భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

ప్రముఖ లగ్జరీ కార్ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యొక్క వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగా ఎక్కువమంది విలాసవంతమైన మరియు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి ఈ బ్రాండ్ వాహనాలను ఎంపిక చేసుకుంటారు. చాలా మంది సెలబ్రెటీలు, పారిశ్రామికవేత్తలు మొదలైనవారు ఇటువంటి కార్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కాదు తమకు నచ్చినవారికి ఈ ఖరీదైన కార్లను గిఫ్ట్ గా కూడా ఇస్తుంటారు.

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన చాలా సంఘటనలు గురించే ఇదివరకే మునుపటి కథనాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ తన భార్య సునీత కపూర్ కి బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్‌ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనివిలువ అక్షరాలా కోటి రూపాయలు.

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

ఈ కొత్త కారు ఇటీవల అనిల్ కపూర్ యొక్క ఇంటి పార్కింగ్ స్థలంలో కనిపించింది. అంతే కాకుండా అతను తన ఇన్‌స్టాగ్రామ్ లో కూడా తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసాడు.

MOST READ:మీకు తెలుసా.. మారుతి సుజుకి బాలెనోతో 22 గంటల్లో 1,850 కిమీ ప్రయాణం.. కొత్త రికార్డ్ కైవసం

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ గత ఏడాది భారతదేశంలో కొత్త జిఎల్‌ఎస్‌ను విడుదల చేసింది. ఈ కారు బేస్ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99.90 లక్షలు. మెర్సిడెస్ బెంజ్ 2013 నుండి భారతదేశంలో జిఎల్‌ఎస్‌ను విక్రయిస్తోంది. ఈ కారును సిబియు మార్గం ద్వారా మనదేశంలోకి దిగుమతిచేసుకుంటున్నారు.

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ దాని పాత వెర్షన్ కంటే 77 మిమీ పొడవు మరియు 22 మిమీ వెడల్పుతో ఉంటుంది. ఇది 60 మిమీ పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ కారులో ఎల్‌ఈడీ లైటింగ్ ఉపయోగించబడింది. ఇది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ, ఇది చాలా సౌకర్యవంతమైన క్యాబిన్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్‌తో ఉన్న మాడిఫైడ్ హ్యుందాయ్ క్రెటా; వివరాలు

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 5 లెవెల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఫుల్లీ ఆటొమ్యాటిక్ అడ్జస్టబుల్ సీటు మరియు MBUX OS తో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

కొత్త మెర్సిడెస్ జిఎల్‌ఎస్‌ 2.9 లీటర్, 6 సిలిండర్ డీజిల్ ఇంజన్ మరియు 3.0 లీటర్, 6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ మునుపటి కంటే మెరుగైన బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ప్రవేశపెట్టబడింది.

MOST READ:కాలువలో చిక్కుకున్న నౌక; వణికిపోతున్న ప్రపంచ దేశాలు; ధరలు పెరిగే ప్రమాదం!

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

ఇందులో ఉన్న డీజిల్ ఇంజిన్ 330 బిహెచ్‌పి మరియు 700 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, అదే సమయంలో దాని పెట్రోల్ ఇంజన్ 367 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 9 స్పీడ్ 9 జి-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ వాహనం మరియు 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఆప్సన్ కూడా కలిగి ఉంది.

భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7, ఆడి క్యూ 8, లెక్సస్ ఎల్‌ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. బెంజ్ కంపెనీ ఇప్పుడు ఈ 7 సీట్ల ఎస్‌యూవీని మునుపటి కంటే ఆకర్షణీయంగా, శక్తివంతంగా మరియు స్టైలిష్‌గా చేసింది. ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

MOST READ:ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

Most Read Articles

English summary
Anil Kapoor gifts his wife new Mercedes-Benz GLS suv on her birthday price Rs 1 crore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X