రూ.4.18 కోట్ల విలువైన లంబోర్ఘినీ ఉరుస్‌ S కొనుగోలు చేసిన ఏఆర్‌ రెహమాన్‌.. ఈ సూపర్‌ కారులో ఎన్నో స్పెషాలిటీస్‌.

లగ్జరీ కార్లంటే ఇష్టపడని వారుండరు. ఇక సెలబ్రిటీలు అయితే వాళ్ల గ్యారేజ్‌లో పక్కాగా ఖరీదైన కారు ఉండాల్సిందే. లగ్జరీ కార్లలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు బయటకు వస్తే ఇక ఫ్యాన్స్‌కి పండగే. వివిధ రంగాల్లోని సెలబ్రిటీస్‌ తమకు నచ్చిన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకుంటారు. తాజాగా ఏఆర్‌ రెహమాన్‌(AR Rahman) ఓ సూపర్‌ కారును కొనుగోలు చేశారు.

వినసొంపైన, హృదయాలకు హత్తుకునే సంగీతాన్ని అందించి ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌తో పాటు ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ గురించి తెలియని వారుండరు. ఆయనకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. కాగా ఇటీవల ఏఆర్ రెహమాన్ కొత్త లగ్జరీ(Luxury Cars) కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.

a-r-rahman-lamnborghini-urus-s

ఏఆర్ రెహమాన్ రూ.4.18 కోట్ల విలువైన సరికొత్త లంబోర్ఘినీ ఉరుస్ ఎస్(Lamborghini Urus S) సూపర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు సమాచారం. రెహమాన్‌ తన కొత్త కారులో రోడ్డుపై ప్రయాణిస్తున్న చిత్రాలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. AR రెహమాన్ తన నివాసంలోని గ్యారేజీకి కొత్తగా తీసుకువచ్చిన లంబోర్ఘిని ఉరుస్ S చిత్రాలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు.

ఏఆర్‌ రెహమాన్‌ తన కొత్త లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్‌ కారుతో తమిళనాడులో చెన్నైలోని స్టూడియో ఎదుట నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. AR రెహమాన్ కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరుస్ S బియాంకో మోనోసెరాస్ యొక్క క్లాసీ షేడ్‌లో ఆకర్షణీయంగా ఉంది. లంబోర్ఘిని ఉరుస్ S SUV 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 657 బీహెచ్‌పీ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

a-r-rahman-lamnborghini-urus-s

ఈ ఇంజిన్‌తో కూడిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా 4 వీల్స్‌కు శక్తి సరఫరా అవుతుంది. ఇదే ఇంజిన్‌ను లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే మోడల్‌లోనూ ఉపయోగించారు. ఉరుస్ S మరియు దాని పెర్ఫార్మంటే ఒకే మోడల్‌ ఇంజిన్‌తో నడుస్తాయి. కానీ ఉరుస్‌ ఎస్‌యూవీ యొక్క కొత్త S మోడల్ దాని ఇతర మోడళ్లతో పోలిస్తే 47 కిలోలు బరువు ఎక్కువగా ఉంటుంది.

ఈ కారు మొత్తం బరువు 2,197 కిలోలు (కెర్బ్ వెయిట్). ఈ లంబోర్ఘిని ఉరుస్ S మోడల్ 3.5 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కొత్త మోడల్ గరిష్ఠ వేగం గంటకు 305 కి.మీ. కొత్త ఉరుస్ S దాని పనితీరు ఇతర మోడళ్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.

https://www.facebook.com/AutomobiliArdent

కొత్త ఉరుస్‌ Sలో కొత్త ఫ్రంట్ బంపర్‌ను అందించారు. ఇది ఎంట్రీ-లెవల్ ఉరుస్ కంటే కొంచెం ఎక్కువ యాంగిల్‌లో ఉంటుంది. ఈ కొత్త Urus S కూడా ఒక కొత్త బానెట్‌తో వస్తుంది. అయితే పెర్ఫార్మంటేలో మాదిరిగా తేలికైన ఇందులో కార్బన్-ఫైబర్ లేదు. ఉరుస్ ఎస్ యజమానులు కార్బన్ ఫైబర్ రూఫ్‌ని ఆప్షన్‌గా తీసుకోవచ్చు.

ఉరుస్ S SUV పొడవు 5,112 mm, వెడల్పు 2,018 mm మరియు ఎత్తు 1,638 mm, వీల్‌బేస్ 3,003 mm. లంబోర్ఘిని ఉరస్ S SUVలో స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా, ఇగో, టెర్రా, నెవ్ మరియు సబ్బియా అనే 7 డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. లంబోర్ఘిని ఉరస్ S డిజైన్‌ను పెర్ఫార్మంటే మోడల్ ఆధారంగా తీసుకున్నారు.

ఉరుస్ Sలో 21-అంగుళాల స్టాండర్డ్‌ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. కస్టమర్లు 22 మరియు 23-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా ఎంచుకునే సదుపాయం ఉంది. వాటిలో కొన్ని కొత్త డిజైన్లను ఉండటం విశేషం. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ మోడల్ ఇంటీరీయర్‌ పార్ట్‌లో లగ్జరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరింత ఆకర్షణీయంగా సౌకర్యంగా తీర్చిదిద్దారు.

More from DriveSpark

Article Published On: Saturday, September 23, 2023, 18:42 [IST]
English summary
Ar rahman buys new lamborghini urus s suv price specs and engine details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+