ఆగ్రహించిన ఏనుగు.. ధ్వంసమైన వాహనాలు - షాకవుతున్న నెటిజన్లు (వీడియో)
ఏనుగులు చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా.. ఆగ్రహం వస్తే మాత్రం వాటిని ఎవ్వరూ నిలువరించలేరు. ఇటీవల ఓ సంఘటనలో ఏనుగు రోడ్డు పక్కన ఉన్న టూ వీలర్లను, త్రీ వీలర్లను కోపంతో బొమ్మల్లాగా పైకి లేపి ఎత్తి పడేయడం చూడవచ్చు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. బాగా అలంకరించబడిన ఏనుగు కోపంతో రోడ్డు పక్కన ఆపి ఉంచిన స్కూటర్లను మరియు ఆటోలను ధ్వంసం చేస్తోంది. ఏనుగు మీద ఇద్దరు ఏనుగులు కూర్చున్నప్పటికీ దాన్ని ఎవరూ నిలువరించలేకపోయారు. బహుశా దానికి మితిమీరిన కోపం వల్ల ఇలా చేసి ఉంటుందని చూడగానే అర్థమైపోతోంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు.

ఈ సంఘటన కేరళ లేదా కర్ణాటకలలో జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిందా? లేక చాలా రోజులకు ముందు జరిగిందా అనే విషయం మీద స్పష్టత లేదు. అయితే ఈ సంఘటన మొత్తాన్ని రోడ్డు పక్కనే ఉన్న వ్యక్తి రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పెంపుడు ఏనుగు మరియు ఊరేగింపు సమయంలో సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. అందుకే ఇలా ప్రవర్తించినట్లు సమాచారం.
వీడియోలో గమనిస్తే.. మొదట ఒక స్కూటర్ను పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుంది. అది పట్టు కోల్పోవడం వల్ల విడిచి పెట్టి మార్ స్కూటర్ను పైకి లేపి గాల్లోనే తిప్పుతుంది. ఆ తరువాత పక్కనే ఉన్న ఆటోను పైకి ఎత్తడానికి ప్రయతిస్తుంది, అంతటితో ఆగకుండా దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. ఈ సంఘటన చూసి చాలామంది గట్టిగా అరవడం చూడవచ్చు. ఆ సమయంలో మరో ఆటో మీద పడుతుంది.

ఏనుగుపైన ఉన్న ఇద్దరు కూడా భయపడుతున్నట్లు తెలుస్తోంది. వారు పై నుంచి కిందికి పడితే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఆ ఏనుగు కూడా ఆ ఇద్దరి వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉండొచ్చు. ఆ ఏనుగు దాని దంతంతో ధ్వంసం చేయడం చేస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఏనుగుకు తీవ్రమైన కోపం వచ్చినట్లు అవగతం అవుతోంది.
నిజానికి ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీటికో కోపం వస్తే.. అవి ఏం చేస్తాయో వాటికే తెలియదు. కాబట్టి ఏనుగులతో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే.. అడవి ఏనుగులతో మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. గతంలో వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల్లో అడవి మధ్యలో ఉన్న రోడ్ల మీద వెళ్లే వాహనాలపై అడవి ఏనుగులు దాడికి ప్రయత్నించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో ఓ అడవి ఏనుగు పొలంలో ఉన్న రైతు మీదికి హఠాత్తుగా వస్తుంది. అయితే రైతు ఎంతో చాకచక్యంగా దాని నుంచి తప్పించుకుని.. సమీపంలో ఉన్న ఇంటి దగ్గర పార్క్ చేసిన కారు కిందికి దూరాడు. మొత్తం మీద ఆ ఏనుగు నుంచి తపించుకోగలిగాడు. దీన్ని బట్టి చూస్తే మన ప్రమేయం లేని సమయంలో కూడా అడవి ఏనుగులు దాడి చేస్తాయని స్పష్టంగా తెలుస్తోంది.
కర్ణాటక మరియు కేరళ ప్రాంతాల్లో దేవాలయాల దగ్గర వివిధ సేవల్లో ఉపయోగించడానికి ఏనుగులను పెంచడం జరుగుతుంది. వీటిని అనేక వివాహాది శుభకార్యాలకు కూడా వినియోగిస్తారు. కొందరు వీటిని పూజిస్తుంటారు కూడా. పెంపుడు ఏనుగులు కూడా విధ్వంసాలు సృష్టిస్తాయని ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి ఏనుగులతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








