Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 20 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..
భారతదేశంలో పురాతన క్లాసిక్ కార్ల విషయానికి వస్తే, టక్కున గుర్తుకు వచ్చేది అంబాసిడర్ బ్రాండ్. అయితే, అంబాసిడర్ కార్ల కాలంలోనే మనకు తెలియని మరో పాపులర్ కార్ బ్రాండ్ కూడా ఉంది. అదే, కేరళకు చెందిన అరవింద్ మోటార్స్.

అరవింద్ మోటార్స్ తయారు చేసిన 'మోడల్ -3' కారుని ముద్దుగా "బేబీ" అని పిలిచే వారు. భారతీయ మెకానిక్, కున్నాథ్ అయ్యత్ బాలకృష్ణ మీనన్ ఆలోచనలకు రూపమే ఈ మోడల్ 3. ఈయనను కె. ఎ. బి. మీనన్ అని కూడా పిలుస్తారు.

అరవింద్ ఆటోమొబైల్స్ సంస్థ 1996లో ఈ బేబీ కారుకి ప్రాణం పోసింది. అరవింద్ ‘బేబీ' మోడల్ 3 రోజువారీ భారతీయ కారు కావాలని మీనన్ కోరుకునేవారు. కేరళకు చెందిన కెఎబి మీనన్ ఒక ప్రొఫెషనల్ కార్ మెకానిక్. అతనే ఈ కారును సొంతంగా రూపొందించి, తయారు చేయటం కూడా ప్రారంభించాడు.
MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

మీనన్ ఈ కారు తయారీలో బయటి సంస్థల నుండి ఎలాంటి సహాయాన్ని ఆశించలేదు. మీనన్ ఈ కారును భారతదేశంలోని సాధారణ పౌరులకు పరిచయం చేయాలనుకున్నారు. వాస్తవానికి, 1960 కాలంలలో, భారతదేశంలోకి వచ్చిన అనేక కార్ కంపెనీలు అమెరికా మరియు ఐరోపాకు దేశాలకు చెందినవే.

అలాంటి సమయంలో ఒక సాధారణ భారతీయుడు, ఓ కార్ కంపెనీని తెరవడం అంటే చాలా పెద్ద విషయమనే చెప్పాలి. అరవింద్ మోడల్ -3 డిజైన్‌ను గమనిస్తే, ఇది కొంతవరకు అమెరికన్ కారు కాడిలాక్ నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది.
MOST READ:రోడ్లపై గుంతలు పూడ్చే ప్రత్యేక యంత్రం.. నిజంగా సూపర్ గురూ

ఈ కారు ముందు వైపు పొడవైన బోనెట్ ఉంటుంది, అలాగే వెనుక భాగంలో కూడా అంతే సమానమైన బూట్ కూడా ఉంటుంది. అప్పట్లో ఇదొక ఫుల్ సైజ్ సెడాన్ కారుగా ఉండి, యుఎస్ మరియు యూరప్ దేశాలలో మాత్రమే అందుబాటులో ఉండే కార్ల మాదిరిగా ఉండేది.

ఈ కారు డిజైన్ చాలా సరళమైనదే అయినప్పటికీ, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కారు హెడ్‌లైట్, గ్రిల్, విండోస్ మరియు ఇంటీరియర్‌లోని కొన్ని డీటేలింగ్స్పై క్రోమ్ ఫినిషింగ్‌ను చూడవచ్చు. కారు బోనెట్‌పై 'అరవింద్' అనే లోగో కూడా ముద్రించబడి ఉంటుంది.
MOST READ:టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

అరవింద్ మోడల్ 3 కారులో ఫియట్ నుండి సేకరించిన 1100 మోడల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఆ సమయంలో ఇది చాలా మంచి ఇంజన్‌గా పరిగణించబడేది. అప్పట్లో దేశంలో లభించే చాలా కార్లలో ఇదే ఇంజన్‌ను ఉపయోగించే వారు. తర్వాతి కాలంలో ఈ కారులో మెర్సిడెస్ బెంజ్ ఇంజన్ కూడా ఉపయోగించారు.

ఈ కారు తయారీలో ఉపయోగించిన చాలా భాగాలను అరవింద్ మోటార్స్ తమ ప్లాంట్‌లోనే స్వతహాగా చేతుల్తో తయారు చేసేది. అయితే, ఆ తర్వాతి కాలంలో పెరిగిన పోటీ, సరైన పెట్టుబడులు లేకపోవడం వంటి పలు కారణాల వల్ల మీనన్ తన వ్యాపారాన్ని విస్తరించడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
MOST READ:కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

మీనన్ 1970 కాలంలోఆర్థిక సహాయం కోసం భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు మరియు సంస్థను విస్తరించడానికి లైసెన్స్‌ను కూడా కోరారు. కానీ, అప్పటి ప్రభుత్వం అరవింద్ మోటార్స్‌ను విస్మరించి మారుతికి లైసెన్స్ ఇచ్చింది. ఈ నిర్ణయం అరవింద్ మోటార్స్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

అరవింద్ మోటార్స్ చివరకు 1971లో తక్కువ అమ్మకాలు మరియు పెట్టుబడి లేకపోవడం వల్ల వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. అదే సంవత్సరంలో కెఎబి మీనన్ గుండెపోటుతో మరణించారు. మీనన్ మరణం తర్వాత ఆయన భార్య ఈ సంస్థ భాద్యతలను స్వీకరించింది.

అప్పటి భారత ప్రభుత్వం అరవింద్ మోటార్స్‌కి సహాయం చేసి ఉంటే, కేవలం రూ.5,000 లకే మీనన్ ఈ కారును మార్కెట్లో విడుదల చేసి ఉండేవారు. తిరువనంతపురంలో ఇది బాగా ప్రాచుర్యం పొందిన కారుగా చెబుతారు. అప్పట్లో చాలా మంది సినీ కళాకారులు కూడా ఈ కారును కొనుగోలు చేశారు.

కాగా, మీనన్‌కి చెందిన ఈ అరవింద్ మోటార్స్ కంపెనీ ప్రస్తుతం ఆన మనవరాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్ ఓ ఎలక్ట్రిక్ కారుతో తిరిగి మార్కెట్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.