మొన్న జామ్‌నగర్‌లో.. ఇప్పుడు క్రూయిజ్ షిప్‌లో: అంబానీ అంటే మినిమమ్ ఉంటది

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ త్వరలో జరగనున్న వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అంతకంటే ముందు మరోసారి వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సిద్ధమైపోయారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గత కొన్ని రోజులకు ముందు జరిగిన ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు మరవడానికి ముందే.. అంబానీ ఫ్యామిలీ తన తన చిన్న కొడుకుకు మరోసారి ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు జరపడానికి సిద్ధమైంది. ఈ సారి మునుపటి మాదిరిగా కాకుండా విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండవ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలకు కూడా ప్రపంచం నాలు మూలల నుంచో ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు హాజరవుతారు.

Ananth Ambani Radhika Merchants Cruise Ship Wedding

2024 మే 28 నుంచి 30 వరకు సుమారు 4380 కిమీ దూరం క్రూయిజ్ ప్రయాణిస్తుంది. ఇది ఇటలీ నుంచి బయలుదేరి దక్షిణ ఫ్రాన్స్‌లోని తన చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ వేడుకలకు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ మరియు అలియా భట్ వంటి దిగ్గజ సినీ తారలతో పాటు 800 మంది ఇతర ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

క్రూయిజ్ షిప్‌లో జరిగే ఈ రెండవ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు అనే విషయాలు ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. కాగా ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన వేడుకలకు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వేడుకలకు అంతర్జాతీయ ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలతో సహా దాదాపు 1,200 మంది అతిథులు హాజరయ్యారు.

Ananth Ambani Radhika Merchants Cruise Ship Wedding

ఇప్పటికే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. కాగా వీరి పెళ్లి జులై 12న జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి అంబానీ ఇల్లు యాంటిలియా మరియు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. మొత్తం మీద ముకేశ్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి ఇండియాలోనే జరుగుతుందని తెలుస్తోంది.

ఇక క్రూయిజ్‌ షిప్ విషయానికి వస్తే.. ఇందులో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. చాలామంది ఒక్కసారైనా ఇందులో ప్రయాణించాలని అనుకుంటారు. కానీ ఇందులో ప్రయాణం చేయాలంటే భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంబానీ ప్రపంచ ధనవంతులలో ఒకరు, కాబట్టి తన కొడుకు ఆనందం కోసం కోట్లు వెచ్చించి ఇలాంటి వేడుకలు చేయడం సర్వ సాధారం. ఇప్పటికే ఒకసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే.. మినిమమ్ అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు గుర్తుండి పోవాలి అన్నట్లుగా వేడుకలు జరిపిస్తున్నారు. ఇప్పటికే జరిగిన ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా గొప్పగా జరిగాయి. ఎంతో మంది ప్రముఖులు ప్రపంచం నాలు మూలల నుంచి వచ్చారు. ఇప్పుడు రెండో సారి ప్రారంభం కానున్న వేడుకలకు కూడా ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, May 25, 2024, 15:23 [IST]
English summary
Ananth and radhika second free wedding in cruise ship
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+