సముద్ర గర్భ మార్గంలో 'ఆనంద్ మహీంద్రా'.. వీడియో చూస్తే ఫిదా అవుతారు

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియోను అప్లోడ్ చేస్తూ.. లార్సెన్ అండ్ టూబ్రోని కంపెనీని ఎంతగానో అభినందించారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఇటీవల వర్లీ మరియు మెరైన్ డ్రైవ్‌లను కలుపుతూ నిర్మించిన దక్షిణ తీర రహదారిని ప్రారంభించారు. ఈ రోడ్ ప్రారంభమైన తరువాత మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ మార్గంలో ప్రయాణించారు. సొరంగ మార్గ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని ఇంజినీరింగ్ కంపెనీకి 'లార్సెన్ అండ్ టూబ్రో'ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు.

Anand Mahindra Travels India s First Undersea Tunnel

ఆనంద్ మహీంద్రా సౌత్ ముంబై కోస్టల్ రోడ్‌లో ప్రయాణిస్తూ.. ఈ రోజు టన్నెల్ టూరిస్ట్ మరియు ముంబైలో కొత్తగా ప్రారంభించిన సొరంగ మార్గాన్ని సందర్శించాను.. ఇంజినీరు చాలా అద్భుతంగా దీన్ని రూపొందించారంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన వీడియోను చాలామంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

వీడియోలో మీరు గమనించినట్లయితే.. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ నిర్మించిన 'భారతదేశపు మొదటి సముద్ర గర్భ సొరంగంలో ప్రవేశిస్తున్నారు' అని ఎంట్రీ దగ్గర బోర్డు ఉండటం చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఆయన వాహనంతో పాటు మరిన్ని వాహనాలు వేళ్తుండటం చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేయడం ఇదే మొదటి సారి కాదు.

Anand Mahindra Travels India s First Undersea Tunnel

సౌత్ ముంబై తీర రహదారికి ఛత్రపతి శంభాజీ మహారాజ్ పేరు మీద ధర్మవీర్ సంబాన్జీ మహారాజ్ తీర రహదారి అని పేరు పెట్టారు. దీనిని మార్చి 11న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రారంభించారు. ఈ కొత్త ప్రాజెక్టు వర్లీ మరియు మెరైన్ డ్రైవ్ మధ్య కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల వాహనదారులు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నగరంలో ప్రత్యేక ఆకర్షణ కూడా కావడం గమనార్హం.

కొత్తగా ప్రారంభమైన ధర్మవీర్ శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ నిర్మాణం 2018 అక్టోబర్ 13న ప్రారంభమైంది. ఇది సుమారు 53 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ రోడ్డు బాంద్రా వర్లీ నుంచి దహిసర్ వరకు విస్తరించడానికి నిరణయించబడింది. కాబట్టి నిర్మాణం కూడా దశల వారీగా పూర్తవుతుంది. ఇందులో వాహన వినియోగదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ధర్మవీర్ శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ విశేషాల విషయానికి వస్తే.. ఇందులో ప్రతి వైపు నాలుగు లేన్లు 2.07 విస్తరించి 119 మీటర్ల వ్యాసం కలిగిన రెండు అద్భుతమైన సొరంగాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది భారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి ఫోర్ లేన్స్ రహదారి. ఇది ప్రత్యేకంగా ముంబై వాసుల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకుని నిర్మించడం జరిగింది.

కొత్తగా నిర్మించబడిన కోస్టల్ రోడ్ కేవలం దూరాన్ని తగ్గించడం మాత్రమే పర్యావరణ ప్రభావాన్ని కూడా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోడ్డుపై వేగ పరిమితులను కూడా నిర్దేశించారు. ప్రధాన రహదారిపైన వేగం 80 కిమీ/గం కాగా టన్నెల్ లోపల 60 కిమీ/గం అని ముంబై పోలీసులు నిర్థారించారు. ఇక టర్నింగ్ మరియు ఎంట్రీ.. ఎగ్జిట్ పాయింట్ల దగ్గర వేగం 40 కిమీ/గం అని స్పష్టం చేశారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2024, 9:16 [IST]
English summary
Anand mahindra travels india first undersea tunnel in mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+