అజయ్ దేవగన్ ఇంటికి అనంత్ అంబానీ.. ఏ కారులో వెళ్లారో చూసారా (వీడియో)

ఆసియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో చెప్పుకోదగ్గ వ్యక్తి 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani). వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే వివాహ వేడుకలు మెల్లగా మొదలవుతున్నాయి. ఓ వైపు నీతా అంబానీ కాశీ సవిశ్వనాధుని దర్శించుకుని.. అక్కడే మొదటి శుభలేఖను సమర్పించారు. అనంత్ అంబానీ కూడా ప్రముఖ సెలబ్రిటీలకు తానె స్వయంగా వెళ్లి ఇన్విటేషన్ కార్డులు పంచి పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అనంత్ అంబానీ ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

అంబానీ ఫ్యామిలీ ఎక్కువగా ఖరీదైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తుందని అందరికి తెలుసు. ఇప్పటికే వీరి గ్యారేజిలో ఏకంగా తొమ్మిది రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే తొమ్మిదవ రోల్స్ రాయిస్ కల్లినన్ కారును తమ గ్యారేజిలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా గత కొని రోజులకు ముందు నెట్టింట్లో వైరల్ అయింది. కాగా ఇప్పుడు మరో రోల్స్ రాయిస్ కారులో అనంత్ అంబానీ కనిపించారు.

Anant Ambani Rolls Royce Cullinan

ఇటీవల అనంత్ అంబానీ.. స్వయంగా అజయ్ దేవగన్ మరియు కాజోల్ ఇంటికి రోల్స్ రాయిస్ కారులో వెళ్లారు. పెళ్ళికి వారిని ఇన్వైట్ చేసిన తరువాత తన కారులో వెళ్లిపోయారు. వీడియోలో గమనిస్తే అనంత్ అంబానీ తన ఆరంజ్ కలర్ కారులో అజయ్ దేవగన్ ఇంటికి బయట ఉన్నారు. ఆ తరువాత కొంత సేపటికి సెక్యూరిటీతో కలిసి అక్కడ నుంచి కారులో వెళ్లిపోయారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం జులై 12 నుంచి 14 వరకు జరగనుంచి. ఈ పెళ్లి వేడుకకు పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు మొదలైన దిగ్గజాలు హాజరుకానున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 28 నుంచి అంబానీ యాంటాలియాలో పెళ్లి వేడుకలు మొదలవుతాయి. మొత్తానికిచిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు.

Anant Ambani Rolls Royce Cullinan

ఇక అనంత్ అంబానీ కనిపించిన రోల్స్ రాయిస్ విషయానికి వస్తే.. ఇది బ్రాండ్ యొక్క కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌ అని తెలుస్తోంది. కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ అనేది 6.75 లీటర్ ట్విన్ టర్బో వీ12 ఇంజన్‌తో వస్తుంది. ఇది 600 Bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి నాలు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

అనంత్ అంబానీ కారులో కో ప్యాసింజర్ సీటులో కూర్చున్నారు. వీరి సెక్యూరిటీలో.. ఎంజీ గ్లోస్టర్, మహీంద్రా స్కార్పియో, టయోటా ఫార్చ్యూనర్, లాస్ట్ జెన్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ వంటి కార్లు ఉన్నాయి. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. కాగా వీరి వద్ద ఇప్పటికి 9 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం.

రోల్స్ రాయిస్ కార్లు ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లు. అయినప్పటికీ అంబానీ గ్యారేజిలో మొత్తం 9 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయంటే.. వారికి రోల్స్ రాయిస్ బ్రాండ్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా వీరి వద్ద ఫెరారీ పురోసాంగ్యూ, బెంట్లీ, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ మరియు లంబోర్ఘిని వంటి అనేక ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, June 27, 2024, 14:51 [IST]
English summary
Anant ambani visits ajay devgn house with a rolls royce cullinan
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+