ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిఎల్ (Apple) తమ సరికొత్త 14 సిరీస్ ఐఫోన్లను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు ఈ ఐఫోన్లు కార్ల కోసం ఉపయోగపడే ఓ సరికొత్త ఫీచర్‌ తో అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర సమయాల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 14 మరియు కొత్త తరం యాపిల్ వాచ్ రెండూ కూడా కారు ప్రమాదానికి గురైనప్పుడు గుర్తించి, ఆటోమేటిక్‌ గా ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేస్తాయి. ఈ కొత్త ఫీచర్ రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఇది కొత్త తరం యాపిల్ పరికరాలలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ గురించి ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ విడుదల సందర్భంగా కంపెనీ వెల్లడి చేసింది. దీంతో, ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ ఫీచర్ హాట్ టాపిక్ గా మారింది.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన టెక్ బ్రాండ్‌ లలో యాపిల్ (Apple) కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రియులు కోరుకునే అత్యుత్తమ ఫోన్లలో ఐఫోన్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బ్రాండ్ అందించే నాణ్యమైన ఉత్పత్తులు మరియు ఈ స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ పట్ల కొనుగోలుదారులలో చాలా నమ్మకం ఉంది.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

యాపిల్ మొదటిసారిగా జనవరి 2007లో ఐఫోన్ (Apple iPhone) ని ప్రారంభించింది. గత 15 ఏళ్లలో ఐఫోన్ 13 సార్లు అప్‌గ్రేడ్ చేయబడింది. ఇప్పుడు ఇందులో లేటెస్ట్ 14వ వెర్షన్ సెప్టెంబర్ 7, 2022 వ తేదీన విడుదల చేయబడింది. యాపిల్ తమ ఫోన్లను అప్‌గ్రేడ్ చేసినట్లుగానే యాపిల్ వాచ్‌ ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఈ కొత్త పరికరాలు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ మరియు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

ప్రమాద సమయంలో క్రాష్‌ ను మరింత ఖచ్చితంగా గుర్తించడానికి, యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) క్యాబిన్ ప్రెజర్ మార్పులను గుర్తించడానికి అంతర్నిర్మిత బేరోమీటర్‌ ను ఉపయోగిస్తుంది. అలాగే, క్రాష్ తర్వాత కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో వేగంలో తీవ్రమైన మార్పును గుర్తించడానికి జిపిఎస్ కూడా ఉపయోగించబడుతుంది. కారు ప్రమాదంలో సంభవించే శబ్దాలకు సమానమైన పెద్ద శబ్దాలను గుర్తించడానికి మైక్రోఫోన్ ఉపయోగించబడుతుంది.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

ఇలా అన్ని సెన్సార్లు కలిసికట్టుగా పనిచేసి, కారు ప్రమాదానికి గురైనట్లుగా నిర్ణయించుకున్న తర్వాత ఐఫోన్ 14 లేదా యాపిల్ స్మార్ట్‌వాచ్ ఆటోమేటిక్‌ గా ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. యాపిల్ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఆపిల్ వాచ్ సెగ్మెంట్‌లోనే అత్యంత సున్నితమైన మరియు డైనమిక్ యాక్సిలెరోమీటర్‌ తో వస్తుంది మరియు ఇది క్రాష్‌ ను గుర్తించడానికి అంతర్నిర్మిత గైరోస్కోప్‌ తో కలపబడి ఉంటుంది.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

మిలియన్ల కొద్దీ గంటల రియల్ వరల్డ్ డ్రైవింగ్ మరియు వేలాది క్రాష్‌ ల నుండి డేటాను సేకరించి మరియు పర్యవేక్షించిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ కోసం అల్గోరిథం వ్రాయబడిందని యాపిల్ పేర్కొంది. ఈ ఫీచర్ పనిచేసే విధానం చాలా సులభంగా ఉంటుంది. అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, వాహనం క్రాష్‌ను గుర్తించిన తర్వాత, ఐఫోన్‌తో పాటు ఆపిల్ వాచ్‌లో కూడా నోటిఫికేషన్ పాప్ అప్ అవుతుంది. యూజర్ ఈ నోటిఫికేషన్‌ కు 10 సెకన్లలోపు స్పందించకపోతే, ఫోన్‌ లో సేవ్ చేసిన ఎమర్జెన్సీ సేవలకు మరియు ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ లకు ఐఫోన్ ఆటోమేటిక్‌ గా కాల్ చేస్తుంది.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

యాపిల్ తాజాగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్, యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఎస్‌ఇ మరియు యాపిల్ వాచ్ అల్ట్రాతో సహా మొత్తం ఐఫోన్ 14 సిరీస్‌ లో అత్యవసర కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఐఫోన్ 14 ఇప్పుడు మొట్టమొదటిసారిగా శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ తో అందుబాటులోకి వచ్చింది. ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ సాయంతోనే ఎమర్జెన్సీ కాలింగ్ మరియు ఎస్ఓఎస్ సాధ్యమవుతుంది. ఈ టెక్నాలజీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి తమకు ఏళ్ల సమయం పట్టిందని కంపెనీ తెలిపింది.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

ఐఫోన్ 14 ఫోన్లు ఇప్పుడు భౌతిక సిమ్ కార్డులను కలిగి ఉండవు. అంటే, వినియోగదారులు వీటిలో భౌతికంగా ఎలాంటి సిమ్‌ కార్డులను ఉంచడానికి వీలుండదు. ఇవన్నీ రిమోట్ నెట్‌వర్క్ ద్వారానే పనిచేస్తాయి. దీనినే ఇసిమ్ (eSim) టెక్నాలజీగా కంపెనీ పిలుస్తోంది. అయితే, అమెరికాలో విక్రయించబడే ఐఫోన్లు మాత్రమే ఇసిమ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇతరదేశాలలో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ఐఫోన్ 14 ధరలు 799 డాలర్ల (రూ.80,000) నుండి ప్రారంభమవుతాయి.

ఐఫోన్ 14 మరియు యాపిల్ వాచ్ 8 లలో ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్.. యాక్సిడెంట్స్ సమయంలో ఇదెలా పనిచేస్తుందంటే..?

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ కూడా తమ కార్లలో ఇలాంటి ఫీచర్‌ను అందించేది. ఫోర్డ్ మొదటిసారిగా తమ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసినప్పుడు అందులో ఫోర్డ్ సింక్ పేరుతో ఓ టెక్నాలజీని అందించింది. ఇది డ్రైవర్ యొక్క స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కారు ప్రమాదానికి గురైనప్పుడు కారులోని సెన్సార్లు దానిని గుర్తించి, ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ నెంబర్లు మరియు ఎమెర్జెన్సీ కాంటాక్ట్ లకు ఫోన్ వెళ్లేలా చేస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2022, 8:00 [IST]
English summary
Apple iphone 14 and apple watch 8 gets emergency calling feature during accidents
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+