ఇది కదా కారంటే!.. ఎంజల్ వన్ సీఈఓ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి (ఫోటోలు)
సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఎప్పటికప్పుడు ఖరీదైన.. తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తారని అందరికి తెలుసు. ఇందులో భాగంగానే భారతీయ స్టాక్ బ్రోకర్ కంపెనీ ఏంజెల్ వన్ సీఈఓ 'దినేష్ ఠక్కర్' ఓ సూపర్ కారు కొన్నారు.
భారతదేశంలో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తలతో ఒకరైన 'దినేష్ ఠక్కర్' (Dinesh Thakkar)కు కూడా కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన అప్పుడప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఈయన ఇటీవల 'లంబోర్ఘిని స్టెరటో' (Lamborghini Sterrato) కారు కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చాలా రోజులకు ముందే భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేసిన లంబోర్ఘిని కంపెనీకి చెందిన స్టెరటో ధర రూ. 4.61 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ ఖరీదైన కారును దినేష్ ఠక్కర్ కొన్నారు. ఈయన కొన్న లంబోర్ఘిని స్టెరటో ఆలీవ్ గ్రీన్ షేడ్‌లో ఉండటం చూడవచ్చు. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ పొందిన ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి.
2022లో ప్రారంభమైన లంబోర్ఘిని స్టెరాటో యొక్క డెలివరీలు 2023 మూడవ త్రైమాసికంలో మొదలయ్యాయి. స్టెరాటో అనేది లిమిటెడ్ ఎడిషన్ కారు. కాబట్టి ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. సాధారణ లంబోర్ఘిని హురాకాన్ కంటే ఇది చాలా భిన్నంగా.. అనేక అదనపు అప్డేట్స్ పొందుతుంది. ఈ కారు యొక్క ముందు మరియు వెనుక ట్రాక్‌లను కంపెనీ 30 మీమీ మరియు 34 మిమీ వరకు పెంచింది.

లంబోర్ఘిని స్టెరాటో యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 44 మిమీ పెరిగింది. కాబట్టి మంచి డ్రైవింగ్ అనుభూతిని తప్పకుండా అందిస్తుంది. ఈ కారు అల్యూమినియం ఫ్రంట్ అండర్ బాడీ, రీన్‌ఫోర్స్డ్ సిల్స్, రూప్ మౌంటెడ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు, ఫ్రంట్ బంపర్ మీద రెండు ఎల్ఈడీ ఆక్సిలరీ లైట్లు, రగ్గడ్ ఫెండర్ ఫ్లేర్స్, రివైజ్డ్ డిఫ్యూజర్ మరియు ఛంకీ సైడ్ స్కర్ట్స్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
లంబోర్ఘిని స్టెరాటో అదే 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ10 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 610 పీఎస్ పవర్ మరియు 560 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సాధారణ హురాకాన్‌తో పోలిస్తే ఇంజిన్ కొంత రీట్యూన్ చేసినట్లు తెలుస్తోంది. 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది.

దినేష్ ఠక్కర్ గ్యారేజిలోని ఇతర కార్లు..
కార్ల మీద ఎక్కువ మక్కువ కలిగిన దినేష్ ఠక్కర్ గ్యారేజిలో లంబోర్ఘిని స్టెరాటో మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యు ఐ7, పోర్స్చే టేకాన్ టర్బో ఎస్, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ, బెంజ్ ఏఎంజీ జీటీఆర్, లంబోర్ఘిని పెర్ఫార్మంటే, లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్, పోర్స్చే 992 911 జీటీ3 టూరింగ్ మరియు బెంజ్ జీ63 వంటివి కూడా ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








