రోజురోజుకూ ముదురుతున్న యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం
మద్యం సేవించి కారు నడుపుతున్నాడనే అనుమానంతో పోలీసులు ప్రదీప్‌కు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా 178 పాయింట్లు చూపించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రదీప్ మీద కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్ సిటీ మొత్తం ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క రోజు మాత్రమే 55,540 కార్లను తనిఖీ చేశారు. వీటిలో మద్యం సేవించి కారు నడిపిన 1683 మంది మీద కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన కార్లలో ఎక్కువగా లగ్జరీ కార్లే ఉండటం గమనార్హం.

నూతన సంవత్సర వేడుకల పర్వం పేరుతో మద్యం మత్తులో మునిగితేలి కార్లను నడిపే వారి మీద చర్యలు తీసుకునేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బడా వ్యక్తులతో పాటు సెలబ్రిటీలు కూడా పట్టుబడ్డారు. అందులో ప్రఖ్యాతగాంచిన బుల్లెతెర తెలుగు వ్యాఖ్యాత ప్రదీప్ కూడా పట్టుబడిన సంగతి తెలిసిందే.
Recommended Video


మద్యం సేవించి కారు నడుపుతున్నాడనే అనుమానంతో పోలీసులు ప్రదీప్‌కు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా 178 పాయింట్లు చూపించింది. సాధారణ స్థాయి కంటే మోతాదుకి మించి మద్యం తీసుకున్నాడని తేలడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రదీప్ మీద కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారికి దాని వలన జరిగే అనర్థాల గురించి పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం(జనవరి 2వ తేదీ) రోజున బేగంపేటలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉండగా.. హాజరవ్వలేదు.

బుధవారం 11 గంటలలోపు కౌన్సిలింగ్‌కు హాజరు కాకుంటే, ఆ అంశాన్ని ఛార్జ్ షీటులో పొందుపరుస్తామని బేగం పేట ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన అందరికీ రెండు రోజుల్లోపే కౌన్సిలింగ్ పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రదీప్ హాజరవ్వకపోతే 7 రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే సాధారణ వ్యక్తులయినా... సెలబ్రిటీలైనా ఉపేక్షించేది లేదని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల విధులు స్పష్టం చేస్తున్నాయి. మద్యం సేవించి వాహనం నడపడం తప్పని తెలిసినా... నడుపుతూనే ఉన్నారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అంటూ ప్రదీప్ ఓ వీడియోలో తెలిపాడు. అలాంటిది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడ్డాడు.
Trending On DriveSpark Telugu:

డ్రంక్ అండ్ డ్రైవ్ పరంగా మన దేశంలో ఎలాంటి చట్టాలు, జరిమానాలు మరియు శిక్షలు ఉన్నాయో చూద్దాం రండి....
మన దేశంలో సాధారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కంటే మద్యం మత్తులో జరిగే ప్రమాదాలే అధికంగా ఉన్నాయి. ఒక్క ఢిల్లీలో జరిగే ప్రమాదాల్లో 70 శాతం మద్యం మత్తు కారణంగానే సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆందోళనకరమైన గణాంకాలు వెలువడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల మీద చట్టాలను ఎప్పటికప్పుడు మరింత కఠినతరం చేస్తోంది.

భారతదేశంలో చట్టపరంగా మద్యం సేవించే వయస్సు ఎంత ?
చట్ట పరంగా మద్యం సేవించే వయస్సు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 18 ఏళ్ల పరిమితి ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో 21 నుండి 25 ఏళ్ల పరిమితి ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేరళ రాష్ట్రంలో చట్టపరంగా మద్యం సేవించే కనీస వయసు 23 ఏళ్లుగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలో కనీసం పరిమితి 21 సంవత్సరాలు.
కొన్ని రాష్ట్రాలు మద్య విక్రయాన్ని పూర్తిగా నిషేధిస్తే, మరికొన్ని రాష్ట్రాలు మద్యపానాన్ని అనధికారికం చేశాయి.

రక్తంలో ఎంత శాతం వరకు ఆల్కహాల్ ఉండవచ్చు...?
ఇండియాలో 100మిలీ రక్తంలో 0.03 శాతం వరకు ఆల్కహాల్ మోతాదు ఉండవచ్చు. అంటే, 100మిలీ రక్తంలో 30మిగ్రా వరకు అల్కహాల్ ఉండటం చట్టపరంగా తప్పేమీ కాదు. ఈ లెక్కన 65కిలోల బరువున్న వ్యక్తి సగటు 12 ఔన్సుల బీరు, రెండు గ్లాసుల వైన్ లేదా 60మిలీ విష్కీ సేవించవచ్చు.

బ్రీత్ అనలైజర్‌లో ఎదురయ్యే పరిణామాలు ఏంటి ?
బ్రీత్ అనలైజర్‌లో మోతాదుకు మించిన ఆల్కహాల్ లెవల్స్ ఉన్నట్లయితే, నిందితులు రూ. 2,000 ల వరకు జరిమానా చెల్లించాలి, లేదంటే ఆరు నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడిన అనంతరం మూడేళ్లలోపు మళ్లీ పట్టుబడితే రూ. 3,000 ల వరకు జరిమానా మరియు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇందుకు చక్కటి పరిక్షారం... క్యాబులో ఇంటికెళ్లడం లేదా మత్యం సేవించని మీ డ్రైవర్ లేదా మీ స్నేహితున్ని కారులో ఇంటికి తీసుకెళ్లమనడం.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అరెస్ట్ అయితే లేదా బ్రీజ్ అనలైజర్ టెస్ట్‌కు అంగీకరించకపోతే పరిస్థితి ఏంటి?
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అరెస్ట్ చేస్తే, మోటార్ వాహనాల చట్టం 185 మేరకు, ఆ వక్తిని అరెస్ట్ చేసిన రెండు గంటల్లోపు వైద్య పరీక్షల కోసం గుర్తింపు పొందిన డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ఒక వేళ బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిరాకరిస్తే వారి రక్తాన్ని శాంపుల్ తీసుకొని టెస్టింగ్ నిమిత్తం పంపాలి. బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం సేవించినట్లు తెలిసినా కూడా బ్లడ్ చేసే హక్కు పోలీసులకు ఉంది.
మోతాదుకు మించి మద్యం సేవించిన వారిని ఎలాంటి అరెస్ట్ వారంటీ లేకుండానే అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించవచ్చు.

రక్త పరీక్ష చేయించుకోవడానికి నిరాకరిస్తే ఏమవుతుంది ?
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడని భావించి బ్రీత్ అనలైజర్ మరియు బ్లడ్ టెస్ట్‌కు నిరాకరిస్తే, అలాంటి వారిని ఐపిసి సెక్షన్ 279 క్రింద ర్యాష్ డ్రైవింగ్ అంటూ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. నిందితులు జరిమానా చెల్లించవచ్చు, ఒక వేళ అరెస్ట్ అయితే బెయిస్ పొందవచ్చు.

మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఇతరులతు హాని కలిగిస్తే...?
డ్రంక్ అండ్ డ్రైవ్ క్రింద ఉన్న కేసుల్లో ఇది క్షమించరాని నేరం. మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఇతరుల మరణానికి కారణమైతే ఐపిసి సెక్షన్ 308 క్రింద ప్రమేయం లేకుండా మానవ హత్యకు కారణమయ్యాడనే నేరం క్రింద అరెస్ట్ చేయవచ్చు. ఖచ్చితంగా గుర్చించుకోవాల్సిన ముఖ్యమైన విషయం శిక్ష బుుజువైతే బెయిల్ రహిత ఏడేళ్ల జైలు శిక్ష గ్యారంటీ.

అంతే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి కారణమయ్యి, ఆ ప్రమాదంలో చికిత్స పొందుతూ క్షతగాత్రులు మరణిస్తే ఐపిసి సెక్షన్ 304(II) క్రింద 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నివారించేందుకు కేంద్రం చట్టాలను మరింత కఠినతరం చేసింది.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








