ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

భారతదేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులాగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్ ఒకటి. కావున ఆంధ్రప్రదేశ్ లో కూడా కఠినమైన ఆంక్షలు విధించబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

ప్రస్తుతం కరోనా నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరైనా వాహనదారులు బయటకి వస్తే వారిపై చర్యలు తీసుకోబడతాయి. అయితే అత్యవసర సమయంలో మాత్రం కొన్ని నియమాలతో బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సమయంలో బయటకు రావడానికి ఈ-పాస్ అమలు చేయబడింది. కావున ఈ-పాస్ అవసరమైన వ్యక్తులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న వారైయు లాక్ డౌన్ సమయంలో బయటకు రావడానికి అర్హులు. ఈ పాస్ కావాలనుకునే వారు appolice.gov.in అనే వెబ్ సైట్ లో పొందవచ్చు.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

అత్యవసర సమయంలో మాత్రమే సంబంధిత పత్రాలతో ఈ ఈ పాస్ పొందాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ కరోనా ఈ పాస్ పొందే విధానం ఎలాగో ఈ క్రింద చూడండి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

ఇక్కడ appolice.gov.in వెబ్ సైట్ పై క్లిక్ చేసిన వెంటనే పేరు, చిరునామా మరియు ఫోటో వంటివి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తరువాత ఏ అవసరంతో ప్రయాణించాలనుకునుటున్నారు అని నిర్దారించాలి. అప్లై చేసుకునే వారి ప్రజెంట్ అడ్రస్, చేరుకోవాల్సిన అడ్రస్ పొందుపరచాలి.

MOST READ:గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 118 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం, ఇంకో 20 స్టేషన్స్ అక్కడ కూడా..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

తర్వాత ప్రయాణం ఒకసారి వెళ్లాలా లేకుంటే వెళ్లి తిరిగి రావాలా అనే దాన్ని కూడా ఇక్కడ తెలియజేసి, ప్రయాణానికి కచ్చితమైన కారణం తెలియజేయాలి, మరియు ప్రయాణానికి సొంతవాహనమా లేక ప్రజా రవాణా అని తెలియజేయాలి. ఇందులో ఎంతమంది ప్రయాణించాలి, వారి పేర్లు ఫోన్ నంబర్స్ మరియు గుర్తింపు కార్స్ సమర్పించాలి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

కరోనా కి సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉన్నాయా లేదా అని ముంచుగానే ఇక్కడ తెలియపరచాలి. అంతే కాకుండా గతంలో క్వారంటైన్ లో ఉన్నారా లేదా అని నిర్దారించాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న వారికి కేవలం గంట వ్యవధిలోనే ఈ పాస్ మంజూరు చేయడానికి ప్రయత్నిస్తుందని, ప్రభుత్వం స్పష్టం చేసింది.

MOST READ:తోటి వ్యక్తి అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్థులు.. పిఎఫ్‌ఐ టీమ్ రాకతో కథ సుఖాంతం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

ఇదిలా ఉండగా టీవీ9 కథనంలో వచ్చిన దాని ప్రకారం ప్రతి జిల్లాకు సంభందించిన అధికారుల మొబైల్ నంబర్స్ మరియు మెయిల్ ఐడి లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా కరోనా ఈ-పాస్ పొందవచ్చు. ఏది ఏమైనా ఈ కరోనా నివారణలో ప్రభుత్వం చేస్తున్న కృషికి మన వంతు కూడా మద్దతుగా వీలైనంతవరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నించాలి.

NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Police To Issue E-Passes For Entry Into Andhra Pradesh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X