కాలా సినిమాలో రజనీ ఉపయోగించిన కారును కొనుగోలు చేయనున్న ఆనంద్ మహీంద్రా: ఎందుకో తెలుసా?

Written By:

ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన వ్యక్తి ఆనంద్ మహీంద్రా. ట్విట్టర్‌లో ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉంటాడు. తన గురించి ట్వీట్ చేసినా లేదంటే తమ ఉత్పత్తులను చూసినా వెంటనే స్పందిస్తాడు. అలాగే రజనీ కాలా సినిమాలో వాడిన జీపు కావాలని కోరాడు.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

మహీంద్రా వాహనాలను వివిధ రకాలుగా వినియోగించడాన్ని రజనీ ఎప్పుడూ స్వాగతిస్తాడు, వీలైంతే వాటిని సొంతం చేసుకుంటాడు. కూడా అందుకు ఉదాహరణ ఓ సారి మోడిఫికేషన్ ద్వారా ఆటో రిక్షాను స్కార్పియోలా మార్చేసిన వ్యక్తికి సుప్రో వాహనాన్ని బహుకురించి ఆ మోడిఫైడ్ వెహికల్‌ను సేకరించాడు.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

ఇలా మహీంద్రా వెహికల్స్ చేసే అడ్వెంచర్స్, మహీంద్రా వాహనాల వినియోగం మరియు వాటి వెనుక ఏదైనా ప్రత్యేకత ఉంటే వాటిని సేకరించి మహీంద్రా అండ్ మహీంద్రా అతి త్వరలో ప్రారంభించనున్న మ్యూజియంలో కొలుదీర్చనున్నాడు.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

ఇది ప్రక్కనపెడితే రజనీకాంత్ నటిస్తున్న తరువాత చిత్రం కాలా కు సంభందించిన కొన్ని పోస్టర్లు విడుదలైన సంగతి తెలిసిందే, ఆటోమొబైల్ లవర్స్ అయితే అందులో రజనీ కూర్చుని ఉన్న మహీంద్రా జీపును గుర్తించవచ్చు.

మహీంద్రా వాహనాలను మిన్నంగా ప్రేమించే వ్యక్తులలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈ పోస్టర్లను గమనించిన తరువాత, కాలా సినిమాలో రజనీ గారు వాడిన వాహనాన్ని నేను కొనుగోలు చేస్తాను. దీని సంభందీకులు స్పందిస్తారా అని ట్వీట్ చేసాడు.

కాసేపటికి "కాలా" చిత్రాన్ని నిర్మిస్తున్న వుండర్‌బార్ ఫిలిమ్స్ కంపెనీ ఆనంద్ గారి ట్వీట్‌కు సమాధానం ఇస్తూ, మీ అధికారుల వివరాలను వెల్లడిస్తే వారితో సంప్రదించి రజనీ వాడిన వాహనాన్ని ఇస్తామని సానుకూలంగా స్పందించింది.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

తమిళ నటుడు ధనుష్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌కు స్పందిస్తూ, ప్రస్తుతం ఈ వాహనం షూటింగ్‌లో ఉంది. షూటింగ్ పూర్తయిన వెంటనే మీకు అందజేస్తామని అందిస్తామని తెలిపాడు.

వుండర్‌బార్ ఫిలిమ్స్ కంపెనీ మరియు ధనుష్‌ల సానుకూల స్పందన చూసిన ఆనంద్ మహీంద్రా, మీ రెస్పాన్స్ అద్బుతమని పొగుడుతూ, "కాలా" చిత్ర బృందానికి గుడ్ లక్ చెప్పాడు.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

మహీంద్రా థార్ వాహాన్ని జీప్ వాహన తరహాలో మోడిఫై చేసి "కాలా" చిత్రంలో వినియోగించారు. మహీంద్రా థార్ మూడు ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ. 6.27 లక్షల నుండి గరిష్టంగా రూ. 8.99 లక్షల వరకు ఉంది.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

సిఆర్‌డిఐ 2.5-లీటర్ ఇంజన్ థార్ గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 247ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. అదే విధంగా డిఐ 2.5-లీటర్ ఇంజన్ వేరియంట్ ఉన్న థార్ గరిష్టంగా 63బిహెచ్‌పి పవర్ మరియు 182.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

డిఐ వేరియంట్ టూ-వీల్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అదే విధంగా సిఆర్‌డిఐ వేరియంట్ కేవలం ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో మాత్రమే లభించును. అత్యుత్తమ ధరతో లభించే బెస్ట్ అడ్వెంచర్ అండ్ ఆఫ్ రోడ్ వెహికల్ అని థార్ అని చెప్పవచ్చు.

రజనీ వాడిన కారును అడిగిన ఆనంద్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా అండ్ మహీంద్రా మ్యూజియాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిని ముంబాయ్‌లో ఉన్న కండివిలి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఆనంద్ మహీంద్రా సేకరించే అన్ని మోడళ్లను ఇక్కడ ప్రదర్శించనున్నారు.

English summary
Read In Telugu Anand Mahindra Wants The Thar Used In Rajnikanths New Movie Kaala
Please Wait while comments are loading...

Latest Photos