ADAS Misuse - టెక్నాలజీ ఉంది కదా అని మరీ ఇంత నిర్లక్ష్యమా!.. వీడియో వైరల్

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'ఏడీఏఎస్' (ADAS) అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఈ టెక్నాలజీని మిస్ యూస్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.. అయినప్పటికీ ఇలాంటి మరో సంఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో మీరు గమనించినట్లయితే రాత్రి సమయంలో హైవే మీద ప్రయాణిస్తున్న మహీంద్రా ఎక్స్​యూవీ700 డ్రైవర్ లేకుండానే ముందుకు వెల్తూ ఉండటం చూడవచ్చు. కారు మధ్య వరుస సీటులో ఒక వ్యక్తి మాత్రమే హాయిగా నిద్రపోతున్నాడు. ఈ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి కారు ADAS ద్వారా నడుస్తోందని చూపించడం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది.

Mahindra XUV700 ADAS Misuse

నిజానికి ఒక వాహనంలో సేఫ్టీ ఫీచర్స్ అందించారు అంటే.. దాని అర్థం అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కాపాడటం. అయితే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి కదా అని వాటిని దుర్వినియోగం చేస్తే ప్రమాదాన్ని స్వయంగా ఆహ్వానించిన వాళ్ళు అవుతారు. కారులో ఉన్న అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు లేన్ కీప్ ఆసీస్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల XUV700 డ్రైవర్ ప్రమేయం లేకుండా తానుగా ముందుకు వెళుతుంది.

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ ఆసీస్ ఉపయోగించినప్పటికీ అత్యవసర సమయంలో కారును తప్పకుండా కంట్రోల్ చేయాలి, లేకుండా కారు తనకు తానుగా ఆగిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఊహకందని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో కారులోని ప్రయాణికుల ప్రాణాలే పోయే అవకాశం ఉంది. కాబట్టి కారును డ్రైవ్ చేసే వ్యక్తికి కారులో ఎన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ నిర్లక్ష్యం మాత్రం తగదని నిపుణులు సూచిస్తున్నారు.

Mahindra XUV700 ADAS Misuse

వాహనాల్లోని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్‌ను ఎవరైన దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే.. వారిపైన బాధ్యతారాహిత్య నేరం కింద తప్పకుండా కఠినంగా శిక్షించాలి, తగిన చర్యలు తీసుకోవాలి. లేకుండా రీల్స్ కోసం.. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవి వారికి మాత్రమే కాకుండా రోడ్డుపైన ప్రయాణించే ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది.

ADAS ఫీచర్లను ప్రభుత్వం నిషేదించాలా?

నిజానికి కొంతమంది చేస్తున్న ADAS దుర్వినియోగం చాలా తప్పు, కాబట్టి సంబంధిత శాఖలు వారిపైన చర్యలు తీసుకుని మళ్ళీ అలంటి తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో ఏడీఏఎస్ ఫీచర్స్ తొలగించడం సమంజసమైన చర్య కాదు. ఏడీఏఎస్ అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి, దుర్వినియోగం చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయనేది వెల్లడించాలి.

మహీంద్రా కంపెనీ తన XUV700లో ADAS ఫీచర్ ప్రవేశపెట్టిన తరువాత, చాలా సంస్థలు తమ ఉత్పత్తుల్లో ఏడీఏఎస్ ఫీచర్ ప్రవేశపెట్టాయి. ఈ ఫీచర్స్ వల్ల చాలామంది ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ సంఘటనలు ఇదివరకే చాలా తెలుసుకున్నాం. కాబట్టి ప్రస్తుత కాలంలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ అవసరం చాలా ఉంది. దీనిని తొలగించాలనే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వానికి గానీ, కంపెనీలకు గానీ లేదనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, March 4, 2024, 10:04 [IST]
English summary
Another mahindra xuv700 adas misuse video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+