Anushka Sharma హెల్మెట్ లేకుండా బైక్‌పై అమితాబ్, అనుష్క.. ముంబయి పోలీసులకు నెటిజన్ల కంప్లయింట్
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఇటీవల ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. బైక్‌పై ప్రయాణించేవారు కొంత సులువుగానే ట్రాఫిక్‌ను అధిగమించవచ్చు. కానీ కార్లలో ప్రయాణించేవారికి అది అసాధ్యం. ఇది సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం పెద్ద తలనొప్పిగా మారింది. ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి బైకర్ల సాయం తీసుకుంటున్నారు. అదే వారిని చిక్కుల్లో పడేసింది. ఓ వైపు వారి సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నా.. మరో వైపు విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే..
మొన్న అమితాబ్.. నిన్న అనుష్క శర్మ.. ఇద్దరూ పెద్ద సెలబ్రిటీలే. ముంబైలో ఇటీవల అమితాబ్ కారులో షూటింగ్‌కు వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు అటుగా వెళ్తున్న బైకర్ సాయంతో లొకేషన్‌కు సమయానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని ఫొటోతో సహా అమితాబ్ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. సాయం చేసినందుకు థాంక్స్ బడ్డీ అంటూ ధన్యవాదాలు తెలిపారు. తాజాగా అనుష్క కూడా అలాంటి పరిస్థితినే ఫేస్ చేసింది.

అనుష్క తన రేంజ్ రోవర్ కారులో షూటింగ్‌కు వెళ్తుండగా దారిలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అనుష్క తన బాడీగార్డ్ బైక్(Bazaz Pulsar 220) పై అతని సాయంతో షూటింగ్‌కు బయలుదేరింది. ఆ వీడియోను అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనుష్క తన రేంజ్ రోవర్ కారును పార్క్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు.. కానీ ఆమె షూటింగ్ తొందరలో రోడ్డు బ్లాక్ దృశ్యాలను షేర్ చేయలేదు.
అనుష్క సింప్లిసిటీకి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారి సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఓ వైపు ఇలా ఉంటే మరో వైపు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నెటిజన్ల విమర్శలకు తావిస్తోంది. మొన్న అమితాబ్.. నేడు అనుష్క.. ఇద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడంతో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. సమయానికి గమ్య స్థానం చేరుకోవడం అవసరమే.. అంతకంటే ముందుగా బాధ్యత, జాగ్రత్త కూడా ముఖ్యమంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇద్దరినీ బెక్ ఎక్కించుకొని డ్రైవ్ చేసినవాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో హెల్మెట్ పెట్టుకోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రూల్స్ సామాన్యులకేనా.. సెలబ్రిటీలకు కాదా అంటూ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ విషయాన్ని ట్రాఫిక్ విభాగం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కానీ వారిపై చర్యలు తీసుకున్నారో లేదో తెలుపలేదు.
ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం రైడర్ భద్రతకు చాలా అవసరం. భారత్‌లో హెల్మెట్ ధరించడం ప్రభుత్వం చట్టపరం చేసింది. హెల్మెట్‌ను పట్టీలతో తలకు భద్రపరచడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అది నిరుపయోగంగా మారుతుంది. దానిని సరిగా అమర్చుకోవాలి. హెల్మెట్‌లు పెద్ద వాహనాల ద్వారా జరిగే ప్రమాదాల నుండి రక్షించలేనప్పటికీ, అనేక ఇతర పరిస్థితుల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం అమితాబ్.. ప్రభాస్ హీరీగా నటిస్తున్న 'ప్రాజెక్టు కె'(Project K) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల, అతను రిభు దాస్‌గుప్తా రచన, దర్శకత్వం వహించిన సెక్షన్ 84 సినిమా షూటింగ్‌లోనూ తిరిగి బిజీ అయిపోయారు. ఇందులో డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ మరియు నిమ్రత్ కౌర్ నటిస్తున్నారు. అనుష్క.. భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'చక్దా ఎక్స్‌ప్రెస్'లో నటిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








