దారుణం.. ఐస్ క్రీమ్ నచ్చలేదని కారుతో స్టాల్ ని ఢీకొట్టిన వ్యక్తి (Video) వైరల్..

పెరిగిన టెక్నాలజీతో ప్రపంచంలో జరుగుతున్న వింత సంఘటనలు క్షణాల్లో మన అరచేతిలో ఇట్టే వచ్చి వాలుతున్నాయి. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని జనాలకు ఇవి మరింతగా చేరువ అవ్వడంతో మంచితో పాటు చాలా చెడు విషయాలు కూడా త్వరగా తెలుసుకుంటున్నాం. మంచి కంటే ఎక్కువగా చెడునే జనాల కు వేగంగా ఎక్కుతుంది. అలానే ఓ వ్యక్తి చూపించిన పొగరు చూస్తే మీకు కచ్చితంగా కోపం రాకుండా ఉండదు.

ఐస్ క్రీం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి పార్లర్ వాహనంపైకి మహీంద్రా XUV300తో మరో వ్యక్తి దాడి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తన XUVతో ఐస్ క్రీం స్టాల్‌లోకి దూసుకెళ్తూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. స్టాల్ దగ్గర ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియో తీశాడు. అతను చేసిన పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు.

మహీంద్రా XUV

కోపంతో స్టాల్ పై దాడి..
ఈ వీడియో ఎక్కడ చోటుచేసుకుందో తెలియక పోయినప్పటికీ కారు యజమానికి ఐస్‌క్రీమ్ రుచి నచ్చకపోవడంతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే తన టెంపర్ ని ప్రదర్శించిన ఆ వ్యక్తి తన మహీంద్రా XUV300 ఐస్ క్రీం స్టాల్‌లోకి చాలాసార్లు దాడి చేసి స్టాల్ ని ధ్వంసం చేశాడు.

వైట్ కలర్ మహీంద్రా XUV300తో ఉద్దేశపూర్వకంగా ఫలూదా (ఐస్ క్రీమ్) స్టాల్‌లోకి దూసుకెళ్లినట్లు వీడియో చూపిస్తుంది. వీడియో ప్రకారం, XUV300 యజమాని ఐస్ క్రీంను ఆర్డర్ చేశాడు. కానీ రుచి నచ్చలేదు. ఐస్‌క్రీమ్‌ స్టాల్‌ యజమాని డబ్బులు చెల్లించాలని కారు యజమానిని అడగడంతో కోపంతో తన కారును స్టాల్‌ని ఢీకొట్టాడు. ఈ ఘటన అంతా కెమెరాలో ఓ వ్యక్తి తెలియకుండా చిత్రీకరించాడు.

ఫిర్యాదు అందలేదు..
ఈ ఘటనపై తదుపరి ఎటువంటి అప్‌డేట్ రాలేదు. అలానే దీనిపై ఐస్‌క్రీం స్టాల్ యజమాని కూడా ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. కారు యజమానిపై కూడా పోలీసు చర్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. XUV300 స్టాల్‌లోకి దూసుకెళ్లినప్పుడు దానిలో ఎవరూ లేరని తెలుస్తోంది.

అయితే, చట్టాలను, ఇతరులను ప్రజలు ఏవిధంగా పట్టించుకోవడం లేదని ఇలాంటి ఘటనలు తెలియజేస్తున్నాయి. చాలా భిన్నమైన రీతిలో ఈ సంఘటన జరిగిన తీరు చూసిన వారందరికీ కచ్చితంగా కోపం రాకుండా ఉండదు. అంతలా ఆ వ్యక్తి ప్రవర్తించిన వింత తీరు అక్కడి వారిని విస్తుపోయేలా చేసింది. ఒక్క చిరునవ్వుతో పోయేదానికి ఇంత డ్రామా సృష్టించడం అతని స్థాయికే వదిలేయాలని పలువురు సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతున్నారు.

మహీంద్రా XUV

గతంలోనూ సంఘటనలు..
భారతీయ రోడ్లపై కార్ డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ఇతరులను ఢీకొట్టడం మనం చూడటం ఇదే మొదటిసారి కాదు. గతేడాది బెంగళూరులో మద్యం తాగిన ఐటీ నిపుణులు ఆగి ఉన్న పలు వాహనాలను ఢీకొట్టారు. తాము అడిగిన పాటలకు డీజే ప్లే కాకపోవడంతో ఐటీ నిపుణులు హంగామా ప్రారంభించారు.

ఇంకో సంఘటనలో పబ్ నుండి బహిష్కరించబడిన ఐదుగురు వ్యక్తులు టయోటా ఇన్నోవాలో ప్రయాణిస్తూ హంగామా సృష్టించారు. పబ్ నుండి బయటకు పంపబడినందుకు నిరాశ చెందిన వారు బాధతో, పబ్ వెలుపల ఉన్న సావిత్రు శెట్టి, రోషన్ అనే వ్యక్తులకు ఢీకొట్టారు. అలానే అక్కడే ఉన్న రెండు పార్క్ చేసిన కార్లను తమ కారుతో ఢీకొట్టి హల్ చల్ చేశారు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌తో ఓ బైకర్ ని ఢీకొట్టిన సంఘటన మీకు తెలిసే ఉంటుంది. ఉద్దేశ పూర్వకంగా చేసిన ఈ యాక్సిడెంట్ కొన్ని నెలల కింద సంచలనం రేపింది.ఈ ఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్‌ను ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు, స్కార్పియో వెనుక బంపర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది రైడర్ రోడ్డుపై పడిపోయాడు. దీంతో చిర్రెత్తిపోయిన డ్రైవర్ పదే పదే అతనిపై దాడి చేశాడు.

More from DriveSpark

Article Published On: Monday, April 3, 2023, 18:38 [IST]
English summary
Angry man rams car into ice cream stall video surfaces online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+