ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో చూస్తే మీరేమంటారో..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎన్నెన్నో ఆసక్తికరమైన వీడియోలను లేదా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సైతం ఆయన సమాధానం ఇస్తూ ఉంటారు. ఇటీవల తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఏముంది? వీడియో షేర్ చేస్తూ ఏమైనా పేర్కొన్నారా? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ ట్రాఫిక్ పోలీస్ ఉండటం చూడవచ్చు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్న బైకర్‌ను ఆపడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత డ్యాన్స్ వేసుకుంటూనే సరదాగా డ్యూటీ చేసేస్తున్నారు. నిజానికి ఆ ట్రాఫిక్ పోలీస్ తన డ్యూటీనీ ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

నిజానికి ట్రాఫిక్ పోలీస్ అంటే వాహనాలను నియంత్రిస్తూ.. అలసిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కనిపించే పోలీస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో వెలుగులోకి వచ్చిన సంఘటనల్లో కొందరు పోలీసులు డ్యూటీ చేస్తూనే సొమ్మసిల్లిన సందర్భాలు ఉన్నాయి. అలంటి క్లిష్టమైన ఉద్యోగాన్ని కూడా పోలీస్ డ్యాన్స్ చేసుకుంటూ చేసేస్తున్నారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వీడియోలో డ్యాన్స్ చేస్తూ డ్యూటీ చేస్తున్న పోలీస్ తన చేతులని సంకేతాలుగా ఉపయోగిస్తూ.. చాలా హుషారుగా ఉన్నారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. డ్యూటీ ఏ మాత్రం బోరింగ్ వర్క్ కాదంటూ నిరూపించారు. అని ప్రశంసిస్తూ మండే మోటివేషన్ అనే ట్యాగ్ చేర్చారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలో లెక్కకు మించిన లైక్స్, వ్యూవ్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి.

పనిని ఇష్టంగా చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుందని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ డబ్బు సంపాదించుకోవడానికి ఇదో మార్గం అంటూ కూడా పేర్కొన్నారు. ఇంకొందరు డ్యాన్స్ చేసే పోలీసును చూస్తూ పొతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.ఎవరేమన్నా డ్యూటీలో పోలీస్ చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే హెల్మెట్ లేకుండా కనిపించిన రైడర్ నుంచి చలానా వసూలు చేసారా..లేదా అనేది తెలియదు.
నిజానికి డ్యూటీలో హుషారుగా ఉండటం మంచిదే.. అయితే ట్రాఫిక్ పోలీస్ డ్యాన్స్ చూస్తూ ఏదైనా ప్రమాదం జరిగితే? దానికి పోలీస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి పోలీస్ డ్యూటీలో డ్యాన్స్ చేయడం సరైనది కాదని పలువురు చెబుతున్నారు. అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.
ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే.. వీడియో ప్రారంభంలో ఒక బైకర్ హెల్మెట్ ధరించకుండా కనిపించారు. వారి తరువాత ఒక బైకు మీద నలుగురు వ్యక్తులు వెళ్లడం కూడా చూడవచ్చు. ఇలాంటివన్నీ సరైనవి కాదు. హెల్మెట్ లేకుండా వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణాలే పోవచ్చు. అదే విధంగా ఒక బైకు మీద ఎక్కువమంది ప్రయాణించినప్పుడు ప్రమాదం జరిగితే? జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








