Video Viral ఢిల్లీ మెట్రో మరో వీడియో వైరల్.. ఈసారి ఇద్దరు మహిళలు..!!
వివిధ రకాల వీడియోలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఢిల్లీ మెట్రో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. గతంలో ఢిల్లీ మెట్రోలో డ్యాన్సులు, అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సహా ఇటీవల ఓ జంట మెట్రో కోచ్‌ను బెడ్ రూంగా మార్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇద్దరు మహిళలు మెట్రో కోచ్‌ను యుద్ధ క్షేత్రంగా మార్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం మెట్రో కోచ్‌లలో పోలీసులను మోహరించింది. రెండు, మూడు రోజులపాటు పోలీసులకు కేటాయించి తర్వాత ఆపేసింది. దీంతో మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.

తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు కొంతసేపు హల్‌చల్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా తగాదా పెట్టుకున్నారు. కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. అయితే వారిద్దరు ఎందుకు గొడవ పడ్డారనే దానికి స్పష్టమైన కారణం తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇద్దరు మహిళలు తొలుత తమ సీట్ల వద్ద ఉన్నారు. అనంతరం ఏమైందో ఏమో అసభ్యకరమైన మాటలతో తిట్టుకున్నారు. వీరిలో ఓ మహిళ తన కాలి చెప్పు తీసుకొని మరో ప్రయాణికురాలిని బెదిరించడం ఈ వీడియోలో గమనించవచ్చు. అందుకు స్పందనగా మరో మహిళ తన వాటర్ బాటిల్‌ను చూపుతుంది. ఇంతలో అక్కడున్న మిగిలిన ప్రయాణికులు జోక్యం చేసుకొని గొడవ సర్దుమణిగేలా చేశారు.
కానీ గొడవ అక్కడితో ఆగలేదు. ఓ మహిళ మెట్రోలో ఉన్న ఫోన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయడం మనం గమనించవచ్చు. గొడవ మరింత పెద్దది కాకుండా అధికారులు జోక్యం చేసుకోవాలని కోరినట్లు వీడియోలో మనకు వినిపిస్తుంది. దీనిని గుర్తించిన మరో మహిళ.. అసభ్యంగా మాట్లాడడం గమనించవచ్చు. దీంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులకు ఫిర్యాదుచేసిన మహిళ తమ వాటర్ బాటిల్.. తీసుకొని అవతలి మహిళపై నీరు చల్లడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. అయితే తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 'మసాలా మూవీ' అని ఓ యూజర్ కామెంట్ చేశారు. 'తాను వెళ్లినప్పుడు ఇలాంటి ఘటనలు జరగవు' అంటూ మరొకరు కామెంట్ చేశారు. 'ఈ వీడియోకు ఎవరైనా తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించాలని' ఓ యూజర్ కోరారు.
ఇటువంటి ఘటనలు పెరిగితే ప్రజలు మెట్రోలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపించకపోవచ్చు. ప్రభుత్వం ఇకనైనా సరైన చర్యలు తీసుకోకుంటే ప్రయాణికులకు మరిన్ని అవస్థలు తప్పవు. ప్రజలు మళ్లీ సొంత వాహనాల వినియోగిస్తే ఢిల్లీ కూడా అధిక ట్రాఫిక్ సమస్యలతో సతమతం కాక తప్పదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








