కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో మోటర్‌హోమ్‌ను చూడవచ్చు. ఇందులో ఒక యువతి (ప్రెజెంటర్) వాహనం లోపల మొత్తం చూపించడం చూడవచ్చు. ఇందులో ఆమె మొదట డ్రైవింగ్ సీటును చూపించడంతో ప్రారంభిస్తుంది. ఇందులో కూడా డ్రైవింగ్ చేయడానికి సులభంగా ఉండే టెక్నాలజీ ఉండటం చూడవచ్చు. రెండు సోఫాలతో ఉన్న లివింగ్ రూమ్ కూడా ఇందులో చూడవచ్చు. ఒకటి కుడివైపు, మరొకటి ఎడమవైపు ఉన్నాయి.

ఎడమవైపు ఒట్టోమన్ తరహా సీట్లు ఉండటం చూడవచ్చు. ఆ తరువాత ఒక బటన్ నొక్కినప్పుడు టీవీ పైకి లేవడం కూడా చూడవచ్చు. ఆమె కిచెన్ మరియు ఫుడ్ ప్లేస్ వంటివి చూపించడం చూడవచ్చు. కిచెన్ టేబుల్ మరియు సీట్స్ సెటప్ కూడా చూడవచ్చు. వంటగదిలో కావలసిన సదుపాయాలు ఉన్నాయి. ఇందులోనే టూ-బర్నర్ ఇండక్షన్, డిష్‌వాషర్ వంటి సకల సదుపాయాలు చూడవచ్చు.
ఆ తరువాత ముందు వెల్తూ చిన్న గదిలో సగం బాత్రూమ్ కనిపిస్తుంది. ఆ తరువాత పెద్దగా ఉన్న డబుల్ డోర్ ఫ్రిజ్ ఉంది. ఆ తరువాత వాషింగ్ మిషన్ మరియు డ్రైయర్ చూపిస్తుంది. ఆ తరువాత ప్యాంట్రీని మరియు మరికొన్న నిల్వ స్థలాలు ఇక్కడ ఆగమనించవచ్చు. చివరిగా మెయిన్ బెడ్‌రూమ్ చూపిస్తుంది. అద్భుతమైన బెడ్ ఇక్కడ గమనించవచ్చు. దానికి ముందు భాగంలో కూడా టీవీ ఉండటం చూడవచ్చు.

ఆమె మాస్టర్ బాత్రూమ్ కూడా చూపిస్తుంది. అది వాటర్ క్లోసెట్, స్టోరేజ్‌తో కూడిన వానిటీ మిర్రర్ మరియు బట్టల కోసం కూడా ప్రత్యేకమైన ర్యాక్స్ వంటివి ఉన్నాయి. షవర్ కూడా చూడవచ్చు. ఇందులో ఒక వ్యక్తి స్నానం చేయడానికి తగిన స్థలం ఉంది. మొత్తం మీద ఒక వాహనం లగ్జరీ ఇల్లు మాదిరిగా చాలా అద్భుతంగా ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ఇది బహుశా మాగిన్ద్ర ట్రక్స్ మరియు మహీంద్రా లైఫ్‌స్పేసెస్ మధ్య సహకారం యొక్క ఫలితం కావొచ్చు.. అని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా మోటర్‌హోమ్‌ను నిర్మించడానికి ట్రై చేస్తారా? అనేది ప్రస్తుతానికి తెలియదు. బహుశా ఇలాంటివి భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం లేదని తెలుస్తుంది.
ఇక్కడ కనిపించే వెహికల్ అమెరికాలో తయారు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 5.8 కోట్ల నుంచి రూ. 8.2 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. ఈ హెవీ వెహికల్ ఐఎస్ఎక్స్15 డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 400 నుంచి 600 bhp పవర్ మరియు 1966 నుంచి 2779 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావట్టి దీని పర్ఫామెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








