ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

నేటి ఇంటర్నెట్ ప్రపంచం చాలా మందికి తెలియని ఎన్నో వింతలు మరియు విశేషాలను ప్రజలు తెలియజేస్తుంది. ఈ మోడ్రన్ టెక్ యుగంలో ఏ చిన్న పని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొన్ని మంచి విషయాలు ఉంటే, మరికొన్ని ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

తాజాగా, ఓ మోటార్‌సైకిల్ పై రైడర్ లేకుండా, పిలియన్ రైడర్ సీటుపై (వెనుక సీటుపై) ఓ వ్యక్తి కూర్చొని ప్రయాణిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియో కాస్తా అటూ ఇటూ తిరిగి మన ఆటోమొబైల్ దిగ్గజం అనంద్ మహీంద్రా కంట పడింది. ఇంకేముంది.. "Love this... mUsafir hoon yaaron... na chalak hai, na thikaana.." అంటూ ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

సోషల్ మీడియోలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రాకి, ఏదైనా వింత వీడియో కనిపిస్తే వెంటనే దానిని తన వాల్‌పై షేర్ చేస్తారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆనంద్ మహీంద్రా కొన్ని ఫన్నీ వీడియోలను షేర్ చేశారు. తాజాగా, ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై విన్యాసాలు చేస్తున్న వీడియోని ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వాస్తవానికి, ఎలక్ట్రిక్ కార్లను భారతదేశానికి తీసుకురావడం గురించి టెస్లా చేసిన వ్యాఖ్య గురించి ఫన్నీ మీమ్ లో భాగంగా ఈ వీడియో పోస్ట్ చేయబడింది. ఓవైపు ఎలోన్ మస్క్ "డ్రైవర్ లెస్ వెహికిల్స్" ను భారతదేశానికి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటే, మనదేశంలో ఇప్పటికే రైడర్ లేని టూవీలర్లు తిరుగుతున్నాయంటూ వ్యగ్యంగా ఈ పోస్ట్ చేశారు.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

ఆనంద్ మహీంద్రా ఈ స్టంట్ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ, ఆనంద్ మహీంద్రా లెజండ్రీ బాలీవుడ్ యాక్టర్ కిశోర్ కుమార్ 1972 లో నటించిన పరిచయ్ సినిమా పాటలో కొన్ని లైన్లు రాశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, ఆయన "ముసాఫిర్ హూన్ యారోన్ ... నా డ్రైవర్ హై ... నా థికానా" అని ట్వీట్ చేశారు. అంటే అర్థం, నేను ఒక డ్రైవర్ లేని మరియు గమ్యం లేని ప్రయాణీకుడిని అని అర్థం.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

నెట్టింట వైరల్ అయిన ఈ వీడియో గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. కొందరేమో ఈ బైక్ పై స్టంట్ చేసిన వ్యక్తిని ప్రశంసిస్తుంటే, మరికొందరేమో ఈ ప్రమాదకరమైన స్టంట్ గురించి సదరు రైడర్ ని తిట్టిపోస్తున్నారు. అంతేకాదు, ఎలాంటి వార్నింగ్ లేకుండా ఈ వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా గురించి కూడా నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

వైరల్ అయిన రైడర్ లెస్ బైక్ వీడియో..

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోలో, టిప్ టాప్ గా కనిపించే ఓ మధ్య వయస్కుడు వేగంగా కదులుతున్న బైక్ వెనుక సీటుపై కూర్చుని విన్యాసాలు చేస్తూ కనిపిస్తాడు. ఇందులో సదరు రైడర్ బైక్ అంత వేగంతో వెళ్తున్న చాలా సాఫీగా, ఎలాంటి టెన్షన్ లేకుండా నవ్వుతూ ఉంటాడు. ఈ వీడియో హైవేపై చిత్రీకరించబడినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో బైక్ వేగం కూడా చాలా ఎక్కువగానే ఉంది.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

మొదటి సారిగా ఈ వీడియోని చూసిన వారికి, ఆ బైక్ ఏదో దెయ్యం లాంటి అతీత శక్తి నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ, ఈ బైక్ పై ఒక రైడర్ మాత్రమే ఉన్నాడు. బైక్ యాక్సిలరేటర్ ను ఓ స్థిరమైన వేగం వద్ద లాక్ చేయడం ద్వారా అతను ఈ స్టంట్ చేయగలిగాడు. నిజానికి ఈ రకమైన స్టంట్ సదరు బైక్ రైడర్ కు మాత్రమే, రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణీకులకు కూడా చాలా ప్రమాదకరం.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

ఇలాంటి విన్యాసాలు చేయడం ద్వారా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే బైకర్‌ పై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వినియోగదారులు చెబుతున్నారు. ఈ వీడియోలో బైక్ రైడర్ తన భద్రత కోసం కనీసం హెల్మెట్ కూడా ధరించలేదని, ఇది బైకర్‌ను మరింత ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో గురించి డి రామచంద్రా రెడ్డి అనే ఓ ట్విట్టర్ యూజర్, ఆయన ట్వీట్ కి సమాధానమిస్తూ.. "సార్, ఎలాంటి హెచ్చరికలు చేయకుండా మీరు ఇలాంటివి ఫార్వార్డ్ చేయడం సరికాదు. ఇది చాలా ప్రమాదకరమైనది మరియు చట్టరీత్యా నేరం కూడా. మిమ్మిల్ని అనుసరిస్తున్న చాలా మందిలో మీ అభిమానులు ఉన్నారు, వారు దీనిని ఆసరగా చేసుకొని ఇలాంటి పనులు చేసే ప్రమాదం ఉంది" అని వ్రాశారు.

ఇదేందబ్బా ఇది.. రైడర్ లేని బైకా.. లేక దెయ్యం నడుపుతోందా..?

వాస్తవానికి బైక్ రైడింగ్ అనేది ఒక ఆహ్లాదకరమైన మరియు ఉత్తేజకరమైన అనుభవం. కానీ, మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా మరియు పూర్తి బాధ్యతాయుతంగా రహదారిపై వాహనాలను నడపాలి. రోడ్డుపై మన అజాగ్రత్త మన జీవితాన్నే కాదు ఇతరులను కూడా ప్రమాదంలో పడేలా చేస్తుంది. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి మరియు బాధ్యతాయుతంగా బైక్ నడపాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.

Most Read Articles

English summary
Anand mahindra shares riderless bike stunt video on twitter details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X