వచ్చే ఏడాది భారత్‌లో ఎగిరే కార్లు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
టెక్నాలజీ పరంగా ఆటోమోటివ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంతో పాటు భారత్ దృష్టి.. ఎగిరే కార్లు(Flying Taxi) వైపు చూస్తోంది. త్వరలో విమానాల మాదిరిగా ఎగిరే కార్లలో నగర వీధుల్లో విహరించబోతున్నాం. ఇందుకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక సమాచారం వెల్లడించారు.
భారతీయ రోడ్లపై ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా చెన్నై, బెంగుళూరు, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రమవుతోంది. ఫ్లై ఓవర్లు, మెట్రోలు వచ్చినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని భవిష్యతులో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందనడంలో సందేహం లేదు.

ఈ క్రమంలో ఆటో మార్కెట్ దృష్టి ఫ్లయింగ్ ట్యాక్సీల వైపు పడింది. నిమిషాల్లో గమ్యస్థానాలకు చేర్చే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు అమెరికా, చైనా వంటిలో పాపులర్ అయ్యాయి. ఎగిరే కార్లు, ఎగిరే ట్యాక్సీల గురించి ఇప్పటికే ఎన్నో వార్తలను చూశాం. ఈ క్రమంలో ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్రా.. ఫ్లయింగ్ ట్యాక్సీల గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది దేశంలో ఎగిరే కార్ల అభివృద్ధికి అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని ఆవిష్కరించారు. ప్రస్తుత నివేదికల ప్రకారం ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీ యొక్క నమూనా వచ్చే ఏడాది వాడుకలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని ePlane అభివృద్ధి చేసింది.

ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని ePlane e200 అని పిలుస్తారు. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని చెన్నైలోని ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అభివృద్ధి చేయడం ఇక్కడ విశేషం. ఈ ePlane E200 ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చట. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ రేంజ్ 200 కిలోమీటర్లు.
ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీ గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ePlane రూపొందిస్తోంది. దీంతో త్వరలో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎగిరే టాక్సీ వాయు రవాణాలో కీలక మైలురాయిగా నిలవనుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. నిలువుగా ఎక్కడం, దిగడం ఈ ఎయిర్ ట్యాక్సీ ప్లస్ పాయింట్.

ఈ ఫీచర్ కారణంగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం రన్‌వే అవసరం లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ హెలికాప్టర్ల మాదిరిగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీలు ప్రయాణికుల కోసమే కాకుండా కార్గో రవాణాకు కూడా పనిచేస్తాయి.
ఫ్లయింగ్ ట్యాక్సీల ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయినట్లయితే త్వరలోనే దేశంలోని గగనతలంలో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీలను చూడబోతున్నాం. ఇక క్యాబ్‌ల మాదిరిగానే ఎగిరే కార్లలో కూడా సులభంగా ప్రయాణించవచ్చు. రద్దీ ట్రాఫిక్‌లో నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దేశంలో ఫ్లయింగ్ ట్యాక్సీల రాకతో.. చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








