ఆనంద్ మహీంద్రాకు అంబాసిడర్ గిఫ్ట్!.. ఎవరిచ్చారో తెలుసా?
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈయన దేశీయ పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాకుండా.. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎన్నెన్నో ఆసక్తికర విషయాలు అభిమానులతో షేర్ చేస్తూ.. వారికి చాలా దగ్గరగా ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో హిందూస్తాన్ అంబాసిడర్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి మనమెందుకు తయారు చేయకూడదని అన్నారు. ఆనంద్ మహీంద్రా దేని గురించి అన్నారు? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా ఇటీవల తన ఎక్స్ ఖాతాలో హిందూస్తాన్ అంబాసిడర్ స్కెల్ మోడల్స్ షేర్ చేశారు. వీటిని మహీంద్రా ఆటోమోటివ్ చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ నుంచి గిఫ్ట్‌గా పొందినట్లు, ఇలాంటి గిఫ్ట్ పొందటం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇలా పేర్కొంటూనే ఈ రోజు ప్రతాప్ బోస్ నుంచి గిఫ్ట్ అందుకున్నాను. నా జ్ఞాపకాల్లో అంబాసిడర్ కారుకు ఓ ప్రత్యేకత ఉందని అన్నారు.

ఒకప్పుడు భారతదేశంలో సంచలన అమ్మకాలు పొంది.. ఎందోమంది వాహన ప్రియుల మనసుదోచిన ఈ కారు ఇప్పటికీ రోడ్ల మీద అక్కడక్కడా దర్శనమిస్తుంది. ఇలాంటి గొప్ప కార్లు స్కెల్ మోడల్స్ ద్వారా అమరత్వం పొందటానికి అర్హమైనవని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌గా పొందిన అంబాసిడర్ స్కెల్ మోడల్‌లలో ఒకటి బ్లాక్, మరొకటి గోధుమ రంగులో ఉండటం చూడవచ్చు.
హిందూస్తాన్ అంబాసిడర్ స్కేల్ మోడల్స్ గిఫ్ట్‌గా పొందినందుకు ఆనంద్ మహీంద్రా ప్రతాప్ బోస్‌కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ స్కేల్ మోడల్‌లను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకోవడం కూడా ఒక సంతోషకరమైన విషయమని అన్నారు. అయితే ఇలాంటి స్కేల్ మోడల్‌లను మనం ఎందుకు నిర్మించడం లేదని ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ద్వారా బోస్‌ను అడిగారు.
నిజానికి స్కేల్ మోడల్ అనేది ఒక నమూనా మాత్రమే. ఆటోమొబైల్ ఔత్సాహికులు ఇలాంటి కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇళ్లలో.. వారి టేబుల్స్ మీద అలంకారాయించుకోవడానికి ఇలాంటి మోడల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఇలాంటి స్కేల్ మోడల్‌లను కొన్ని దేశాల కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. వీటికి గ్లోబల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఇక హిందూస్తాన్ అంబాసిడర్ విషయానికి వస్తే.. దశాబ్దాల క్రితం హిందూస్తాన్ అంబాసిడర్ కారు విపరీతమైన అమ్మకాలను పొందగలిగింది. అప్పట్లో ప్రభుత్వ అధికారులు ఈ కార్లనే ఉపయోగించేవారు. ఇప్పటికి కూడా కొంతమంది అంబాసిడర్ ప్రేమికులు తమ అంబాసిడర్ కార్లను మరింత అందంగా మోడిఫైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని గురించి మనం గతంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. వీటిని ఒకప్పుడు రాజకీయ ప్రముఖులు కూడా ఉపయోగించేవారు.
హిందూస్తాన్ అంబాసిడర్ కార్లు ఈ రోజుకి కూడా ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సింపుల్ డిజైన్ మాత్రమే కాకుండా వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కూడా ఉండటం. అంతే కాకుండా ఇది పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రత్యేకంగా భారతీయ రోడ్లకు సరిపోయే విధంగా రూపొందించారు. ఇలాంటి మరెన్నో కారణాల వల్ల ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి సుముఖత చూపించారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








