మహీంద్రా సంస్థ తొలి ఎలక్ట్రిక్ వాహనం ఫోటో షేర్‌చేసిన ఆనంద్ మహీంద్రా..!
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం పెరుగుతోంది. ప్రజలు కూడా ఈ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా విక్రయాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే గతంలో పరిస్థితులు ఇందుకు కొంచెం భిన్నంగా ఉండేవి. అవగాహన సహా ఇతర కారణాల వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తమ తొలి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ బిజిలీని ఫోటోను పంచుకున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నాటి ఫోటోను షేర్ చేశారు. ఈ వాహనం విడుదల వెనుక ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. 1999లో తొలి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ BIJLEEని విడుదల చేసిన సమయంలో సంస్థ ఉద్యోగి నాగర్కర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. బిజిలీ వాహనాన్ని కొన్ని సంవత్సరాల ఉత్పత్తి తర్వాత వీడ్కోలు చెప్పినట్లు తెలిపారు. అయితే దాని వెనుక ఉన్న కల ఇప్పటికే స్పూర్తినిస్తూనే ఉంటుందని, అప్పటి వరకు విశ్రమించమని వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వద్ద భారత మార్కెట్లో ఈ వాహనం ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది.
అయితే నాటి వైఫల్యం మహీంద్రా సంస్థను నిలువరించలేకపోయింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత 2018 సంవత్సరంలో దేశంలోనే నిర్మించిన తొలి ఎలక్ట్రిక్ ఆటో మహీంద్రా ట్రియోను (Mahindra treo) లాంచ్ చేసింది. ఈ వాహనం విక్రయాల పరంగా విజయం సాధించింది. అనంతరం 2021లో మహారాష్ట్రలో అప్‌గ్రేడ్ చేసిన ట్రియో ఉత్పత్తిని ప్రారంభించింది.
మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రూ.2.09 లక్షల ప్రారంభ ధరతో విడుదల అయింది. ఈ వాహనం IP65 రేటింగ్ కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 130 కి.మీ రేంజ్ ఇస్తుంది. ట్రియో EV సింగిల్ మోటార్‌ను కలిగి ఉంటుంది.
మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో గరిష్ఠంగా 10 bhp శక్తి, 42Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో డైరెక్ట్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. 16A ప్లగ్ సాయంతో 3.15 గంటల్లో ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. మహీంద్రా ట్రియో 5 సంవత్సరాలు/ 1,50,000 కి.మీ బ్యాటరీ వారంటీతో వస్తుంది.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పోస్టుపై వేలాది మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో మహీంద్రా సంస్థ గణనీయం స్థాయిలో విక్రయాలను కలిగి ఉంది. మహీంద్రా వాహనాల్లో చాలా మోడళ్లు అగ్రశ్రేణిలో రాణిస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








