Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బుల్లెట్ ప్రూఫ్ కార్లకు రూ. 6.75 కోట్లు మంజూరు చేసిన జగన్ సర్కార్.. ఈ కార్లు వారికి మాత్రమే
సాధారణంగా భారత రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులలో ఉన్న అధికారుల రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. భారత రాష్ట్రపతి వాహనం ఈ తరహాలో చాలా పటిష్టంగా తయారుచేయుయబడింది. అంతే కాకుండా ప్రతి దేశం కూడా ఆ దేశం యొక్క రాష్ట్రపతులు మొదలైన వారికి ఈ రకమైన రక్షణను కల్పించడానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తారు.

ఈ నేపథ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ. వైఎస్. జగన్మోహన్రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులకు మరియు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు త్వరలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రానున్నాయి.

రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల సలహా మేరకు ప్రస్తుతం 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.75 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదల చేసింది.
MOST READ:మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నతాధికారుల వినియోగంలోకి రానున్న మొత్తం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఐదు మహీంద్రా స్కార్పియోలు మిగిలిన ఐదు టాటా హెక్సా వాహనాలు ఉంటాయి. ఇందులో ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కోసం రూ. 65 లక్షలరూపాయలు, మరియు ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ టాటా హెక్సా వాహనాల కోసం రూ. 70 లక్షలు చొప్పున ఖర్చు చేయనున్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు వినియోగంలో ఉన్న వాహనాలతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రులు చాలా సార్లు సంబంధిత అధికారులకు తెలిపారు. అంతే కాకుండా పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఓ మంత్రి అనారోగ్యానికి కూడా గురయ్యారన్న చెబుతున్నారు.
MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

ఇప్పటికే మంత్రుల ఇచ్చిన కంప్లైట్స్ వల్ల మరియు కొంతమంది ఉన్నతాధికారుల సలహాలతో ప్రస్తుతమున్న పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత చూపుతోంది. కొత్తగా రానున్న ఈ 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి, కొంతమంది మంత్రులకు మరియు పోలీస్ శాఖలోని కొంతమంది ఉన్నతాధికారుల రక్షణలో ఉపయోగించనున్నారు.

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చాలా భద్రతా లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ భద్రతా లక్షణాల వల్ల అధికారులకు ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. కావున ఉన్నతాధికారులకు ఈ రకమైన భద్రతలు కల్పించడానికి రాష్ట్రప్రభుత్వాలు ఇంతటి పటిష్టమైన చర్యలు తీసుకుంటాయి.
MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి