నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]
ఏనుగమ్మ.. ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు, ఏనుగుమీద రాముడు ఎంతో చక్కని దేవుడు అనే పాటలు చిన్నప్పుడు పాడుకుంటూ ఉంటే ఒక్కసారైనా ఏనుగు ఎక్కాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వెలుగులోకి వచ్చిన వీడియో చూస్తే.. ఏనుగు దరిదాపుల్లోకి వెళ్లాలంటే కూడా ఒళ్ళు ఝల్లుమంటుంటుంది.
Recommended Video
ఇంతకీ మన మంచి ఏనుగు అంతగా ఏమిచేసింది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. వచ్చేయండి.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero1-1662793155.jpg)
ఇప్పటికి విడుదలైన వీడియో గమనించినట్లయితే ఒక భారీ ఏనుగు 'మహీంద్రా బొలెరో' (Mahindra Bolero) కారును వెంబడిస్తూ.. తరుముకుంటూ నీ అంతు చూస్తా అన్నట్లు వస్తోంది. అయితే ఆ కారులోని డ్రైవర్ మాత్రం, ఏ మాత్రం చలించకుండా ఎంతో చాక చక్యంగా కారుని రివర్స్ గేర్ లో చాలా దూరం తీసుకువచ్చేసాడు. చివరికి ఆ ఏనుగు వెనుకకు తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అప్పుడు డ్రైవర్ పక్కనే ఉన్న వ్యక్తి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero2-1662793164.jpg)
ఈ సంఘటన మైసూరు సమీపంలోని 'కబిని నేషనల్ పార్క్' లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్క్ ని సందర్శించడానికి ఎంతోమంది పర్యాటకులు వస్తూనే ఉంటారు. అలాంటి వారు ఈ పార్కులో తిరగడానికి అనుకూలంగా మహీంద్రా బొలెరో మాడిఫై చేశారు. అంతే కాకుండా అటువంటి కార్లు తిరగటానికి లోపల ఒక మార్గం కూడా నిర్మించబడి ఉంటుంది.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero3-1662793172.jpg)
మనకు కనిపిస్తున్న మహీంద్రా బొలెరో సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఒక భారీ ఏనుగు రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. ఆ సమయంలో వస్తున్న కారును చూసి ఆ ఏనుగు కారును తరుముకుంటూ వచ్చింది. అప్పుడు డ్రైవర్ ఎంతో నేర్పుగా తప్పిచుకోగలిగాడు.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero4-1662793182.jpg)
ఈ వీడియోను 'సుప్రియా సాహు' ఐఏఎస్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో షేర్ చేశారు. నిజానికి ఈ వీడియోలో ఆ డ్రైవర్ నైపుణ్యం చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోతారు. ఆ ఏనుగు కారును సమీపించినప్పుడు కూడా ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా కారును రివర్స్ లో నడుపుతాడు. అటువంటి సఫారీ వాహనాల డ్రైవర్లకు అటువంటి పరిస్థితిని నిర్వహించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు. ఎందుకంటే వారు ఎప్పుడూ అడవి జంతువుల మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి శిక్షణ చాలా అవసరం.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero5-1662793191.jpg)
ఈ వీడియోలో ఆ భారీ ఏనుగు సఫారీ వాహనాన్ని వెంబడించే సమయంలో దాని తొండం మరియు దంతాలు కూడా కూడా కారు బోనెట్ కి తగలడం కూడా చూడవచ్చు. అయితే చాలా దూరం వెంబడించిన తరువాత ఆ ఏనుగు అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero6-1662793199.jpg)
మహీంద్రా బొలెరో విషయానికి వస్తే, మహీంద్రా కంపెనీ యొక్క బొలెరో ఎక్కువమంది వాహనప్రియులు ఇష్టపడే వాహనాల్లో ఒకటి. ఇది కఠినమైన రహదారుల్లో కూడా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కావున ఇటువంటి ఆఫ్ రోడర్ వాహనాలను 'జూ', నేషనల్ పార్కుల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి మంచి పనితీరుని కూడా అందిస్తాయి.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero7-1662793207.jpg)
ప్రశాంతమైన వాతావరణంలో గడిపే జంతువులు ఏ చిన్న అలజడిని, వాహనాల శబ్దాలను భరించలేవు. ఆ సమయంలోనే దాడులు చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా వెలుగులోకి వచ్చాయి.
I am told this is in Kabini ! Hats off to the driver 🫡 deft handling of the situation with a cool mind is commendable. Source- shared by a friend pic.twitter.com/rfCQbIjK1T
— Supriya Sahu IAS (supriyasahuias) September 8, 2022
గతంలో కర్నాటకలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్ ఒక పులి తన నోటితోనే ఏకంగా టూరిస్టులు ఉన్న కారును లాగేసింది. ఆ సమయంలో 6 మంది ప్రయాణికులతో ఉన్న మహీంద్రా జీలోను లాగింది. మహీంద్రా జిలో ఎస్‌యూవీ బరువు దాదాపు 1,875 కిలోలు. ఇందులో కూర్చున్న పర్యాటకుల బరువుతో కలిపి దాదాపు 2 టన్నుల బరువు ఉంటుంది. ఇది కూడా అప్పట్లో చాలా వైరల్ అయ్యింది.
![నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో] నిజానికి కుక్కలే వాహనాల వెంట పడతాయి.. కానీ ఇక్కడ ఏనుగే వాహనాన్ని పరుగులు పెట్టించింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/09/elephant-chases-mahindra-bolero8-1662793215.jpg)
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
అడవి జంతువులు అప్పుడప్పుడు వాహనాల వెంట పడుతూనే ఉంటాయి. కావున ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. అయితే నేషనల్ పార్క్ వంటి వాటిని సందర్శించినప్పుడు ఖచ్చితంగా బాగా తెలిసిన మరియు శిక్షణ పొందినవారితో ఉండటం మంచిది. ఈ విషయాన్ని పర్యాటకులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేకుంటే అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి.


Click it and Unblock the Notifications








