నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 1000 కి పైగా అంబులెన్సులను ప్రారంభించిన విషయం విదితమే, అత్యవసర పరిస్థితులలో ప్రజలకు సేవ చేయడానికి మరియు అధునాతన పద్దతులలో వైద్యం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో అంబులెన్సులను ప్రారంభించారు.

నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

ఈ నేపథ్యంలో భాగంగా నగరి నియోజక వర్గంలో అంబులెన్సులను నియోజక వర్గ ఎమ్మెల్యే రోజా ప్రారంభించింది. ఈ అంబులెన్సులు ప్రారంభించడానికి రోజా పూజ చేసి ప్రారంభించింది. ఇక్కడ ఉన్న వీడియోలో మనం గమనించినట్లయితే రోజా అంబులెన్సుని డ్రైవ్ చేయడం మనం చూడవచ్చు.

నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

ఆంధ్రప్రదేశ్‌లోని నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దక్షిణ భారత మాజీ నటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె రోజా మంగళవారం మధ్యాహ్నం కొత్తగా ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ డ్రైవింగ్ చేయడం, ఫోటోలకు పోజు ఇవ్వడం వంటివి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గంలో వీడియోలలో చిత్రీకరించడం జరిగింది.

MOST READ:టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు, ఎలా ఉన్నాయో చూసారా ?

నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ రోగులను ఆసుపత్రులు మరియు టెస్టింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2020 జూలై 7 న రాష్ట్రంలో 1178 కొత్త కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో ప్రస్తుత కేసుల మొత్తం 21,197 కు చేరుకోగా, 13 మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 252 కు చేరుకున్నాయి.

నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

మాజీ తెలుగు సినీ నటి రోజా పార్టీలో బహిరంగ పరస్పర చర్యలకు పాల్పడినందుకు చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 21 న లాక్ డౌన్ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, ఆమె తన నియోజకవర్గంలోని ఒక గ్రామానికి ఒక బోర్‌వెల్ ప్రారంభోత్సవం చేయటానికి వెళ్ళింది. అక్కడ బోర్‌వెల్ ప్రారంభించడానికి ఆమె నడుచుకుంటూ వెళుతుండగా గ్రామస్తులు తన ముందు గులాబీ పూల రేకులను పరిచారు.

MOST READ:మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !

స్థానిక రెవెన్యూ శాఖ అధికారుల సూచనల మేరకు పలువురు మహిళలు, పిల్లలతో సహా గ్రామస్తులు మాస్కులు ధరించి గ్రామ రహదారిలో నిలబడి ఆమె నడుచుకుంటూ వెళ్లే దారిలో గులాబీ రేకులను పరిచారు. ఆ సమయంలో కూడా చాల విమర్శలు ఎదుర్కొంది. కానీ దీనికి సమాధానంగా తనని అలా ఆహ్వానించమని ఆమె వారికి సూచించలేదని రోజా చెప్పారు. వారు తన కోసం పువ్వులు పడటానికి వేచి ఉన్నారని నాకు తెలియదని చెప్పారు.

నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

భారతదేశంలో కరోనా అధికంగా విస్తరిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలకు అత్యవసర సమయంలో సేవ చేయడానికి అధునాతన టెక్నాలజీ కలిగిన అంబులెన్సులను ప్రారంభించదమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు అధికంగా నిర్వహిస్తున్నారు.

MOST READ:అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?

Most Read Articles

English summary
AP: Nagari legislator Roja drives new ambulance, poses for photos, delays deployment. Read in Telugu.
Story first published: Wednesday, July 8, 2020, 18:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X