Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]
మీరు ఎప్పుడైనా ఒక పులి ఒక ఎస్‌యూవీని లాగటం ఎక్కడైనా చూసారా.. బహుశా చూసి ఉండకపోవచ్చు. కానీ ఇటీవల ఒక బెంగాల్ టైగర్ మహీంద్రా జిలో ఎస్‌యూవీని నోటితో లాగేసింది. దీనికి సమందించిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయింది. ఈ సంఘటన జరిగింది మరెక్కడో కాదు మన బెంగళూరులోని బన్నర్‌ఘట్ట నేషనల్ పార్క్‌లోనే.
![వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]](/img/2021/01/tiger-mahindra1-1611204381.jpg)
ఇక్కడ ఉన్న ఒకటిన్నర నిమిషాల వీడియోలో పులి ఎంత శక్తివంతమైనదో చూడవచ్చు. ఈ వీడియోలో, పులి తన నోటితో మహీంద్రా జిలో ఎస్యూవీ వెనుక భాగాన్ని కొరకడమే కాకుండా, అమాంతం వెనకకు లాగటం ఇక్కడ మీరు చూడవచ్చు.
![వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]](/img/2021/01/tiger-mahindra2-1611204388.jpg)
ఈ సంఘటన జరిగినప్పుడు మహీంద్రా జీలో ఎస్యూవీ లోపల ఆరుగురు పర్యాటకులు కూర్చున్నారు. మహీంద్రా జిలో ఎస్యూవీ బరువు దాదాపు 1,875 కిలోలు. ఇందులో కూర్చున్న పర్యాటకుల బరువుతో కలిపి దాదాపు 2 టన్నుల బరువు ఉంటుంది.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
![వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]](/img/2021/01/tiger-mahindra3-1611204396.jpg)
ఈ సంఘటన జరిగిన సమయంలో మహీంద్రా జిలో యొక్క బ్యాటరీ సమస్య కారణంగా కార్ స్టార్ట్ కాలేదు. ఈ కారణంగా పర్యాటకులు బయటకు దిగటానికి అవకాశం లేదు. కావున కారు లోపలే కూర్చుని ఉన్నారు. ఒక వేళా బయటకు దిగితే పులి వారిని చుట్టుముట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
![వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]](/img/2021/01/tiger-mahindra5-1611204410.jpg)
దీనికి సంబంధించి బన్నర్‌ఘట్ట నేషనల్ పార్క్ అధికారులు పిర్యాదు చేశారు. బ్యాటరీ సమస్య కారణంగా కారు ఆగిపోయిందని, డ్రైవర్ కారును ప్రారంభించలేకపోతున్నాడని చెప్పారు. ఆ సమయంలో కారు నిలబడి ఉన్న చోటికి పులి వచ్చింది.
MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
![వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]](/img/2021/01/tiger-mahindra6-1611204418.jpg)
వెంటనే బన్నర్‌ఘట్ట నేషనల్ పార్క్ భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఆ పులి అమాంతం కారు లాగుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు వైరల్ అయిన ఈ వీడియో దాదాపు 2 నెలల క్రితం జరిగిందని చెబుతున్నారు.
సాధారణంగా పులులు చాలా బలిష్టంగా ఉంటాయి. అందుకే మహీంద్రా జిలో వంటి పెద్ద వాహనాలను కూడా సులభంగా లాగగలవు. ఇక మహీంద్రా కంపెనీ యొక్క జిలో విషయానికొస్తే, ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు నిలిపివేయబడింది. బిఎస్ 6 ఉద్గార ప్రమాణాల కారణంగా మహీంద్రా జిలో మోడల్ నిలిపివేయబడింది.
MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..
![వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]](/img/2021/01/tiger-mahindra7-1611204425.jpg)
మహీంద్రా జిలో 2.2 లీటర్ ఎంహెచ్ఓ డీజిల్ ఇంజన్ మరియు 2.5 లీటర్ సిఆర్'డి డీజిల్ ఇంజన్ ఎంపికతో విక్రయించబడింది. మహీంద్రా ప్రస్తుతం కొత్త తరం స్కార్పియో మరియు ఎక్స్యువి 500 లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.