ఇకపై యాపిల్ ఐఫోన్లతో డ్రైవింగ్‌లో టెక్స్టింగ్ చేయటం కుదరదు!

By Ravi

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని నెత్తినోరు బాదుకొని చెబుతున్నా కొందరు డ్రైవర్లు ఈ విషయాన్ని పెడచెవిన పెట్టి, ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి డ్రైవర్ల అలవాటుకు చెక్ పెట్టేందుకు అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఓ కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. వాహనం నడుపుతున్న డ్రైవర్లు తమ మొబైల్ ద్వారా టెక్స్టింగ్ (మెసేజ్ చేయటం) కుదరకుండా ఉండేలా యాపిల్ ఓ కొత్త సిస్టమ్‌ను డెవలప్ చేస్తోంది.

ఈ సిస్టమ్ కోసం యాపిల్ సంస్థ ఇప్పటికే ఓ పేటెంట్ అప్లికేషన్‌ను కూడా ఫైల్ చేసిది. ఈ సిస్టమ్ 'లాక్-అవుట్ మెకానిజమ్స్'ను క్రియేట్ చేసి, డ్రైవర్ వాహనం నడుపుతున్న టెక్స్టింగ్ చేయటం వంటి కొన్ని ఫంక్షన్లను పనిచేయకుండా ఉండేలా చేస్తుంది. ఒకవ్యక్తి ఎంత వేగంగా కదులుతున్నాడో అనేదానిని మొబైల్ ఫోన్‌లోని సెన్సార్లు గుర్తించి, సదరు వ్యక్తి డ్రైవింగ్ సీట్‌లో ఉన్నాడా లేక వాహనం సేఫ్ ఆపరేటింగ్ ఏరియాలో ఉందా అనే విషయాన్ని గ్రహించి పనిచేస్తుంది.

ఈ సిస్టమ్‌కు సంబంధించిన మరింత టెక్నికల్ సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డ్రైవింగ్‌లో టెక్స్టింగ్ చేయటం కుదరదు

వాహనానికి ఎలాంటి మోడిఫికేషన్లు లేదా అదనపు పరికరాలను జోడించనవసరం లేకుండా, చేతిలో ఇమిడే కంప్యూటింగ్ డివైజ్ ద్వారా ఈ లాక్-అవుట్ మెకానిజం సాధ్యమవుతుందని పేటెంట్‌లో పేర్కొన్నారు.

డ్రైవింగ్‌లో టెక్స్టింగ్ చేయటం కుదరదు

ఈ డివైజ్ మోషన్ అనలైజర్ (కదలికను అంచనా వేయటం), సీనరీ అనలైజర్ (పరిసరాలను అంచనా వేయటం) మరియు లాక్-అవుట్ మెకానిజంల కలయికతో పనిచేస్తుంది.

డ్రైవింగ్‌లో టెక్స్టింగ్ చేయటం కుదరదు

ఇందులో మోషన్ అనలైజర్ ద్వారా ఫోన్ డ్రైవర్ చేతిలో ఉన్నప్పుడు అతను ఎంత వేగంతో చలనంలో ఉన్నాడనే విషయాన్ని అంచనా వేసి, ఆ వేగం ఫోనులో నిర్దేశిత వేగం కంటే ఎక్కువగా ఉందా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని పనిచేస్తుంది.

డ్రైవింగ్‌లో టెక్స్టింగ్ చేయటం కుదరదు

అలాగే ఇందులోని సీనరీ అనలైజర్ ద్వారా ఫోన్‌ను కలిగి ఉన్న డ్రైవర్ తన వాహనం సురక్షితమైన ప్రదేశంలో ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించి దానికి అనుగుణంగా పనిచేస్తుంది.

డ్రైవింగ్‌లో టెక్స్టింగ్ చేయటం కుదరదు

ఇకపోతే లాక్-అవుట్ మెకానిజం అనేది పై రెండింటి (మోషన్ అనలైజర్, సీనరీ అనలైజర్) నుంచి వచ్చే సమాచారానికి లోబడి పనిచేస్తుంది. మోషన్ అనలైజర్ ద్వారా ఫోన్‌ను కలిగి ఉన్న వ్యక్తి నిర్దేశిత వేగం కన్నా ఎక్కువ వేగంతో గమనంలో ఉన్నప్పుడు ఫోన్‌లో ఒకటి లేదా మరిన్ని ఫంక్షన్లను పనిచేయకుండా చేయటం అలాగే సీనరీ అనలైజర్ ద్వారా వాహనం సురక్షిత ప్రదేశంలో ఉన్నప్పుడు ఫోన్‌లో ఒకటి లేదా మరిన్ని ఫంక్షన్లను పనిచేసేలా చేసేందుకు ఈ లాక్-అవుట్ మెకానిజం సహకరిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 29, 2014, 10:17 [IST]
English summary
American tech giant Apple has filed a patent application for a system that aims to make texting at the wheel impossible by blocking drivers from sending messages on cell phones.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+