గంటకు 240 కి.మీ వేగంతో వెళ్లే ఫ్లయింగ్ టాక్సీ.. త్వరలో వచ్చేస్తుందోచ్

ప్రపంచం అభివృద్ధి చెందుతున్న సమయంలో రోజు రోజుకి మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు చాలా మంది ఎగిరే కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీని కోసం చాలా కంపెనీలు ప్లైయింగ్ కార్లను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

గంటకు 240 కి.మీ వేగంతో వెళ్లే ఫ్లయింగ్ టాక్సీ.. త్వరలో వచ్చేస్తుందోచ్

ఫ్లయింగ్ కార్లు భవిష్యత్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం ఎగిరే కార్లను గురించి ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇందులో భాగంగానే ఇప్పుడు అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ తన మేకర్ ఫ్లయింగ్ టాక్సీని ప్రదర్శించింది. ఈ ఫ్లయింగ్ టాక్సీ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది.

గంటకు 240 కి.మీ వేగంతో వెళ్లే ఫ్లయింగ్ టాక్సీ.. త్వరలో వచ్చేస్తుందోచ్

ఈ ఫ్లయింగ్ టాక్సీ త్వరలో వినియోగంలోకి రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఫ్లయింగ్ టాక్సీ వేగవంతమైన ట్రాఫిక్ మార్గం. ఇంధనం నింపిన తర్వాత, ఈ ఫ్లయింగ్ టాక్సీ నలుగురు ప్రయాణీకులతో 100 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

గంటకు 240 కి.మీ వేగంతో వెళ్లే ఫ్లయింగ్ టాక్సీ.. త్వరలో వచ్చేస్తుందోచ్

మేకర్ ఫ్లయింగ్ టాక్సీని తయారుచేసే ఆర్చర్ ఏవియేషన్ ఇప్పుడు కమర్షియల్ విమాన తయారీ కాకుండా ఎగిరే టాక్సీలపై ద్రుష్టి సారిస్తోంది. కమర్షియల్ ఫ్లయింగ్ టాక్సీలు నగరాలు మరియు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున రవాణా చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఆర్చర్ ఏవియేషన్ తెలిపింది.

గంటకు 240 కి.మీ వేగంతో వెళ్లే ఫ్లయింగ్ టాక్సీ.. త్వరలో వచ్చేస్తుందోచ్

ఫ్లయింగ్ టాక్సీలు ఇంటర్-సిటీ రవాణాను ఎంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే వీటిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం నిజంగా సవాలుతో కూడుకున్న పని. ఈ ఫ్లయింగ్ టాక్సీలలో నాలుగు డాలర్లు చెల్లించి ఒక మైలు దూరం ప్రయాణించవచ్చని ఆర్చర్ ఏవియేషన్ కంపెనీ తెలిపింది.

గంటకు 240 కి.మీ వేగంతో వెళ్లే ఫ్లయింగ్ టాక్సీ.. త్వరలో వచ్చేస్తుందోచ్

ఈ ఫ్లయింగ్ టాక్సీలో ప్రయాణం కొంత ఖరీదైనప్పటికీ ఆఫీస్ లేదా ఇతర పనులకోసం త్వరగా వెళ్లడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా వారి విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఆర్చర్ ఏవియేషన్ 2024 నాటికి యుఎస్, లాస్ ఏంజిల్స్ మరియు మయామిలలో వాణిజ్యపరంగా ఫ్లయింగ్ టాక్సీలను ప్రారంభించనుంది.

గంటకు 240 కి.మీ వేగంతో వెళ్లే ఫ్లయింగ్ టాక్సీ.. త్వరలో వచ్చేస్తుందోచ్

కానీ ఈ ఫ్లయింగ్ టాక్సీల కోసం ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందడానికి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇద్ధి ఒక సారి అమలులోకి వచ్చిన తరువాత చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్ మరిన్ని నగరాల్లో త్వరగా వ్యాపి చెందే అవకాశం కూడా వుంది. భవిష్యత్ తరాలు రానున్న కాలంలో ఈ ఫ్లయింగ్ టాక్సీలు ఎక్కువగా ఉపయోగించనున్నారు.

Most Read Articles

English summary
Archer Aviation Showcases Maker Flying Taxi In America. Read in Telugu.
Story first published: Saturday, June 12, 2021, 11:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X