రోల్స్‌ రాయిస్‌ను వదిలి సాధారణ కారులో కనిపించిన అనంత్‌ అంబానీ.. వైరల్‌ వీడియో

ఖరీదైన, లగ్జరీ కార్లంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ ఫ్యామిలీ. భారత్‌లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు వారి సొంతం. విలాసవంతమైన కార్లలో హై సెక్యూరిటీ నడుమ దర్జాగా బయటకు వస్తారు. అయితే తాజాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ రేంజ్‌ రోవర్‌లో బయటకు రావడం వైరల్‌గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీ ఫ్యామిలీ ఒకటి. ఇక భారత్‌లో అయితే అదానీ, అంబానీ కుటుంబం తర్వాతే మరెవరైనా.. రిలయన్స్‌తో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి అత్యంత ధనికుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు ముకేశ్‌ అంబానీ. ముకేశ్‌ అంబానీ ఫ్యామిలీకి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన నివాసం మొత్తం హై ఎండ్‌ లగ్జరీ కార్లతో నిండి ఉంటుంది.

Anant-Ambani-Range-Rover

అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతి లగ్జరీ కారు ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) ఇంట్లో ఉండాల్సిందే. రూ. 15,000 కోట్ల విలువై అంబానీ నివాసంలో పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఆ పార్కింగ్‌ ప్లేస్‌ అంతా హై ఎండ్‌ కార్లతో నిండి ఉంటుంది. వాళ్లు ఎప్పుడు బయటకు వెళ్లినా.. భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ సిద్ధంగా ఉండాల్సిందే.

కాగా ముకేశ్‌ అంబానీ 'బాంబ్‌ ప్రూఫ్' Mercedes-Benz S680 గార్డ్ సెడాన్‌లో తరచుగా ప్రయాణిస్తుంటారు. అయితే ఆయన కుమారుడు అనంత్ అంబానీ తరచుగా రోల్స్ రాయిస్ కల్లినాన్ SUVలలో బయటకు వస్తుంటారు. కానీ ఇటీవల అనంత్ అంబానీ ఒక రేంజ్ రోవర్ SUVలో కనిపించారు. ఈ కారు రోల్స్ రాయిస్ కల్లినన్ కంటే ధర తక్కువ.

Anant-Ambani-Range-Rover

భారత్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్(Rolls Royce Cullinan) అత్యంత ఖరీదైన SUV. దీని ధర రూ. 8 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. కాగా ఇప్పుడు ఇంతటి ఖరీదైన కారులో కాకుండా అంబానీ రేంజ్‌ రోవర్‌(Range Rover SUV)లో రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

అయితే రేంజ్‌ రోవర్ ధర రూ. కోటి వరకూ ఉంటుంది. కాగా కాన్వాయ్‌లో రూ. 8 కోట్ల రోల్స్‌ రాయిస్ ఎస్‌యూవీ ముందు వెళ్తుంటే దాని వెనుక వస్తున్న రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీలో అనంత్ అంబానీ(Anant Ambani) వెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రపంచంలోనే ఖరీదైన భవనాల్లో ఒకటైన 'యాంటిలియా'లో ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

Anant-Ambani-Range-Rover

అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు. అంతేకాకుండా దేశంలోని బిలియనీర్ల జాబితాలో అనంత్‌ ఒకరు. అనంత్ అంబానీకి ఇంపోర్టెడ్‌ వాచీలు, కార్లంటే చాలా ఇష్టమని సమాచారం. ఈయన నికర ఆస్తుల విలువ భారత కరెన్సీలో రూ. 3 లక్షల కోట్ల(40 బిలియన్‌ డాలర్లు) కంటే ఎక్కువ అని నివేదికలు సూచిస్తున్నాయి.

Anant-Ambani-Range-Rover

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 9, 2024, 12:24 [IST]
English summary
Anant ambani spotted in range rover suv video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+