కరోనా నివారణ కోసం మరో కొత్త చర్య తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ; అదేంటో తెలుసా

భారతదేశంలో కరోనా రోజు రోజుకి అధికంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా మహమ్మరి ఎక్కువగా వ్యాపిస్తుంది. రోజు రోజుకి కరోనా చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ఈ తరుణంలో కోవిడ్ -19 కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

తక్కువ టైంలో ఎక్కువ టెస్టింగ్స్ చేయడానికి కొత్త మొబైల్ టెస్టింగ్ బస్సులు

రాష్ట్రంలోని అధికంగా కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న ప్రాంతాలలో నమూనాలను సేకరించడానికి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 52 బస్సులు మోహరించింది. ఇప్పటికి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 102 బస్సులు వివిధ జిల్లాల్లో 95 ప్రాంతాల నుండి నమూనాలను సేకరిస్తున్నాయి.

తక్కువ టైంలో ఎక్కువ టెస్టింగ్స్ చేయడానికి కొత్త మొబైల్ టెస్టింగ్ బస్సులు

ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలిసిస్ సర్వీసెస్ సిస్టం కాంటాక్ట్‌లెస్ డిజిటలైజ్డ్ ద్వారా నమూనాలను సేకరిస్తున్నారు. ఇప్పుడు కరోనా నివారణలో భాగంగా అన్ని కంటెమెంట్ జోన్లలో ట్రాకింగ్ మరియు ట్రేసింగ్ జరుగుతూ ఉంది.

MOST READ:భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

తక్కువ టైంలో ఎక్కువ టెస్టింగ్స్ చేయడానికి కొత్త మొబైల్ టెస్టింగ్ బస్సులు

దీని గురించి హెల్త్ కమిషనర్ కట్టమనేని భాస్కర్ మాట్లాడుతూ, ప్రస్తుతం 102 ప్రత్యేక బస్సులను కరోనా టెస్టులను చేయడానికి మోహరించారు. వీటి ద్వారా ఒకే సమయంలో 10 నుంచి 12 మందిని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

తక్కువ టైంలో ఎక్కువ టెస్టింగ్స్ చేయడానికి కొత్త మొబైల్ టెస్టింగ్ బస్సులు

ఈ బస్సులలో మల్టిపుల్ టెస్టింగ్ కౌంటర్లు ఉంటాయి. ఇవి కరోనా టెస్టులను మరింత సులభతరం చేస్తుందని భాస్కర్ తెలిపారు. ప్రతి బస్సులో 10 కౌంటర్లు ఉన్నాయి, ప్రతి కౌంటర్లో ముగ్గురు అధికారులు ఉంటారు.

MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

తక్కువ టైంలో ఎక్కువ టెస్టింగ్స్ చేయడానికి కొత్త మొబైల్ టెస్టింగ్ బస్సులు

కరోనా సాంపిల్స్ సేకరించిన తర్వాత పరీక్షల కోసం ఐసిఎంఆర్ ప్రయోగశాలలకు పంపుతారు. అంతే కాకుండా సరిహద్దు చెక్‌పోస్టుల అధికారులు ఆధార్ సంఖ్యల సహాయంతో కొత్తగా రాష్ట్రంలోకి ప్రవేశించే వ్యక్తుల వివరాలను ధృవీకరిస్తారు. ప్రతి వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి హోమ్ క్వారంటైన్ లో ఉంచుతారు. క్వారంటైన్ సమయంలో వారిని బహిరంగ ప్రదేశాలలో తిరగకుండా చూసుకుంటారు.

తక్కువ టైంలో ఎక్కువ టెస్టింగ్స్ చేయడానికి కొత్త మొబైల్ టెస్టింగ్ బస్సులు

కరోనా నివారణ కోసం ప్రత్యేకంగా మాడిపై చేసిన బస్సులను మాత్రమే ఉపయోగించడం మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించాల్సిన ఎక్కువ మంది వైద్య నిపుణులను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రాధమిక స్థాయి నుండి తృతీయ స్థాయి వరకు ఆరోగ్య వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, మరియు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ప్రస్తుతం మొత్తం 9,700 మంది వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్

Most Read Articles

English summary
Andhra doubles its mobile Covid testing infrastructure. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X