Anil Ambani సాధారణ కారులో ప్రయాణించిన అనిల్‌ అంబానీ.. నెటిజన్ల కామెంట్లు వైరల్‌

ఒకప్పుడు భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలలో అనిల్‌ అంబానీ(Anil Ambani) ఒకరు. విలాసవంతమైన జీవితం, లగ్జరీ కార్లలో తిరిగే వారు. కానీ వ్యాపారంలో నష్టాల కారణంగా అనిల్‌ అంబానీ దివాలా తీశారు. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీకి సంబంధించిన వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

అనిల్ అంబానీ ముంబయిలో ఇటీవల సాధారణ కారులో బయటకు వచ్చిన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త సాధారణ కారులో బయటకు రావడంతో.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా అనిల్ అంబానీ ప్రయాణించిన కారు హ్యుందాయ్ ఐయోనిక్ 5(Hyundai Ioniq 5). భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటి.

Anil-Ambani-In-Hyundai-Ioniq-5

అయితే మధ్యతరగతి ప్రజల విషయానికొస్తే మాత్రం హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఖరీదైనదే.. ఎందుకంటే భారత మార్కెట్లో ఈ కారు ధర రూ. 45.95 లక్షలు(ఎక్స్-షోరూమ్). కానీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ధనవంతుల విషయంలో ఇది సాధారణ కారు. ఈ క్రమంలో హ్యుందాయ్‌ ఐయోనిక్‌ 5 అనిల్ అంబానీ(Anil Ambani in Hyundai Ioniq 5)కి మామూలు కారనే చెప్పవచ్చు.

ఎందుకంటే రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘినీ గల్లార్డో వంటి ఖరీదైన కార్లలో అనిల్ అంబానీ ప్రయాణించేవారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో చూశాం. ఇవి మాత్రమే కాదు, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వంటి లగ్జరీ కార్లలో అనిల్‌ అంబానీ ప్రయాణించారు.

Anil-Ambani-In-Hyundai-Ioniq-5

ఈ క్రమంలో ఇదిలా ఉండగా హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారులో అనిల్‌ అంబానీ ప్రయాణించడంపై పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ అంబానీ(Anil Ambani Luxury Cars) లగ్జరీ రోల్స్ రాయిస్ కారు నుంచి హ్యుందాయ్ కారులోకి రావాల్సి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్లు రేంజ్‌ను ఇస్తుంది. ఇది నిజంగా అద్భుతమైన రేంజ్‌ అనే చెప్పవచ్చు.

Anil-Ambani-In-Hyundai-Ioniq-5

ఫీచర్ల పరంగానూ హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారులో అధునాతన ఫీచర్లును చూడవచ్చు. 12.3 అంగుళాల పరిమాణంలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి. ఇది కాకుండా, హెడ్స్ అప్ డిస్‌ప్లే మరియు అటాస్ వంటి సౌకర్యాలను ఈ ఎలక్ట్రిక్ కారులో అందించారు.

అనిల్‌ అంబానీ హ్యుందాయ్‌ ఐయోనిక్‌ 5 ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తున్న సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఈ వీడియో కెమెరాలకు చిక్కింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నుంచి తిరిగి వస్తుండగా హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారులో అనిల్ అంబానీ కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు.

Anil-Ambani-In-Hyundai-Ioniq-5

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 2, 2024, 16:03 [IST]
English summary
Anil ambani spotted in hyundai ioniq 5 electric car video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+