బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

Sumit Antil (సుమిత్ ఆంటిల్) ఈ పేరుకి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. భారతదేశ కీర్తిని నలుదిక్కులా వ్యాపించేలా చేసిన ఈ భరతమాత ముద్దుబిడ్డ, జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో జావ్లీన్ త్రో విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. Sumit Antil జావ్లీన్ త్రోలో మెడల్స్ సాధించడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందే యితడు జావ్లీన్ త్రో మెడల్స్ సాధించాడు. అయితే ఇప్పుడు ఒక కొత్త చరిత్రను సృష్టించాడు.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

23 సంవత్సరాల సుమిత్ ఆంటిల్ 2015 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోవాల్సి వచ్చింది. తన కాలు పోయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా ఈ రోజు దేశానికే గర్వకారణమయ్యాడు. సుమిత్ ఆంటిల్ సాధించిన విజయాన్ని యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది. ఎంతోమంది ప్రజలు సుమిత్ ఆంటిల్ ని పొగుడుతున్నారు.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

సుమిత్ ఆంటిల్ జావ్లీన్ త్రోలో 68.55 మీటర్లు విసిరి కైవసం చేసుకున్న గొప్ప ఘనతకు ముగ్దుడైన Mahindra And Mahindra చైర్మన్ Anand Mahindra ఆంటిల్ ను సత్కరించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే Anand Mahindra తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ విధంగా రాసారు. "పారాలింపిక్స్‌లో సుమిత్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు, ఇప్పుడు ఇండియా ఖాతాలో రెండు గోల్డ్ మెడల్స్ చేరాయి. ఈ సందర్భంగా వీరికి Mahindra యొక్క కొత్త XUV700 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో Mahindra And Mahindra చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్‌ని ట్యాగ్ చేస్తూ ఈ ప్లేయర్స్ కి XUV700 యొక్క స్పెషల్ ఎడిషన్ సిద్ధం చేయాలని కోరారు. ఇప్పటికే 'అవని లేఖారా' కు Mahindra XUV700 ప్రకటించిన సంగతి తెలిసిందే.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

దేశీయ మార్కెట్లో ఎంతగానో ఎదురుచూస్తున్న Mahindra XUV700 ఆగస్టు 15 న ఆవిష్కరించబడింది. కొత్త Mahindra XUV700 ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

Mahindra XUV700 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ దాని XUV500 నుండి ప్రేరణ పొందింది. XUV700 ముందుభాగంలో కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు క్రోమ్ ఫినిష్‌ కలిగిన వర్టికల్ స్లాట్‌లతో సరికొత్త గ్రిల్ కలిగి ఉంది. ఈ బ్రాండ్ ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన కొత్త లోగోను కూడా ఈ గ్రిల్ లో చూడవచ్చు.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

ఫ్రంట్ బంపర్ యొక్క దిగువ భాగంలో ఫాగ్ ల్యాంప్స్ మరియు రేడియేటర్ గ్రిల్ ఉన్నాయి. అంతే కాకుండా వీటికి దిగువన సిల్వర్ ఫినిష్డ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉంది. ఫ్రంట్ ఫాసియాలో సి-షేప్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో విలీనం చేయబడిన కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్‌లు ఉన్నాయి.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

Mahindra XUV700 యొక్క సైడ్ ప్రొఫైల్ కొంత ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా దీని సైడ్ ప్రొఫైల్ యొక్క హైలైట్ కొత్త డ్యూయల్-టోన్ మల్టీ-స్పోక్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్. వెనుక భాగంలో పెద్ద టెయిల్ లైట్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, రిఫ్లెక్టర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా, రూప్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్లష్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ బాహ్య భాగంలో ఇవ్వబడ్డాయి.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

Mahindra XUV700 లో అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే ఇది 5 మరియు 7 సీట్ల ఎంపికలతో వస్తుంది. సీటింగ్ లేఅవుట్ ప్రకారం మధ్య వరుసలో కెప్టెన్ సీటు లేదా బెంచ్ సీటు ఇవ్వబడుతుంది. దీని సీట్లు పవర్డ్ మరియు వెంటిలేట్ చేయబడ్డాయి, ఇవి డ్రైవర్ మరియు ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. క్యాబిన్ అంతటా లెదర్ ఉపయోగించబడింది.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

కొత్త Mahindra XUV700 కి 'స్కైరూఫ్' అని పిలువబడే పెద్ద సన్‌రూఫ్ ఇవ్వబడింది. ఈ ఎస్‌యూవీలోని డ్యాష్‌బోర్డ్‌లో ఒకే స్లాబ్ గ్లాస్‌తో వస్తుంది, ఇది 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలను అనుసంధానిస్తుంది. ఇందులో సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

కొత్త Mahindra XUV700 లో ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఎనేబుల్, 60 కి పైగా కనెక్ట్ ఫీచర్లు, ఇ-సిమ్ బేస్డ్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 2 వ మరియు 3 వ వరుస ఎసి వెంట్‌లు, మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

Mahindra XUV700 లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే 198 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమవుతుంది.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

బంగారు పతక విజేతా.. సుమిత్ ఆంటిల్.. నీ కోసం ఇదే నా గిఫ్ట్; Anand Mahindra

Mahindra XUV700 బ్రాండ్ యొక్క అధునాతన ఉత్పత్తి. కావున ఇది అధునాత ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 7-ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్ బూస్టర్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కొత్త Mahindra XUV700 విడుదలైన తర్వాత Hyundai Alcazar, MG Hector Plus, Tata Safari మరియు రాబోయే Jeep Meridian వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Anand mahindra to gift mahindra xuv700 to sumit antil paralympics gold medalist
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X