వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్న భర్త.. కోపమొచ్చిన భార్య ఇలా..
భార్య అయినా లేదా భర్త అయినా తమ భాగస్వామి ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే, వారికి చెప్పలేనంత కోపం వస్తుంది. ఈ కోపంలో కొందరు ఆలోచనారహిత నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకోవటం లేదా దాడికి పాల్పడం వంటివి చేస్తుంటారు. కానీ, ఈ మోడ్రన్ భార్య మాత్రం తన భర్త మోసానికి తగిన ప్రతీకారాన్ని ఈ విధంగా తీర్చుకుంది.
తనకు మాత్రమే స్వంతమైన భర్త పరాయి స్త్రీతో పడక పంచుకోవటం ఇష్టం లేని ఓ భార్య, తన భర్తకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆడి ఆర్8 లగ్జరీ స్పోర్ట్స్ కారును ఇనుప సామాన్ల వాడికి వేసుకుందుకు తప్ప, మరెందుకు పనికిరాని విధంగా పాడు చేసేసింది.

సోషల్ మీడియా ఛానెళ్లలో వెల్లెవెత్తుకున్న కథనాలు, ఫొటోల ప్రకారం, తన భర్త వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని, అది ఓర్వలేక ఇలా అతని కారును నాశనం చేశానని సదరు పోస్టులో పేర్కొని ఉంది. ఆడి ఆర్8 కారును బయట, లోపల పూర్తిగా ధ్వంసం చేసేసింది. బయటి అద్దాలు, లైట్లు, ఇంటీరియర్ డ్యాష్‌బోర్డును పగల గొట్టడమే కాకుండా, సీట్లను కూడా చించివేసింది.
అంతేకాకుండా.. ఆడి ఆర్8 కారుపై పదునైన ఆయుధంతో గీతలు పెట్టడం, అసభ్యకర పదజాలంతో భర్తను దూషించడం చేసింది. కాగా.. ఈ సంఘటనకు సంబంధించి పూర్వాపరాలు పూర్తిగా తెలియకపోయినప్పటికీ, భర్తకు తగిన శాస్తి చేసిందని ఆమెను కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి..?


Click it and Unblock the Notifications