వివాదాల మాజీ యాంకర్ 'దివ్య వసంత' కారు చూసారా? ఎన్ని లక్షలో తెలుసా?

ఒకప్పుడు ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసిన దివ్య వసంత గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ కన్నడ ప్రజలకు ఈ పేరు సుపరిచయమే. ఎందుకంటే విలాసాలకు అలవాటుపడి అడ్డదారిలో సంపాదించాలనుకుని ఇబ్బందుల్లో పడ్డ ఎంతోమందిలో ఈమె ఒకరు. గతంలో బెంగళూరులోని ఇందిరానగర్‌లోని మసాజ్ పార్లర్ అండ్ స్పా మేనేజర్‌ని బెదిరించి 15 లక్షల రూపాయల దోపిడీకి ప్రయత్నించిన కేసులో ప్రజెంటర్ దివ్య వసంత కూడా నిందితురాలు. ప్రస్తుతం న్యూస్ ఛానెల్‌కు కూడా స్వస్తి చెప్పి సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసుకుంటోంది. ఇప్పటికే ఈమె హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఓ కారును కూడా కొనుగోలు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండి బయటకు వచ్చిన మాజీ యాంకర్ దివ్య వసంత సుమారు ఆరు నెలలకు ముందు హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేశారు .దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దేశీయ విఫణిలో హ్యుందాయ్ క్రెటా కారు ధరలు రూ. 13.79 లక్షల నుంచి రూ. 25.32 లక్షల మధ్య ఉన్నట్లు సమాచారం.

Divya Vasantha Hyundai Creta

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా SUV రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి పెట్రోల్, మరొకటి డీజిల్ ఇంజిన్. భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న హ్యుందాయ్ కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ క్రెటా. ఈ SUV ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గొప్ప అమ్మకాలను పొందుతూ ముందుకు సాగుతూ ఉంది.

మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్ మరియు ఎస్ఎక్స్ (ఓ) అనే ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. చూడటానికి అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఎందుకున్న వేరియంట్‌ను బట్టి ఫీచర్స్ కొంత వరకు మారే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

Divya Vasantha Hyundai Creta

హ్యుందాయ్ క్రెటా కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ జోన్ ఏసి మరియు లేటెస్ట్ ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం) వంటి అనేక అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగ దారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించడమే కాకుండా.. భద్రతను కూడా నిర్థారిస్తుంది.

పైన చెప్పుకున్న ఫీచర్స్ మాత్రమే కాకుండా.. హ్యుందాయ్ క్రెటా పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 8 స్పీకర్ బాస్ సౌండ్ సిస్టమ్‌ వంటివి కూడా పొందుతుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఇసోఫిక్స్ చైల్డ్ సీట్లు మొదలైనవి ఉంటాయి. ఇవి కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా ఉంది. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ వంటివి పొందుతాయి. ఇవన్నీ 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ.. 7 స్పీడ్ డీసీటీ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ వంటివి పొందుతుంది. కాబట్టి ఇవన్నీ అత్యుత్తమ పనితీరును అందించడానికి అనుకూలంగా ఉంటాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 10, 2024, 14:51 [IST]
English summary
Anchor divya vasantha hyundai creta suv details
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+