Animal సినిమా నటి త్రిప్తి డిమ్రీ ఏ కారును వినియోగిస్తున్నారో తెలుసా?
గతం వారం దేశవ్యాప్తంగా విడుదల అయిన బాలీవుడ్ సినిమా యూనిమల్‌కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి త్రిప్తి డిప్రీ (Actress Tripti dimri) మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నటి కార్ల కలెక్షన్ వివరాలు మీకోసం.
నటి త్రిప్తి డిమ్రీకి చెందిన అనేక వీడియోలు వైరల్ అవుతుండగా.. ఎక్కువగా రెనాల్ట్ డస్టర్ SUV (Renault Duster SUV)లో ప్రయాణం చేస్తూ కనిపించారు. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా తెలుస్తోంది. మరియు అవుట్‌బ్యాక్ బ్రాంజ్ రంగుల్లో ఉంది. ఇదే రంగు పగటి పూట గ్రీన్ రంగులో కనిపిస్తుంది. ఈ రంగు వాహనానికి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.

కంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో రెనాల్ట్ డస్టర్ SUV ప్రముఖ వాహనంగా ఉంది. అయితే ఈ వాహనాల విక్రయాలను 2022 నుంచి భారత మార్కెట్‌లో నిలిపివేసింది. విక్రయాలకు అందుబాటులో ఉన్న సమయంలో ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. నిలిపేసేందుకు ముందు ఈ ఇంజిన్ BS6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయబడింది.
అయితే నటి త్రిప్తి డిమ్రీ రెనాల్ట్ డస్టర్ SUV ఏ వేరియంట్‌ను కలిగి ఉన్నారో తెలియలేదు. ఇతర నటీనటుల మాదిరిగా త్రిప్తి డిమ్రీ కూడా లగ్జరీ సెడాన్ లేదా SUVకి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
రెనాల్ట్ డస్టర్ SUV రైడింగ్ నాణ్యత కారణంగా ఎక్కువ మంది ఈ వాహనాన్ని ఇష్టపడుతున్నారు.
డస్టర్ నెక్ట్స్ జనరేషన్ SUVని త్వరలో భారత్ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు రెనాల్ట్ ఇప్పటికే ప్రకటన చేసింది. 2025 సంవత్సరం రెండో భాగంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్ డస్టర్ Y ఆకారంలోని LED DRLను కలిగి ఉంటుంది.
18 అంగుళాల అల్లాయ్ వీల్స్ : డస్టర్ ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్ మరియు ఎయిర్ వెంట్‌లను కలిగి ఉంది. రెనాల్ట్ డస్టర్ కంపాక్ట్ SUV 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. అదే తక్కువ ధర వేరియంట్ 17 అంగుళాల యూనిట్‌ను పొందుతుంది.
నెక్స్ జనరేషన్ డస్టర్ 7 అంగుళాల పుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ బటన్లు సహా మరిన్ని కీలక ఫీచర్లను కలిగి ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ADAS ఫీచర్ భారత్‌లో అందుబాటులో ఉండే వాహనంలో ఉంటుందా లేదా అనే తెలియలేదు.
ఇంటర్నేషనల్ రెనాల్ట్ డస్టర్‌తో మూడు ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తుంది. 1.6 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో వస్తుంది. మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. 48v మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 130ps శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజిన్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. కొన్ని మార్కెట్‌లలో పెట్రోల్ LPG/CNG వేరియంట్‌తో అందించబడుతుంది.


Click it and Unblock the Notifications








