భావోద్వేగానికి గురైన ఆనంద్ మహీంద్రా.. కాలం మారింది.. మన కార్ల ముందు మోకరిల్లిన విదేశీయులు..

ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మౌలిక వసతులు, ఉపాధి, పెట్టుబడుల పరంగా వెనుకబడి ఉన్న దేశం ఇప్పుడు అత్యంత వేగంతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా వ్యాపార మార్కెట్ తీవ్ర అస్ధిరతతో కొట్టుమిట్టాడుతున్నప్పటికి భారత్ మాత్రం అన్ని పరిస్థితులను తట్టుకుని గట్టిగా నిలబడింది. ఇప్పుడు ఇతర దేశాల చూపు మొత్తం కూడా భారత్‌ వైపే ఉంది. ముఖ్యంగా ఆటో పరిశ్రమ భారతదేశ అభివృద్ధికి తోడ్పాటు అందించే అతిపెద్ద రంగం. జనాభా పెరుగుతున్నంత వేగంగా దేశీయ వాహన పరిశ్రమ కూడా విపరీతంగా వృద్ధి చెందుతుంది. దేశీయ కంపెనీలు అయినటువంటి టాటా మోటార్స్, మహీంద్రా వంటి అతిపెద్ద వాహన తయారీ కంపెనీలు విదేశాల్లో కూడా భారత బ్రాండ్‌ను మారుమోగిస్తున్నాయి.

ముఖ్యంగా ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌ను భారత్, ప్రపంచదేశాలను ఆశ్యర్యంలో ముంచెలా నిర్వహించింది. ఈ కార్యక్రమం వలన ఆటోమొబైల్ రంగంలో భారత్ రేంజ్ బాగా పెరిగింది. ఇతర దేశాల్లో జరిగి ఆటో ఈవెంట్‌ల కంటే పెద్దగా అందరిని ఆకట్టుకునేలా విజయవంతంగా భారత్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. విదేశాల్లో జరిగే ఆటో ఎక్స్‌పోలను చూసే రోజులు పోయి ఇప్పుడు భారత్ వైపు చూసే రోజులు వచ్చాయి.

Anand Mahindra Social Media Posts

భారత్ ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా అత్యున్నత స్థాయిలో ఉంది. ఆటో ఎక్స్‌పోను నిర్వహించడం సక్సెస్‌గా నిర్వహించడం వలన భారత్ గురించి అన్ని దేశాలు గొప్పగా మాట్లాడుకుంటున్నాయి. ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో దేశీయంగా టాప్ కంపెనీలుగా ఉన్న పలు వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇవి లోకల్ సందర్శకులను మాత్రమే కాకుండా విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులను సైతం బాగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఈ ఆటో ఎక్స్‌పోలో ఔత్సాహికులను చూసిన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దేశీయంగా తయారైన ఎలక్ట్రిక్ కార్లను ఆశ్చర్యంగా చూసి వాటితో ఫోటోలు దిగిన జపాన్, కొరియా ప్రతినిధులను చూసిన ఆనంద్ మహీంద్రా దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. జపాన్, కొరియాకు చెందిన వారు BE6,XEV 9E కార్లను ఫోటోలు తీసుకున్నారు.

Japanese Visitors Taking Photos Of be6 xev 9e

దీని తాలుకు ఫోటోను సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకుంటూ, "దశాబ్దాల క్రితం, ఆటో పరిశ్రమలో కెరీర్‌ను ప్రారంభించినప్పుడు, మా భారతీయ ప్రతినిధులు అంతర్జాతీయ ఆటో షోలకు వెళ్లి ఫోటోలు తీయడానికి పోటీ పడేవారు. విదేశాల్లో తయారైన లేటెస్ట్ కార్లను అధ్యయనం చేసేవారు" అయితే, ఇప్పుడు ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో కొరియా, జపాన్ ప్రతినిధులు మా కార్లను ఫోటోలు తీయడం చూసినప్పుడు భావోద్వేగాలను మీరు ఊహించుకోవచ్చు అని రాశారు.

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. భారతీయులంతా కూడా భావోద్వేగానికి గురవుతూనే, దేశ సాధించిన గొప్ప పురోగతికి ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహీంద్రా BE 6e,XEV 9e ఎలక్ట్రిక్ SUVలు ఆటో ఎక్స్‌పోలో బాగా ఆకట్టుకున్నాయి. వీటికి సంబంధించిన బుకింగ్స్‌ను ఫిబ్రవరి 14 నుంచి అధికారికంగా ప్రారంభిస్తామని కంపెనీ ఇటీవల ప్రకటించింది.

Anand Mahindra Shared Auto Expo Photos

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 7, 2025, 15:38 [IST]
English summary
Anand mahindra shared japanese and korean visitors taking photos of be6 xev 9e electric cars
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+