సెకండ్ హ్యాండ్ రేంజ్ రోవర్ కారులో తళుక్కుమన్న ‘యానిమల్' బ్యూటీ.. వైరల్ వీడియో
యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయి నేషనల్ క్రష్‌గా మారిపోయింది బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Animal Tripti Dimri). రణ్‌బీర్ కూపర్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
యానిమల్ సినిమాలో నటించడానికి ముందు త్రిప్తి డిమ్రీ ఎవరో కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ చిత్రంతో ఓవర్ నైట్ నేషనల్ క్రష్‌గా యూత్ గుండెల్లో నిలిచిపోయింది. పాత్ర చిన్నదే అయినప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో త్రిప్తి లగ్జరీ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌లో ప్రయాణించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

లగ్జరీ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్(Range Rover Tripti Dimri).. భారత్‌లో చాలా ప్రజాదరణ పొందిన SUVగా ఉంది. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలు, వీఐపీల కార్ల గ్యారేజ్‌లో రేంజ్ రోవర్ స్పోర్ట్ SUVని చూడవచ్చు. భారత మార్కెట్లో రేంజ్ రోవర్ స్పోర్ట్ బేస్ ధర రూ.1.69 కోట్లుగా ఉంది. కాగా దీని టాప్ వేరియంట్ ధర రూ. 2.80 కోట్లు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
కాగా రేంజ్ రోవర్ ఆన్-రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక త్రిప్తి తన కారును పార్క్ చేసిన బిల్డింగ్ సెల్లార్‌లో.. రెండు రేంజ్ రోవర్ స్పోర్ట్ SUVలను మీరు చూడవచ్చు. కాగా మొదటి రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీని ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు. కారణం ఇందులో త్రిప్తి డిమ్రీ ఉంది. అయితే యూజ్డ్ కారుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఈ రేంజ్ రోవర్ పాపులర్ బ్రిటీష్ SUV యొక్క మునుపటి తరానికి చెందినదిగా అర్థమవుతోంది. ఇది గ్రే లెదర్ అప్హోల్స్టరీతో డిజైన్ చేయబడినట్లుగా తెలుస్తోంది. కాగా త్రిప్తి డిమ్రీ గతంలో రెనాల్ట్ డస్టర్‌ను ఉపయోగించేవారు. ఆమె తన రెనాల్ట్ డస్టర్(Renault Duster) కారులో బయటకు వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.
త్రిప్తి డిమ్రీ ఉపయోగిస్తున్న రేంజ్ రోవర్ స్పోర్ట్(Tripti Dimri Range Rover) మోడల్ 2018 లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలైంది. ఇందులో కంపెనీ కొత్త మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్స్ మరియు కొత్త బోనెట్ డిజైన్‌లతో రివైజ్డ్ ఫ్రంట్-ఎండ్ స్టైలింగ్‌తో రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను తీసుకువచ్చింది.

ఇంటీరియర్ విషయానికొస్తే.. రేంజ్ రోవర్ SUV లో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆప్షన్ హెడ్స్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది ఆప్షనల్ ఎగ్జిక్యూటివ్-క్లాస్ సీటింగ్, సిగ్నల్-కంట్రోల్ సన్-బ్లైండ్‌లు, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు మెరిడియన్ స్టీరియోతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇక పవర్‌ట్రెయిన్ ఎంపికల విషయానికొస్తే, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు స్టాండర్డ్ రేంజ్ రోవర్ వెర్షన్‌లు నాలుగు ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నాయి. కాగా ఎంట్రీ-లెవెల్ డీజిల్ ఇంజిన్ 3.0-లీటర్, V6 యూనిట్ తో పనిచేస్తుంది. 255 BHP మరియు 600 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరోవైపు రేంజ్ రోవర్ టాప్-ఎండ్ డీజిల్ 4.4-లీటర్, V8 యూనిట్ ను కలిగి ఉంది. 335 BHP మరియు 740 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ 335 BHP మరియు 450 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్, సూపర్ ఛార్జ్‌డ్ V6 ఇంజిన్‌తో పనిచేస్తుంది.
రేంజ్ రోవర్‌లో హై పర్ఫామెన్స్‌తో ఉన్న టాప్-ఎండ్ వేరియంట్‌లు 5.0-లీటర్, సూపర్ఛార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 518 BHP మరియు 625 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని అన్ని ఇంజిన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు, ఫోర్-వీల్ డ్రైవ్ మరియు 7 డ్రైవింగ్ మోడ్‌లతో వస్తాయి.
రేంజ్ రోవర్ స్పోర్ట్ కారుతో పోలిస్తే, రెనాల్ట్ డస్టర్ చాలా సాధారణమైనది. కానీ రెనాల్ట్ డస్టర్ కారు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేదు. వివిధ కారణాల వల్ల దీని విక్రయాలు నిలిపివేశారు. అయితే, రెనాల్ట్ త్వరలో కొత్త తరం డస్టర్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది ఒకప్పుడు బాగా పాపులర్ అయిన కారు కావడంతో.. కొత్త తరం రెనాల్ట్ డస్టర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








