకారం వినియోగదారులు తమ వాహనాలను సవరించడానికి అనుమతించబడదు.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

ఒక వేళా తమకు నచ్చిన వాహనాలను తమకు నచ్చిన విధంగా మాడిఫైడ్ చేసుకుంటే అవి ప్రజా రహదారులపైన ఉపయోగించకూడదు. ఇవి పూర్తిగా చట్ట విరుద్ధం. కావున వీటిని రేస్ ట్రాక్ లేదా ఓపెన్ గ్రౌండ్ వంటి ప్రైవేట్ ప్రాపర్టీలలో మాత్రమే ఉపయోగించాలి. వాహనాలను మోడిఫైడ్ చేసుకునే వారు దీనిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. అంతే కాకూండా ఇలాంటి మోడిఫైడ్ వాహనాలు ప్రజా రహదారులపైన కనిపిస్తే వీటిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

భారతీయ మోటార్ వాహన చట్టం ప్రకారం, ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా తమ వాహనాలను సురక్షితంగా పబ్లిక్ రోడ్లపై ఉపయోగించడానికి అనుకూలంగా ఉండేలా తయారు చేయాలి. కంపెనీలు తయారు చేసే వాహనాలు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ మరియు తగిన స్థాయిలో సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటికి దృష్టిలో ఉంచుకుని తయారు చేయడం జరుగుతుంది.

ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన వీడియో.. యోధున్ని కలవాలంటూ ట్వీట్

ఇటీవల వెలువడిన కొన్ని నియమాల ప్రకారం, కంపెనీలు తమ నాలుగు చక్రాల వాహనాలలో ఏబీఎస్ మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా పొందుపరచాలని తెలిసింది. వాహన వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

More from DriveSpark

Article Published On: Sunday, May 1, 2022, 8:30 [IST]
English summary
Anand mahindra posted video of jugaad trike of milkman in bihar details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+