Just In
- 7 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 20 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 21 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసం
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Sports
దిగ్గజాలా మజాకా.. మొన్న సెహ్వాగ్.. నిన్న లారా, తరంగా.. ఆ జోరు ఏ మాత్రం తగ్గలేదు.!
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేవాటిని గురించి ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేసారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

ఇటీవల భారత క్రెకెట్ జట్టు ఆస్ట్రేలియా మైదానంలో, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్‌లో గొప్ప ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇండియా టీమ్ గెలవడంతో అందరూ వారిని ప్రశంసిస్తున్నారు. ఇంత గొప్ప విజయం కైవసం చేసుకున్నందుకు గాను బిసిసిఐ క్రీడాకారులకు 5 కోట్ల రూపాయల గ్రాంట్‌ను ప్రకటించింది.

అయితే వీరు పొందిన ఘన విజయానికిగాను ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా సిఇఒ ఆనంద్ మహీంద్రా మరో స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు.
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఆస్ట్రేలియా మైదానంలో భారత క్రికెట్ జట్టు సాధించిన విజయం ప్రతి ఒక్కరినీ సంతోషింపజేసింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు లేనప్పటికి, యువ ఆటగాళ్ళు భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇండియన్ క్రికెట్ అభిమానులు దీనిని వారి విజయంగా భావించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన భారత యువ ఆటగాళ్లకు మహీంద్రా గ్రూప్ అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. భారత క్రికెట్ జట్టులోని ఆరుగురు యువ ఆటగాళ్లకు కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని గిఫ్ట్ గా ఇస్తామని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
MOST READ:మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

ఇందులో మొహమ్మద్ సిరాజ్, శుబ్మాన్, నటరాజన్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ షైనీ మరియు వాషింగ్టన్ సుందర్‌లకు థార్ ఎస్‌యూవీలను బహుమతిగా ఇస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో ప్రకటించారు. ఈ ఆరుగురు యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీలను ఇవ్వనున్నారు.

భారత క్రెకెట్ టీమ్ ఆటగాళ్లకు ఇస్తున్న ఈ గిఫ్ట్ కి సంబంధించిన మొత్తం ఖర్చు తానే స్వయంగా భరంచనున్నట్లు కూడా తెలిపాడు. ఈ 6 మంది యువ ఆటగాళ్లకు కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీ అందించడం ఆనందంగా ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ బహుమతి భారత యువ ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తుంది.
MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలలో మహీంద్రా థార్ ఒకటి. మహీంద్రా అక్టోబర్ 2 న న్యూ జనరేషన్ థార్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. విడుదలైన అతితక్కువ కాలంలోనే ఈ థార్ ఎక్కువ ప్రజాధరణ పొందింది. కావున దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది.

కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీ డెలివరీకి చాలా నెలలు వేచి ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి, మహీంద్రా కొత్త థార్ ఎస్యూవీ ఉత్పత్తిని పెంచాలని చూస్తోంది. కావున కంపెనీ తమ ఉత్పత్తి కర్మాగారాలలో మహీంద్రా థార్ ఉత్పత్తిని పెంచనుంది.
MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!