ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

మహీంద్రా గ్రూప్ ప్రెసిడెంట్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో తనను ఆకట్టుకునే అంశం ఏదైనా కనిపిస్తే, వెంటనే దానిని తన వాల్ పై షేర్ చేసి, తన అనుచురలతో పంచుకుంటారు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన ఇలాంటి ఆసక్తికర పోస్టులు చేశారు. తాజాగా, ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఓ స్కూటర్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

ఓ కస్టమైజ్డ్ బజాజ్ చేతక్ (పాత మోడల్) స్కూటర్ ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో పాత కాలపు బజాజ్ చేతక్ స్కూటర్ ను రంగు రంగుల ఎల్ఈడి లైట్లు, ఆభరణాలు, పూసలతో అలంకరించబడి ఉంది. అంతేకాకుండా, ఈ స్కూటర్ ముందు భాగంలో హ్యాండిల్ పైభాగంలో ఓ చిన్నపాటి కలర్ డిస్‌ప్లే స్క్రీన్ కూడా ఉంది. దానిపై వీడియోలు ప్రదర్శించవచ్చు, ఇది మొబైల్ స్ట్రీమింగ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

ఈ మ్యూజికల్ స్కూటర్ ను చూసిన ఆనంద్ మహీంద్రా ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇలా రంగులమయంగా ఉండాలని, ఇలాంటివన్నీ భారతదేశంలోనే జరుగుతాయనే (#OnlyIndia) హ్యాష్ ట్యాగ్ తో రీపోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ స్కూటర్ సవరించిన బజాజ్ చేతక్ అని తెలుస్తోంది మరియు ఇది ఓ పెట్రోల్ పంపు వద్ద కెమెరా కంటపడింది. ఆ సమయంలో స్కూటర్ స్క్రీన్‌పై 'చుప్ గయే సారే నజారే' అనే హిందీ పాట కూడా ప్లే అవుతోంది.

ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

ఈ స్కూటర్ బాడీ చుట్టూ ఎల్ఈడి స్ట్రైప్ లైట్స్ ఉంటాయి. ఈ సీరియల్ లైట్స్ విభిన్న రంగులలో వెలుగుతూ ఆరుతూ ఉంటాయి. హెడ్‌ల్యాంప్ క్లస్టర్ లోని లైట్ బల్బ్ కూడా విభిన్న రంగులలో బ్లింక్ అవుతూ ఉంటుంది. స్కూటర్ ముందు భాగంలో స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ పై ఓ చిన్న డిజిటల్ క్లాక్ మరియు లోపలి భాగంలో రెండు పెద్ద స్పీకర్లు కూడా అమర్చబడి ఉన్నాయి. హెడ్‌ల్యాంప్ పైభాగంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డోమ్ మరియు దానిలో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అమర్చబడి ఉంది.

ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

ఇది పాత కాలపు బజాజ్ చేతక్ స్కూటర్ మరియు పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఆనంద్ మహీంద్రా తర్వాత ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. ఈ స్కూటర్ అందాన్ని చూసిన వారంతా ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ స్కూటర్ యొక్క నెంబర్ ప్లేట్ ను బట్టి చూస్తే, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాహనంగా తెలుస్తోంది. సాధారణంగా, చాలా మంది తమ టూవీలర్లను కొత్త గ్రాఫిక్స్ మరియు ఆఫ్టర్‌మార్కెట్ బాడీ కిట్స్ తో కస్టమైజ్ చేయించుకుంటారు.

ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

కానీ, ఈ స్కూటర్ ఔత్సాహికుడు మాత్రం తన స్కూటర్ ను నగలు, ఆభరణాలతో అలంకరించుకున్నాడు. ఈ కస్టమైజేషన్ ప్రక్రియ మొత్తం పూర్తిగా చేతితో చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి విచిత్రమైన కస్టమైజేషన్లను భారతదేశంలో అనుమతి లేదు. భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం, ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చిన వాహనాన్ని ఆమోదయోగ్యం కాని పరికరాలతో కస్టమైజ్ చేయడం నేరం. ఇందుకు జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది.

ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

వెహికల్ కస్టమైజేషన్ వలన భారతదేశంలో అసలు స్వరూపం కోల్పోయిన మోడిఫైడ్ వాహనాలను పోలీసులు జప్తు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో సదరు చేతక్ స్కూటర్ యజమానికి జరిమానా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, పోలీసులు అతడి మోడిఫికేషన్ టాలెంట్ ను శభాష్ అంటారో లేక రోడ్డుపై డిస్ట్రాక్షన్ కలిగించే ఇలాంటి వాహనాలను స్టేషన్ కు తరలిస్తారో వేచి చూడాలి.

బజాజ్ చేతక్ స్కూటర్లు 1980వ దశకంలో భారత్‌లో ఓ వెలుగు వెలిగాయి. మొదట్లో ఇవి హ్యాండ్ గేర్లు కలిగిన స్కూటర్ల రూపంలో వచ్చాయి. ఇప్పటికీ చేతక్ స్కూటర్లు అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. భారత స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత కీలక మార్పులకు నాంది వేసిన మోడళ్లలో చేతక్ కూడా ఒకటి. అయితే, కాలక్రమేనా గేర్‌లెస్ స్కూటర్లకు ఆదరణ పెరగడం మరియు బజాజ్ ఈ పాత కాలపు స్కూటర్ ను కొత్తదనానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడంలో విఫలం కావడంతో ఈ మోడల్ కాస్తా మార్కెట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..

అయితే, భారతీయుల ఫేవరెట్ స్కూటర్ అయిన చేతక్‌ను బజాజ్ ఆటో గత సంవత్సరం ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో తిరిగి విడుదల చేసింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లలో అందుబాటులో ఉంటుంది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 1.42 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో (అర్బన్ మరియు ప్రీమియం) లభిస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh IP 67 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్ పై ఎకో మోడ్‌ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Anand mahindra shared musical bajaj chetak scooter video details
Story first published: Saturday, June 25, 2022, 15:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X