అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీ యొక్క CEO 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతడు ఇటీవల కూడా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

ఆనంద్ మహీంద్రా ఇటీవల షేర్ చేసిన వీడియోలో చాలా ఫన్నీగా ఉంది. దీనిని చూసిన చాలామంది లైక్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. మీరు ఈ వీడియాలో ఒక చిన్న జీప్ చూడవచ్చు. కానీ ఈ జీప్ సాధారణంగా స్టార్ట్ కాదు, దీనిని కిక్ స్టార్ట్ తో స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వినటానికి కొంత వింతగా ఉన్నా, మీరు ఇక్కడ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

మీరు సాధారణంగా బైక్ ని కిక్ స్టార్ట్ తో స్టార్ట్ హేయడం చూసి ఉంటారు, కానీ కారు కిక్ స్టార్ట్ తో స్టార్ట్ చేయడం బహుశా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది. కావున ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో మోటార్ వాహన చట్టం ప్రకారం లేదు, కానీ సాధారణంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది అని ఆనంద్ మహీంద్రా కొనియాడారు.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన తరువాత చాలామంది దీనిపైన స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని ఏకంగా 3 లక్షలకు పైగా వీక్షించారు. దాదాపు 15 వేలకుపైగా లైక్ చేసారు. అంతే కాకూండా దాదాపు రెండు వేలు వరకు రీట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

నివేదికల ప్రకారం ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ మోడిఫైడ్ జీపును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మోడిఫైడ్ జీపుకు బైక్ ఇంజన్‌ను అమర్చినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. వీడియోలో ఈ జీపుని కిక్ స్టార్ట్ ద్వారా స్టార్ట్ చేయడం చూడవచ్చు. ఇది ఖచ్చితంగా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

ఇదిలా ఉండగా మహీంద్రా కంపెనీ తన కమర్షియల్ త్రీ వీలర్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచే ప్రణాళికపై పనిచేస్తోంది. నివేదికల ప్రకారం 2025 నాటికి మహీంద్రా కంపెనీ దేశంలోని త్రీ వీలర్ సెగ్మెంట్‌లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే అవుతాయని కంపెనీ అభిప్రాయపడింది.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

కమర్షియల్ త్రీ వీలర్ సెగ్మెంట్‌లో డీజిల్ నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా, కంపెనీ త్వరలో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఇంతకుముందు మహీంద్రా 2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కూడా ఇప్పటికే తెలిపింది.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

కంపెనీ విడుదల చేయనున్న ఈ 16 ఎలక్ట్రిక్ వాహనాలలో SUV లు మరియు లైట్ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి. 2027 నాటికి, ఎలక్ట్రిక్ SUVల నుండి 20 శాతం అమ్మకాలను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కంపెనీ రూ.3,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తప్పకుండా పెరుగుతుంది. కావున మహీంద్రా కంపెనీ దీనిని దృష్టిలో ఉంచుకుని, ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఇడుదల చేయడానికి సిద్ధమౌతోంది.

అదొక కారు.. కానీ కిక్కర్ కొడితే స్టార్ట్ అవుతుంది.. వీడియో చూడండి

మహీంద్రా కంపెనీ తన ఎలక్ట్రిక్ వెహికల్ వ్యాపారంలోకి ప్రైవేట్ పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తోంది. కావున త్వరలో కంపెనీ యొక్క అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుంది. రానున్న రోజుల్లో మహీంద్రా కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తనకంటూ ఒక స్థానాన్ని తప్పకుండా ఏర్పరచుకుంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఆ దిశవైపు అడుగులు వేస్తోంది.ఇది తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Anand mahindra shares kick starting jeep video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X