గణేశ్ ఉత్సవాలకు రూ. 13 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో వెళ్లిన అనంత్ అంబానీ.. ఆ ఒక్క దానికే రూ. కోటి ఖర్చు!!

లగ్జరీ కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొనాలంటేనే బడ్జెట్ గుర్తొస్తుంది. అందుకే ఖరీదైన లగ్జరీ కార్లు ధనవంతులు, సెలబ్రిటీలకే సొంతం. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్ ఇలా లగ్జరీ కార్ల జాబితా చాలా ఉంది. తాజాగా అంబానీ వారసుడు ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్న వీడియో వైరలైంది.

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు ఎక్కువగా బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ మోటార్‌కార్స్‌ సూపర్ లగ్జరీ కార్లలోనే తిరుగుతారు. అయితే మన దేశంలో బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా ఆ కోవలోకే వస్తారు. అయితే అంబానీ కుటుంబానికి అనేక రోల్స్ రాయిస్(Rolls Royce) కార్లు ఉన్నాయి. తరచూ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన కార్లలో బయటికి రావడం చూస్తూనే ఉన్నాం.

Anant-Ambani-Rolls-Royce-Cullinan

ఇటీవల, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) గణేశ్ ఉత్సవాలకు రూ. 13.14 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్(Rolls Royce Cullinan) కారులో వచ్చారు. అనంత్ అంబానీ తన రోల్స్ రాయిస్ కల్లినన్‌లో వచ్చి వెళ్లే వీడియోను యూట్యూబ్‌లోని "కార్స్ ఫర్ యు" ఛానల్‌లో షేర్ చేశారు.

ఈ వీడియోలో, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన టుస్కాన్ సన్ ఎల్లో రోల్స్ రాయిస్ కల్లినన్‌లో వస్తున్నట్లు చూడవచ్చు. అనంత్ అంబానీ తన SUV నుంచి దిగిన వెంటనే సెక్యూరిటీగా సెక్యూరిటీ గార్డులు వెంటనే రక్షణగా నిలిచారు. ఇటీవల అనంత్.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

Anant-Ambani-Rolls-Royce-Cullinan

వీడియోలో, అనంత్ అంబానీ గణేశ్ మండపంలోకి ప్రవేశించి వినాయకుడిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆశిష్ షెలార్.. అనంత్ అంబానీకి కొన్ని బహుమతులను అందజేశారు. కాసేపటి తర్వాత అనంత్ అక్కడి నుంచి బయటకు వచ్చారు. తన రోల్స్ రాయిస్ కల్లినన్‌లో తిరిగి వెళ్లిపోయారు.

ఇక రోల్స్ రాయిస్ కల్లినన్ విషయానికొస్తే, రోల్స్ రాయిస్ ఫ్యామిలీలో మూడవది. అయితే మొత్తంగా, అంబానీ ఫ్యామిలీకి నాలుగు రోల్స్ రాయిస్ కల్లినన్‌లు ఉన్నట్లు సమాచారం, కాగా అనంత్ అంబానీ వచ్చిన కారు ఇది అత్యంత ఖరీదైనది. ఇంకా టస్కాన్ సన్ ఎల్లో కలర్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. నివేదికల ప్రకారం, ఈ కలర్ కోసం అంబానీ ఫ్యామిలీ అదనంగా రూ. 1 కోటి ఖర్చు చేసినట్లు సమాచారం.

Anant-Ambani-Rolls-Royce-Cullinan

రోల్స్ రాయిస్ కల్లినన్‌లో ఇతర ప్రత్యేక ఆప్షన్లను కూడా తీసుకున్నారు. దీంతో ఈ కారు మొత్తం ధర దాదాపు రూ.13.14 కోట్లకు చేరుకుంది. అంబానీ ఫ్యామిలీలోని అన్ని కల్లినన్‌ మోడళ్లు స్టాండర్డ్ మోడల్స్. ఇందులో 6.75 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

రోల్స్ రాయిస్ కల్లినన్ లగ్జరీ కారు ఇంజిన్ 571 బీహెచ్‌పీ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ ZF ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంకా ఈ రోల్స్ రాయిస్ కల్లినన్ SUV కారు కళ్లు చెదిరే వేగం అంటే 250 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.

Anant-Ambani-Rolls-Royce-Cullinan

ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి అనేక ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఎస్ గార్డ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే, బీఎండబ్ల్యూ 7 సిరీస్ హై సెక్యూరిటీ, రోల్స్ రాయిస్ కల్లినాన్, బెంట్లీ బెంటేగా మరియు లంబోర్ఘిని ఉరస్ వంటి ఇతర లగ్జరీ కార్లతో పాటు ఆకర్షణీయమైన స్పోర్ట్స్ కార్లు ఉన్న అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ.

More from DriveSpark

Article Published On: Friday, September 29, 2023, 16:23 [IST]
English summary
Anant ambani visits ganesh celebration in his rs 13 crores rolls royce cullinan suv full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+