Video Viral రోడ్డుమీద మహిళ చేసిన పనికి వాహనదారుడు షాక్.. !
భారత్‌లో రోడ్డు ప్రమాదాల రేటు అధికంగానే ఉంది. ఇందుకు వాహనదారులు, ప్రజలు కూడా కారణం. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ కొందరు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మరియు ప్రమాదాల బారిన పడుతున్నారు.
అయితే తాజాగా జరిగిన ఘటనలో ఓ వాహనదారునిపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత బైక్‌ను ధ్వంసం చేసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను భోపాల్ మోటో వ్లాగ్ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాహనదారునిపై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు.

మధ్యప్రదేశ్‌లోని ఓ రాష్ట్ర రహదారిపై KTM RC 390 బైక్‌పై ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఓ జంక్షన్ వద్ద మహిళ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. సదరు మహిళను చూసిన వాహనదారుడు ఆమెను ఢీకొట్టకుండా బైక్‌ను నియంత్రించాడు. అయితే వేగంగా వచ్చిన కేటీఎం బైక్ వల్ల తనకు త్రుటిలో ప్రమాదం తప్పిందని మహిళ ఆరోపించింది. రోడ్డుపై పశువులను తప్పించుకొని, దాటుతుండగా బైక్ తనను ఢీకొట్టబోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేటీఎం ఆర్‌సీ 390 బైక్ నడుపుతున్న వ్యక్తి మాత్రం.. తనదేం తప్పులేదని చెబుతున్నాడు. రోడ్డు దాటుతున్న సమయంలో సదరు మహిళే వెనుక వస్తున్న వాహనాలను గమనించలేదని, అయినా తాను మహిళను గమనించి వాహనాన్ని నియంత్రించినట్లు చెప్పాడు. బైక్ ఆమెను ఢీకొట్టలేదని, పరిస్థితిని గమనించి తానే వెనక్కి వచ్చానని చెబుతున్నాడు.

అయితే మహిళ మాత్రం కేటీఎం బైక్ యాజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా కోపంతో బైక్ సైడ్ ఫెయిరింగ్‌ను ధ్వంసం చేయడం ఈ వీడియోలో చూడవచ్చు, వీరిద్దరు గొడవ పడుతుండగా మరికొందరు అక్కడికి చేరారు. వారిలో కొందరు ఆమెకు మద్దతుగా మాట్లాడారు. దీంతో సదరు మహిళ మరింత బిగ్గరగా కేటీఎం బైక్ యాజమానిపై అరవడం మనం వీడియోలో గమనించవచ్చు.
అయితే ఈ సంఘటనలో పూర్తి స్పష్టత లేకుండా ఎవరిది తప్పని నిర్ధారించడం సాధ్యం కాదు. వాహనదారునిపై తొలుత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. అనంతరం బైక్‌ను ధ్వంసం చేసింది. ఇది మాత్రం నేరం. కోపాన్ని నియంత్రించుకోలేక బైక్‌ను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రజలు రోడ్డు దాటుతున్న సమయంలో లేదా జంక్షన్ల వద్ద వాహన వేగాన్ని తగ్గించి నడపడం అలవాటు చేసుకోవాలి. ఎటునుంచైనా అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు ఎవరు ప్రయత్నించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా రోడ్డు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న వాహనాలను గమనించాలి. అప్పుడే ప్రమాదాల బారిన పడకుండా ఉండగలుగుతారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








