పెట్రోల్‌ బంకులో కొత్త రూల్‌.. మీ బండి మొత్తం స్కాన్‌ చేసిన తర్వాతే ట్యాంక్‌ ఫిల్‌ చేస్తారు!

దేశవ్యాప్తంగా పాతబడిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నుంచి అధికంగా కాలుష్య కారకాలు వెలుడుతున్నాయి. దీంతో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. క్రమంగా గాలి నాణ్యత తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలతో నడిచే పాత వాహనాల నుంచి విడుదలయ్యే ధూళి, కార్బన్ ఉద్గారాలు అక్కడి గాలిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. దీంతో ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీని ప్రభావానికి లోనవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిణామాలు ఉన్నప్పటికి ఢిల్లీ వంటి నగరాల్లో ఇది మరింత దారుణంగా మారింది. అక్కడ వాయు కాలుష్యం అతి ప్రమాదకరమైన స్థాయికి చేరుకుని, ఆ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ నేపథ్యంలో, అక్కడి ప్రభుత్వం పాత వాహనాలను దశలవారీగా తొలగించేందుకు బలమైన చర్యలు తీసుకుంటోంది. గతంలో కాలం చెల్లిన పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలతో నడిచే పాల వాహనాలను నగరంలో బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వాటికి పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం నింపకుండా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే కొంత మంది పోలీసుల దృష్టికి తీసుకురాకుండా తమ పాత వాహనాలను ఉపయోగిస్తున్నారు.

Delhi Petrol Stations

కాలం చెల్లిన వాహనాలను వాడుతూ, బంకుల వద్ద ఇంధనాన్ని నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పెట్రోల్ బంకుల వద్ద వాహనం వయస్సును ఖచ్చితంగా గుర్తించగల AI కెమెరాలు ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం తాజాగా ప్రారంభించింది. పెట్రోల్ బంకులు కేవలం ఇంధనం నింపే స్థలాలుగా మాత్రమే కాకుండా, వాటిని స్మార్ట్ టెక్నాలజీతో మార్చారు. తాజాగా ఏర్పాటు చేసిన AI కెమెరాలు బంకులోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని నిశితంగా, ఖచ్చితంగా గమనిస్తున్నాయి.

బంకులోకి వచ్చిన వాహనం నంబర్‌‌ను AI కెమెరాలు స్కాన్ చేసి, ఆ వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం, అంటే దాని వయస్సు, కాలుష్య ధృవీకరణ పత్రం గడువు, ఇతర గుర్తింపు వివరాలు అన్ని కూడా తక్కువ సమయంలో సేకరిస్తాయి. వాహనం మరీ పాతదిగా ఉందా? కాలుష్య పరంగా ప్రమాదకరంగా ఉందా? లేదా దాని పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ గడువు మించిపోయిందా? అనే అన్ని వివరాలను సేకరిస్తుంది.

Delhi Petrol Stations Ai Camera

గడువు మీరిన వాహనం అయితే వెంటనే దానికి ఇంధనం నింపడం ఆపేస్తారు. స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి వాహనం వివరాలను క్షణాల్లోనే బంకు సిబ్బంది తెలుసుకుంటారు. దీంతో పాత వాహనాలను వాడుతున్న వారు ఇకపై ఇంధనం నింపుకోవడం అసాధ్యం. ఇది కేవలం నియంత్రణ చర్య కాదు. ఇది ప్రజల్లో బాధ్యతను పెంచే ప్రయత్నం. వాహన యజమానులు ఇకపై తమ వాహన పరిస్థితిపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

నగరంలోని పెట్రోల్ పంపుల వద్ద ఇప్పుడు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ANPR) టెక్నాలజీ ఉన్న కెమెరాలు దర్శనమిస్తున్నాయి. పాత వాహనాలను నగరంలోని పెట్రోల్ పంపుల వద్ద నుంచే నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇకపై నగర వీధుల్లో పాత పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం క్రమంగా తగ్గనుంది. వాతావరణాన్ని రక్షించడానికే ఈ చర్యలు. ప్రస్తుతం ఉన్న 500 బంకు‌లలో 477లలో ఇప్పటికే ఈ టెక్నాలజీ అమలులోకి వచ్చిందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

Anpr Cameras Implementing In Petrol Stations

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 23, 2025, 17:50 [IST]
English summary
Anpr cameras implementing in delhi petrol stations to check vehicles age details
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+