ముఖేష్ అంబానీలా కాదు: విభిన్నమైన అనిల్ అంబానీ కార్ కలెక్షన్

Written By:

ధీరూబాయ్ అంబానీ శకం అనంతరం అంబానీ కుటుంబానికి చెందిన చాలా సంస్థలు ఇప్పుడు ముఖేష్ మరియు అనిల్ చేతుల్లో ఉన్నాయి. అనిల్ అంబానీ హడావిడిగా కాకుండా చాలా వరకు సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతాడు. కార్ల విషయంలో తన అన్న ముఖేష అంబానీ రీతిలో కాకుండా చాలా తక్కువ సంఖ్యలోనే కార్లను కలిగి ఉన్నాడు.

బిలియనీర్ల జాబితాల్లో ఉన్న అనిల్ అంబానీ గ్యారేజీలో ఉన్న కార్ల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి....

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ డబ్ల్యూ221

ఒకసారి రిలయన్స్ వార్షిక సమావేశం అనంతరం అనిల్ అంబానీ తన భార్యతో విందుకు వెళుతున్న సందర్భంలో సేకరించిన ఫోటో ఇంది. ఇద్దరు అంబానీ సోదరులకు ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ అంటే అమితమైన ఇష్టం. ఒకానొక కాలంలో భారత దేశపు బిలియనీర్లు దీనిని ఎక్కువగానే ఎంచుకునే వారు. అయితే ఇప్పుడు అవాంఛిత ఆకృతిలో ఉండటం వలన ఎస్-క్రాస్ డబ్ల్యూ 221 ను ఎంచుకోవడం లేదు.
Picture credit: IndiaTimes

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లోని డబ్ల్యూ221 మోడల్ ను 2005 నుండి 2013 మధ్య మాత్రమే నిర్మించింది. అయితే ప్రస్తుతం ఎస్-క్రాస్ లోని డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.17 కోట్లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

రేంజ్ రోవర్ వోగ్

ల్యాండర్ రోవర్ సంస్థకు చెందిన రేంజ్ రోవర్ వోగ్ అనిల్ అంబానీ కార్ల జాబితాలో ఉంది. డబ్బుకు తగిన విలువలతో విలాసవంతమైన, భద్రత పరమైన మరియు సాంకేతికంగా రేంజ్ రోవర్ ఉత్పత్తుల ఎంపిక ఉంటోంది. అందులో ఒకటి రేంజ్ రోవర్ "వోగ్" అనిల్ అంబానీ గ్యారేజీలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బెంట్లీ బెంట్యాగా, ల్యాంబోర్గిని ఉరస్, రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి అల్ట్రా లగ్జరీ కార్ల ఉన్నప్పటికీ రేంజ్ రోవర్ భారీ అమ్మకాలను చేపట్టింది ఈ మోడల్‌తోనే.
Picture credit: AssociatedPress

సాంకేతికంగా రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యువిలో 3.0-లీటర్ సామర్థ్యం గల 24వి టిడివ వి6 డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 244.6బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. రేంజ్ రోవర్ వోగ్ ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2,18,00,000 లుగా ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్

అత్యంత ధనికుల కార్ల గ్యారేజీలలో మాత్రమే ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును గుర్తించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల వద్ద మాత్రమే ఇది ఉంది. లగ్జరీకి పేరు గాంచిన రోల్స్ రాయిస్ సంస్థకు చెందిన ఫాంటమ్ కారు ఇప్పుడు అనిల్ అంబానీ కార్ల గ్యారేజీలో ఉంది.
Picture credit: TheHinduBusinesLine

రోల్స్ రాయిస్ ఫాంటమ్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి, వీటి ధరలు రూ. 7.55 మరియు రూ. 8.83 కోట్లు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి. సాంకేతికంగా ఇందులో 6749సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇది లీటర్‌కు 6.71 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

టయోటా ఫార్చ్యూనర్

అనిల్ అంబానీకి నిత్య జీవితంలో రన్నింగ్ తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని కోట్ల రుపాయలకు అధిపతి, ఎన్నో కంపెనీలను చూసుకోవాల్సిన ఇతనికి రన్నింగ్ ఎలా సాధ్యం అనేది మాకు తెలియదు, అయితే ఎంతటి గొప్ప వ్యక్తయినా కూడా అన్నింటికి కాస్త సమయాన్ని కేటాయించుకోవాలనే ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. తరచూ వ్యాయమానికి వెళ్లినపుడు విశాలమైన ఇంటీరియర్ స్పేస్ గల ఫార్చ్యూనర్‌ను తీసుకెళ్తాడు.
Picture credit: IndiaToday

టయోటా ఈ మధ్యనే నెక్ట్స్ జనరేషన్ ఫార్చ్యూనర్ ను ఈ మధ్యనే విడుదల చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే ఇది, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో వచ్చింది. టయోటా ఫార్చ్యూనర్ డీజల్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 31.12 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

ల్యాంబోర్గిని గల్లార్డో

యువత ఎక్కువగా ఇలాంటి కార్ల ఖరీదైన స్పోర్టివ్ సూపర్ కార్లను ఎంచుకుంటారు. అనిల్ అంబానీ ముంబాయ్ రహదారుల మీద తరచుగా ఈ కారులో చక్కర్లు కొడుతుంటాడు. అయితే ఇప్పుడు ల్యాంబోర్గిని దేశీయంగా ఈ గల్లార్డో స్థానంలో హురకాన్ కారును ప్రవేశపెట్టింది.

ల్యాంబోర్గిని ఈ గల్లార్డో సూపర్ కారును 2005 నుండి 2014 మధ్య మాత్రమే అందుబాటులో ఉంచింది. అప్పట్లో దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 3 కోట్ల వరకు ఉండేది. ఇందులో 5204 సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 550బిహెచ్‌పి పవర్ మరియు 540ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

అనిల్ అంబానీ ఎంచుకున్న కార్ల జాబితాను గమనిస్తే ఉగాది పచ్చడిలో రకరకాల రుచులు ఉన్నట్లు విభిన్న కార్లను ఎంచుకున్నారు. అయితే ఇతని వద్ద పరిమిత సంఖ్యలోనే ఉండటం మరో ప్రత్యేకం.

English summary
Anil Ambani Car Collection
Please Wait while comments are loading...

Latest Photos