రైతు అవమానంపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్.. ఏం చెప్పాడంటే?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో మహీంద్రా డీలర్‌షిప్‌లో రైతుని సేల్స్‌మ్యాన్ అవమానించడం. ఈ వీడియో ఇప్పుడు ఏకంగా మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా వరకు చేరింది. దీనిపైన ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, దీనిపైన స్పందించిన ఆనంద్ మహీంద్రా వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన విలువ అని ప్రస్తావించారు. కస్టమర్ల పట్ల కంపెనీ మర్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుని అవమానించిన వారిపట్ల త్వరలోనే చర్యలు తీసుకుంటాము అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై ఆనంద్ మహీంద్రా ఒక్కరే కాదు. ఈ విషయంపైన మహీంద్రా & మహీంద్రా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా కూడా తన స్పందనను తెలియజేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అతను తన పోస్ట్‌లో కస్టమర్ సెంట్రిక్ అనుభవాన్ని అందించడంలో డీలర్లు అంతర్భాగం అని తెలిపారు. అంతే కాకూండా మేము మా కస్టమర్‌లందరికీ మర్యాదపూర్వక గౌరవాన్ని అందిస్తాము.

ప్రస్తుతం మేము ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాము మరియు ఫ్రంట్‌లైన్ సిబ్బందికి కౌన్సెలింగ్ మరియు శిక్షణతో సహా ఏవైనా ఉల్లంఘనల విషయంలో తగిన చర్యలు తీసుకుంటాము, దీనిపై నక్రా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే త్వరలో కారకులపైన చర్యలు తీసుకుంటారని స్పష్టం అవుతోంది.

రైతుకు జరిగిన అవమానానికి సంబంధించిన విషయానికి వస్తే, కర్ణాటకలో తుమకూరు ప్రాంతానికి చెందిన కెంపెగౌడ అనే రైతు తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌కి తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. అయితే వారి వేషాలను చూసిన అక్కడి షోరూమ్ లోని ఒక సేల్స్‌మేన్ వారిని ఎంతగానో అవమానించాడు. అంతటితో ఆగకుండా ఆ సేల్స్‌మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని, కనీసం మీ జేబులో 10 రూపాయలు కూడా ఉండవని ఎగతాళి చేసాడు.

సేల్స్‌మేన్ వారికి బలవంతంగా ఆ షోరూమ్ నుంచి బయటకు పంపించేశాడు. ఆ సేల్స్‌మేన్ మతాలకు బాధపడిన ఆ రైతు కేవలం ఒక గంట వ్యవధిలోనే రూ. 10 లక్షలు తీసుకువచ్చి, మహీంద్రా బొలెరో (Mahindra Bolero) డెలివరీ చేయమని చెప్పాడు. ఇది చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు.

అయితే అక్కడ మహీంద్రా బొలెరో ప్రస్తుతానికి లేదని కనీసం నాలుగురోజులు వ్యవధి కావాలని అక్కడి వారు చెప్పారు. ఆ మాటలకూ చిర్రెత్తిన ఆ రైతు ఒక్కసారిగా వారిపైన మండిపడ్డాడు. ఆ సేల్స్‌మేన్ మీదికి గొడవకు దిగాడు. ఈ సంఘటనతో అక్కడ మొత్తం గొడవ వాతావరణం ఏర్పడింది. అందరూ ఆ రైతుని సర్ది చెప్పడానికి చూసారు.

రైతు కెంపెగౌడ ఆ సేల్స్‌మేన్ పై మండిపడటమే కాకుండా అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది.

దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో 'ఆనంద్ మహీంద్రా' ను ట్యాగ్ చేస్తూ అప్లోడ్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతోంది. అయితే చివరకు ఆ రైతు ఇంతగా అవమానించిన ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. ఇక ఈ ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, కార్ షోరూమ్ సిబ్బంది తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రైతు కెంపెగౌడ విషయానికి వస్తే, యితడు కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. తుమకూరు జిల్లాలో కావాల్సిన నీరు అందుబాటులో ఉండటంతో అక్కడి రైతులు సంవత్సరం మొత్తం వ్యవసాయం చేస్తుంటారు. కావున ఇక్కడ రైతులు బాగా అభివృద్ధి చెంది ఉన్నారు.

మహీంద్రా బొలెరో మరియు బొలెరో పికప్ ట్రక్కు అనేవి గ్రామీణ పట్టణాలు మరియు వ్యవసాయ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన వాహనాలు. ఇవి చాలా కాలం పాటు భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్నాయి. దేశీయ విఫణిలో మహీంద్రా బొలెరో పిక్-అప్ ప్రారంభ ధర రూ. 8.64 లక్షలు (ఎక్స్-షోరూమ్), మరోవైపు మహీంద్రా బొలెరో ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








