తొలి ఫోల్డబుల్‌ డైమండ్‌ ఫ్రేమ్ ఇ-బైక్‌పై ఆనంద్‌ మహీంద్రా రైడ్‌... హార్న్‌బ్యాక్‌ స్టార్టప్‌పై ప్రశంసలు!

మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. దేశ విదేశాల్లో నిర్వహించిన క్రీడా పోటీలు సహా ఇతర విభాగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారిని అభినందిస్తుంటారు.

ఆనంద్‌ మహీంద్రా తన సోషల్‌ మీడియా వేదికగా విజేతలపై ప్రశంసలు కురిపిస్తుంటారు. తోచిన విధంగా వివిధ రకాల బహుమతులు ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ట్విట్టర్ (X) ఖాతాలో ఫోల్డబుల్‌ డైమండ్‌ ఫ్రేమ్ ఇ-బైక్‌ను పోస్ట్‌ చేశారు. ఇ-బైక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

anand mahindra on hornback startup

బాంబే ఐఐటీ విద్యార్థులకు చెందిన స్టార్టప్ హార్న్‌బ్యాక్ (Hornback e bike) బైక్‌ను అభివృద్ధి చేసింది. ఈ స్టార్టప్‌లో ఆనంద్‌ మహీంద్రా పెట్టుబడి పెట్టారు. ఈ ఇ-బైక్‌ను మహీంద్రా సంస్థ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇ-బైక్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్‌ చేశారు.

వినియోగించిన అనంతరం ఈ బైక్‌ను ఫోల్డింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫోల్టింగ్‌ చేసి, తన కారులో పెడుతున్న ఫోటోలను కూడా ఆనంద్‌ మహీంద్రా తన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ ఇ-బైక్‌ ఫోటోలతోపాటు స్టార్టప్‌ బృందంపై కీలక ప్రశంసలు కురిపించారు.

anand mahindra on IIT bombay e bike

'ఐఐటీ బాంబే విద్యార్థుల బృందం మరోసారి మనం గర్వపడేలా చేసింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ డైమండ్‌ ఫ్రేమ్‌ ఇ-బైక్‌ను అభివృద్ధి చేసింది. సాధారణ ఇ-బైక్‌లతో పోలిస్తే.. హార్న్‌బ్యాక్‌ తయారుచేసిన ఇ-బైక్‌ 35 శాతం అదనపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కార్యాలయంలో తన అవసరాలకు X1 ఇ బైక్‌ను తీసుకున్నాను. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది.' అని ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ చేశారు.

బాంబే ఐఐటీ విద్యార్థులు స్థాపించిన హార్న్‌బ్యాక్‌ స్టార్టప్‌ తయారు చేసిన ఇ బైక్ X1 ధర రూ.45,000గా ఉంది. 36V, 7.65Ah రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 250W, 36Nm మోటార్‌తో జతచేయబడుతుంది. ఈ బ్యాటరీని గృహ విద్యుత్‌ కనెక్షన్‌పై 3 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్‌ చేయవచ్చు. మరియు సింగిల్‌ ఛార్జింగ్‌తో 45 కి.మీ ప్రయాణం చేయవచ్చు.

anand mahindra hornback X1 e bike

ఈ హార్న్‌బ్యాక్‌ X1 ఇ-బైక్‌లో అధునాతన ఫీచర్లున్నాయి. LCD డిస్‌ప్లేను అమర్చారు. దీని సాయంతో వేగం, బ్యాటరీ స్థాయిని తెలుసుకోవచ్చు. ఇ-బైక్‌ 28 అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంటుంది. X1 ఇ-బైక్‌ గ్రే-ఆరెంజ్‌ మరియు బ్లూ- ఆరెంజ్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఇటీవల ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌బాబుపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల విజేతగా ఎదిగారంటూ ప్రశంసించారు. రామ్‌బాబు కుటుంబ అవసరాల కోసం ఓ మహీంద్రా వాహనాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రామ్‌బాబు ఆసియా క్రీడల్లో 35 కి.మీ వాక్‌ రేస్‌లో కాంస్య పతకాన్ని సాధించారు.

Foldable diamond frame e bike X1

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, October 23, 2023, 11:47 [IST]
English summary
Anand mahindra rides on hornback x1 e bike made by indian startup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+