Just In
- 9 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 10 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 14 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 17 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైదరాబాద్‌లో భగ్గుమన్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడర్ సేఫ్, పూర్తిగా కాలిపోయిన ప్యూర్ ఈవీ స్కూటర్
మండుతున్న ఎండలో లేక లిథియం అయాన్ బ్యాటరీల విషయంలో ఆటోమొబైల్ కంపెనీలు వహిస్తున్న నిర్లక్ష్యమో తెలియదు కానీ, దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్‌లో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలి బూడిదైంది. ఈసారి కూడా ప్యూర్ ఈవీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ (Pure Epluto 7G) లోనే మంటలు చెలరేగడం గమనార్హం. కాగా, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం.

గత నెలలో నిజామాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ఓ ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఇంటి లోపల ఉంచి చార్జ్ చేస్తుండగా, అది పేలి ఓ వ్యక్తి మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. తాజాగా, ఇప్పుడు హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్ కు సమీపంలో ప్యూర్ ఈవీ ఇప్లూటో 7జి ఎలక్ట్రిక్ స్కూటర్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై దాని యజమాని మరియు అతనిస్నేహితుడు కలిసి ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా స్కూటర్ ఆగిపోయిందని, తనిఖీ చేయడానికి, అతను బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌ను తెరిచి చూస్తే, దాని నుండి పొగ రావడం గమనించానని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయని, ఈ ఘటనపై తాము సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇది నాల్గవ ప్యూర్ ఈవీ అగ్ని ప్రమాదం..
ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలో నిజామాబాద్ మరియు అంతకు ముందు నెలలో చెన్నై నగరాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పటి వరకూ ఇలాంటివి దాదాపు నాలుగు ఘటనలు నమోదయ్యాయి. వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో, ప్యూర్ ఈవీ (Pure EV) విక్రయించిన ETrance Plus మరియు EPluto 7G మోడల్‌లకు చెందిన 2,000 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ఏప్రిల్ నెలలో ప్రకటించింది. రీకాల్ చేసిన స్కూటర్లలో బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ వ్యవస్థను కంపెనీ ఉచితంగా తనిఖీ చేసి, లోపాలు ఏవైనా గుర్తిస్తే సరిచేయనుంది.

ఈ విషయంలో ప్యూర్ ఈవీ ప్రకటన ప్రకారం, తమ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీలు యొక్క ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయబడతాయని, ఏదైనా అసమతుల్యత సమస్యల కోసం తాను బ్యాటరీని తనిఖీ చేస్తామని మరియు తమ BaTRics Faraday (లిథియం అయాన్ బ్యాటరీలలోని లోపాలను స్వయంచాలకంగా గుర్తించి మరియు సరిచేయగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హార్డ్‌వేర్) పరికరం ద్వారా వాటిని సరిచేస్తామని ప్యూర్ తమ ప్రకటనలో తెలిపింది. వీటికి అదనంగా BMS మరియు ఛార్జర్ క్యాలిబ్రేషన్ కూడా అవసరమైన విధంగా నిర్వహించబడతాయని ప్యూర్ ఈవీ పేర్కొంది.

ప్యూర్ ఈవీ ప్రోడక్ట్ లైనప్..
భారతదేశంలో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై, ఇప్పుడు మేజర్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీగా మారిన ప్యూర్ ఈవీ, తమ ప్రోడక్ట్ లైనప్ లో ఇప్లూటో, ఇప్లూటో 7జి, ఇట్రాన్స్ నియో మరియు ఇట్రాన్స్ ప్లస్ అనే నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. తాజాగా, అగ్ని ప్రమాదానికి గురైన ప్యూర్ ఇప్లూటో 7జి ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5 కిలోవాట్అవర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 90-120 కిమీ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇది గరిష్టంగా గంటకు 60 కిమీ వేగంతో పరులుగు తీస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.88,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

వరుస ఈవీ అగ్ని ప్రమాదాలపై కేంద్రం సీరియర్, విచారణ కమిటీ ఏర్పాటు..
వరుస ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అగ్నిప్రమాదాల నేపథ్యంలో, కేంద్రం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. ఎలక్ట్రిక్ టూవీరల్లలో మంటలు వ్యాపించడానికి గల కారణాలను పరిశోధించి, దానిపై తక్షణమే ఓ నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఏ కంపెనీ అయినా సరే తగిన నాణ్యత ప్రమాణాలను పాటించకుండా, నిర్లక్ష్యం వహిస్తే సదరు కంపెనీపై భారీ జరిమానాలు విధించడంతో పాటుగా ఆ బ్యాచ్ వాహనాలన్నింటినీ రీకాల్ చేయిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇంపోర్టెడ్ బ్యాటరీలు భారత వాతవరణానికి సెట్ కావు..
భారతదేశంలో విక్రయించబడుతున్న దాదాపు అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఉపయోగించే బ్యాటరీలను లేదా సెల్స్‌ను సదరు ఆటోమొబైల్ కంపెనీలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఇలాంటి ఇంపోర్టెడ్ బ్యాటరీలు భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండవని, ఇవన్నీ ఆయా దేశాల ఉష్ణోగ్రతల ప్రకారం తయారు చేయబడి ఉంటాయని నీతి ఆయోగ్ సభ్యుడు మరియు సీనియర్ సైంటిస్ట్ వి కె సరస్వత్ అన్నారు. ఆయన ప్రకారం, దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్స్ వలనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీ సెల్స్ వస్తున్నాయ్..
ఇప్పటి వరకూ మనదేశంలో లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్‌ని (ప్రత్యేకించి ఈవీల కోసం) మెయిన్ స్ట్రీమ్‌లో తయారు చేసే కంపెనీలు రాలేదు. ఈ నేపథ్యంలో, తాజాగా మన దేశంలోనే బ్యాటరీ సెల్స్ ని స్వయంగా తయారు చేసేందుకు లాగ్9 మెటీరియల్స్ అనే కంపెనీ తమ మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని కర్ణాటకలో ప్రారంభించింది. ఈ బ్రాండ్ త్వరలో భారీ సంఖ్యలో బ్యాటరీ సెల్స్ ను ఉత్పత్తి చేయనుంది. ఈ బ్యాటరీ సెల్ భారతీయ పరిస్థితులలో అభివృద్ధి చేయబడుతున్న నేపథ్యంలో, ఇవి ఇంపోర్టెడ్ బ్యాటరీలకు మంచి ప్రత్యామ్నాయం కావచ్చని భావిస్తున్నారు.